Main Menu

సాక్షిలో కూడా ప్ర‌వేశించిన పీకే!

Spread the love

జ‌గ‌న్ రాజ‌కీయ స‌ల‌హాదారు కొద్దిరోజుల క్రితం రాజ‌కీయ ఆరంగేట్రం చేశారు. జేడీయూలో చేరారు. గ‌త ఎన్నిక‌ల్లో మోడీకి పీఠం ద‌క్క‌డానికి కీల‌క వ్యూహాలు ర‌చించిన ఆయ‌న ప్ర‌స్తుతం మోడీ పాల‌న‌కు ముగింపు ద‌శ‌లో ఉంద‌నే అంచ‌నాతో ఉన్నారు. ఈ నేప‌థ్యంలో పీకే పొలిటిక‌ల్ ఫ్యూచ‌ర్ ఆస‌క్తిగా మారింది.

అదే స‌మ‌యంలో వైఎస్ జ‌గ‌న్ తో కాంటాక్ట్ లో భాగంగా ఇప్ప‌టికే ప‌లు కార్య‌క్ర‌మాల‌కు వ్యూహ‌ర‌చ‌న చేశారు. అందుకు కొన‌సాగింపుగా జ‌గ‌న్ అధికార పత్రిక‌లో కూడా ప్ర‌శాంత్ కిషోర్ వేలు పెట్టిన‌ట్టు ప్ర‌చారం సాగుతోంది. ప్ర‌స్తుతం సాక్షి మీడియా సంస్థ‌ల నిర్వ‌హ‌ణ‌లో పీకే స‌న్నిహితుడికి చోటు ద‌క్కుతుండ‌డం అందులో భాగమేన‌ని భావిస్తున్నారు. వ‌చ్చే ఎన్నిక‌ల‌ను ల‌క్ష్యంగా చేసుకుని సాక్షి సంస్థ‌ల్లో కీల‌క మార్పులు చేప‌డుతున్నారు. అందులో భాగంగా విన‌య్ మ‌హేశ్వ‌ర్ అనే సీనియ‌ర్ ఎడిట‌ర్ ని తెర‌మీద‌కు తీసుకొస్తున్నారు. సాక్షి సంస్థ‌ల ఎడిటోరియ‌ల్ బోర్డులో ఆయ‌న‌కు కీల‌క స్థానం కేటాయించ‌బోతున్నారు.

ప్ర‌స్తుతం కె రామ‌చంద్ర‌మూర్తి ప్ర‌ధాన పాత్ర‌లో ఉన్నారు. అయితే ఆయ‌న తీరు ప‌ట్ల సాక్షి యాజ‌మాన్యంలో ఎలా ఉన్న‌ప్ప‌టికీ సిబ్బందిలోనూ, జ‌గ‌న్ అభిమానుల్లోనూ అసంతృప్తి, అనుమానాలు కూడా ఉన్నాయి. ఈ త‌రుణంలో విన‌య్ మ‌హేశ్వ‌ర్ ముందుకు రావ‌డం విశేషంగా మారుతోంది. అది కూడా పీకే సూచ‌న‌తో ఆయ‌న‌కు పీఠం కేటాయిస్తుండ‌డంతో సాక్షిలో మ‌రిన్ని కీల‌క మార్పులు అనివార్యంగా భావిస్తున్నారు.

ప్ర‌స్తుతం ఎడిట‌ర్ వ‌ర్థెల్లి ముర‌ళీ కొన‌సాగుతార‌ని, రామ‌చంద్ర‌మూర్తి కాంటాక్ట్ పిరియ‌డ్ ముగిసిన‌ప్ప‌టికీ కొన‌సాగిస్తునూ విన‌య్ కి ఎగ్జిక్యూటివ్ డైరెక్ట‌ర్ ప‌ద‌వి క‌ట్ట‌బెట్టి కీల‌క బాధ్య‌త‌లు అప్ప‌గించ‌బోతున్నార‌ని ప్ర‌చారం సాగుతోంది. దాంతో ఈ మార్పులు ఆస‌క్తి రేపుతున్నాయి. ఇప్ప‌టికే సాక్షి ప‌త్రిక స‌ర్క్యులేష‌న్ విష‌యంలో జ‌గ‌న్ తీసుకున్న నిర్ణ‌యం కొంత క‌ద‌లికను తీసుకొచ్చింది. రాష్ట్రంలోని ప్ర‌తీ నియోజ‌క‌వ‌ర్గ ఇన్ఛార్జ్ వెయ్యి కాపీల‌ను కార్య‌క‌ర్త‌ల‌కు పంపించేలా బాధ్య‌త‌లు తీసుకున్నారు. దాంతో ఒకేసారి భారీగా స‌ర్క్యులేష‌న్ పెరిగిన‌ట్టుగా భావిస్తున్నారు. ఇక ఇప్పుడు ఎడిటోరియ‌ల్ బోర్డులో మార్పులు కూడా జ‌రిగితే సాక్షి రంగు, రుచిలో ఏమార్పులు వ‌స్తాయో చూడాలి.


Related News

టీవీ5పై నిషేధం న్యాయ‌మేనా?

Spread the loveప్ర‌జాస్వామ్యంలో ఫోర్త్ పిల్ల‌ర్ మీడియాకు ప్ర‌త్యేక ప్రాధాన్య‌త ఉంటుంది. కానీ రానురాను అది తారుమార‌వుతోంది. మీడియా రూపంRead More

‘సాక్షి’కి అన్యాయం జ‌రిగిందా..?

Spread the loveమీడియా ఓ రాజకీయ సాధ‌నంగా మారిపోయిన త‌ర్వాత పాల‌క‌ప‌క్షాలు ఇష్టారాజ్యంగా వ్య‌వ‌హ‌రించ‌డం విస్తృత‌మ‌య్యింది. గ‌తంలో కూడా కొంద‌రుRead More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *