Main Menu

మీడియా సంస్థ‌ల‌కు బాబు ఆఫ‌ర్

Chandrababu-naidu-serious-on-media-houses
Spread the love

నంద్యాల స‌భ‌లో జ‌ర్న‌లిస్టుల‌కు బంప‌రాఫ‌ర్ ప్ర‌క‌టించిన చంద్ర‌బాబు దృష్టి ఇప్పుడు మీడియా యాజ‌మాన్యాల మీద మ‌ళ్లింది. పాత్రికేయుల‌కు ట్రిపుల్ బెడ్ రూమ్ ఇళ్లునిర్మిస్తామ‌ని చెప్పిన చంద్ర‌బాబు ఇప్పుడు స్థ‌లాలు కూడా ఇస్తామ‌ని ప్ర‌క‌టించారు. అమ‌రావ‌తిలో జ‌ర్న‌లిస్టుల‌కు ఇళ్ల‌స్థ‌లాలిస్తామ‌న్నారు. కోరుకున్న చోట ఇళ్ల‌స్థ‌లాలు ఇచ్చే ఆలోచ‌న ఉంద‌న్నారు. జిల్లాల్లో ప‌నిచేస్తున్న వారికి కూడా ఇళ్ల‌స్థలాలు కేటాయిస్తామ‌న్నారు.

అదే స‌మ‌యంలో మీడియా సంస్థ‌ల‌కు అమ‌రావ‌తిలో స్థ‌లాలు కేటాయించ‌బోతున్న‌ట్టు తెలిపారు. విధి విధానాలు రూప‌క‌ల్ప‌న చేస్తున్న‌ట్టు చంద్ర‌బాబు ప్ర‌క‌టించారు. దాంతో మీడియా సంస్థ‌ల్లో మ‌రోసారి క‌ల‌క‌లం ఖాయం. చంద్ర‌బాబును మ‌చ్చిక చేసుకోవ‌డానికి మీడియా సంస్థ‌ల‌న్నీ ప్ర‌య‌త్నించ‌డం అనివార్యం. స‌ర్కారీ పెద్ద‌ల‌కు ఇబ్బంది క‌లిగించేలా వ్య‌వ‌హ‌రిస్తే అమ‌రావ‌తి కేటాయింపుల్లో అన్యాయం అయిపోతామ‌ని మీడియా సంస్థ‌ల పెద్ద‌లు భావించే అవ‌కాశం ఉంటుంది. అందుకు త‌గ్గ‌ట్టుగానే నంద్యాల ఎన్నిక‌ల్లో చంద్ర‌బాబు కి న‌ష్టం క‌లిగించే రీతిలో వ్య‌వ‌హ‌రించ‌కుండా ఉండ‌డానికే తాజా చిట్ చాట్ లో సీఎం ఈ అంశాన్ని ప్ర‌స్తావించిన‌ట్టు క‌నిపిస్తోంది. అయితే ఎన్నిక‌ల కోడ్ ఉండ‌గా మీడియా సంస్థ‌ల‌కు చంద్ర‌బాబు ఆఫ‌ర్ ప్ర‌క‌టించ‌డం కోడ్ ఉల్లంఘ‌న కింద‌కు రాదా అన్న‌ది కొంద‌రి ప్ర‌శ్న‌.

ఇప్ప‌టికే నంద్యాల ఉప ఎన్నిక‌ల సంద‌ర్భంగా అక్క‌డ ప‌ర్య‌టించిన చంద్ర‌బాబు జ‌ర్న‌లిస్టుల ట్రిపుల్ బెడ్ రూమ్ ఇళ్ల‌ను ప్ర‌స్తావించారు. అది కూడా త‌మ‌కు అనుకూలంగా ఉన్న , ఇంకా చెప్పాలంటే తాము పాలుపోసి పెంచిన జ‌ర్న‌లిస్టు సంఘం నాయ‌కుడిని నంద్యాల పిలిపించుకుని అక్క‌డి స‌భ‌లో ఈ అంశాన్ని చెప్ప‌డం ద్వారా ఎన్నిక‌ల ప్ర‌యోజ‌నాలు ఆశించిన‌ట్టు ఇట్టే అర్థ‌మ‌వుతుంది. నంద్యాల ప‌ట్ట‌ణంతో పాటు మిగిలిన రెండు మండ‌లాల‌కు క‌లుపుకుంటే సుమారు 200 మంది జ‌ర్న‌లిస్టుంటారు. అంటే దాదాపుగా వెయ్యి ఓట్లు జ‌ర్న‌లిస్టు కుటుంబాల‌కు ఉన్న‌ట్టే. వాటి కోసమే చంద్ర‌బాబు ఇలాంటి ఎర‌వేశారా అన్న అనుమానం బ‌ల‌ప‌డుతోంది.

తాజాగా చంద్ర‌బాబు మాట‌ల‌ను ప‌రిశీలిస్తే నంద్యాల‌లో ట్రిపుల్ బెడ్ రూమ్ ఇళ్ల‌ని చెప్పి, ఇప్పుడు జ‌ర్న‌లిస్టుల‌కు ఇవ్వ‌డానికి స్థ‌లాలు ప‌రిశీలిస్తున్న‌ట్టు మాట్లాడ‌డం అనుమానాల‌కు తావిస్తోంది. అమ‌రావ‌తి స‌హా అన్ని జిల్లాల్లోనూ ఇళ్ల‌స్థ‌లాలు ఇస్తామ‌న‌డం సందేహాస్ప‌దంగా ఉంది. మూడేళ్లుగా జ‌ర్న‌లిస్టుల స్థ‌లాల విష‌యాన్ని దాదాపుగా విస్మ‌రించి ఇప్పుడు ఎన్నిక‌ల ముందు హ‌డావిడి చేయ‌డం వెనుక ఖచ్చితంగా ఓట్ల ప్ర‌యోజ‌నం ఆశించిన‌ట్టే క‌నిపిస్తోంది. అయితే నిజంగా చంద్ర‌బాబు ఇప్ప‌టికైనా త‌న మాట ప్ర‌కారం పాత్రికేయ కుటుంబాల‌ను ఆదుకోగ‌లిగితే మాత్రం సంతోష‌మే. మాట‌ల ప్రేమ కాకుండా చేత‌ల ద్వారా చూపించాల‌ని ఆశిద్దాం


Related News

ntv

స్వ‌రం స‌వ‌రించుకున్న చానెల్

Spread the loveతెలుగుమీడియాలో చాలాకాలంగా చంద్ర‌బాబుకి సానుకూల‌త ఉంటుంది. దానికి అనేక కార‌ణాలున్నాయి. సామాజిక స‌మీక‌ర‌ణాలు అందులో ఒక‌టి. ముఖ్యంగాRead More

The-Media

మీడియా సంద‌డి మొద‌ల‌య్యింది..!

Spread the loveమ‌ళ్లీ క‌ద‌లిక మొద‌ల‌య్యింది. తెలుగు మీడియాకి జోష్ వ‌చ్చిన‌ట్టు క‌నిపిస్తోంది. వ‌రుస‌గా మీడియా సంస్థ‌ల యాజ‌మాన్యాలు మారుతున్నాయి.Read More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *