చంద్రబాబు దొరికిపోయారు..

cbn deeksha
Spread the love

రెగ్యులర్ మీడియాకి , సోషల్ మీడియాకు ఉన్న ప్రధాన వైరుధ్యం ఇప్పటికే చంద్రబాబుకి అనేకమార్లు అనుభవంలోకి వచ్చింది. కానీ తాజాగా ఒక చిన్న కామెంట్ ఆయన పరువు తీస్తుందని అసలు ఊహించి ఉండరు. వాస్తవానికి ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియాలో అయితే ఇలాంటి విషయాలకు అంతగా ప్రాధాన్యత ఉండదు. కానీ రంధ్రాన్వేషణకు పెట్టింది పేరుగా మారిన సోషల్ మీడియాలో అవే వైరల్ అవుతాయి. అవుతున్నాయి కూడా.

తాజాగా తిరుపతి సభలో చంద్రబాబు సుదీర్ఘ ఉపన్యాసం మరోసారి నెటిజన్లకు మంచి అవకాశంగా మారింది. ఆయన అడ్డంగా దొరికిపోవడంతో బ్రిటీష్ వారితో పోరాడిన పార్టీ టీడీపీ అనే చిన్న విషయం పెద్ద వైరల్ గా మారింది. పైగా చంద్రబాబు మీద విపరీతంగా సెటైర్లు మొదలయ్యాయి. టీడీపీ శిబిరం తట్టుకోలేని స్థాయిలో సెటైర్లు వస్తున్నాయి. చంద్రబాబుని ట్రోల్ చేస్తూ వస్తున్న ట్వీట్లు, ఫేస్ బుక్ కామెంట్లు టీడీపీ శ్రేణులకు కంపరం పుట్టిస్తున్నాయి.

క్విట్ ఇండియా ఉద్యమం, స్వతంత్ర్య పోరాటం నాటి ఫోటోలు ఇప్పటికే జోరుగా సాగుతున్నాయి. ఇక పానిపట్టు యుద్ధం, రాబర్ట్ క్లైవ్, మౌర్య చంద్రగుప్తుడు వంటి వారితో పోల్చి చంద్రబాబు మీద వేస్తున్న జోకులు ఇప్పుడు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. ఇదంతా కేవలం చిన్న వ్యాఖ్య మూలంగానే అన్నది ఇప్పుడు టీడీపీ నేతలు సైతం వాపోతున్న విషయం. అందుకే సోషల్ మీడియా విషయంలో మరింత జాగ్రత్తలు పాటించాలి. నాయకులు ఎక్కడచిన్న పొరపాటు వ్యాఖ్య దొర్లించినా సోషల్ మీడియాలో ట్రోల్ చేసేయడం ఖాయం అని అర్థం చేసుకోవాలి.

ఇప్పటికే మొన్నటి జన్మదినం సందర్భంగా చేసిన దీక్ష వల్ల కలిగిన ప్రయోజనం కన్నా సోషల్ మీడియాలో దీక్ష ఖర్చుల మీద సాగిన ప్రచారంతో పెద్ద డ్యామేజ్ జరిగింది. ఇక తిరుపతి సభలో చేసిన కామెంట్ తో దాని కోసం చేసిన శ్రమంతా బూడిదలో పోసిన పన్నీరుగా మారింది. రాజకీయంగా ప్రస్తుతం టీడీపీకి దాదాపు అన్ని పార్టీలు ప్రత్యర్థులుగా మారిన నేపథ్యంలో సోషల్ మీడియాలో దాడి పెరిగింది. దానికి తగ్గట్టుగా టీడీపీ వ్యవహరించకపోతే మరింతగా తలనొప్పులు తప్పవనే చెప్పాలి.






Related News

media

తెలుగు మీడియా కళ్లు తెరవదా?

Spread the loveఏపీ రాజకీయ వ్యవహారాల్లో మాత్రం తెలుగు మీడియా తీరు భిన్నంగా ఉంటుంది. చంద్రబాబు అధికారంలో ఉన్న సమయంలోRead More

whatsapp fb

ఎఫ్ బీ, గూగుల్ కి నోటీసులు

Spread the loveప్రింట్ , ఎలక్ట్రానిక్ మీడియాలే కాదు డిజిటల్ మీడియాలో కూడా నిబంధనలు పాటించాల్సిందే. దానికి భిన్నంగా సాగితేRead More

  • మీడియా విషయంలో మనసు మార్చుకున్న జనసేన
  • చంద్రబాబు దొరికిపోయారు..
  • మహిళా జర్నలిస్టుపై వేధింపులు
  • ఆ చానెల్ ని జనసేన టేకోవర్ చేస్తుందా?
  • అయ్యో..ఆంధ్ర‌జ్యోతికి న‌కిలీల బెడ‌ద‌
  • మీడియా వాళ్లంతా నంగ‌నాచులా..?
  • ప‌వ‌న్ పై ఏబీఎన్ ఎదురుదాడి…
  • ఆ చానెల్ ని కూడా వ‌దిలిపెట్ట‌ని ప‌వ‌న్ క‌ళ్యాణ్
  • Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *