కేసుల్లో వైఎస్ జ‌గ‌న్ పేరుతో ఉన్న ఫేస్ బుక్ పేజ్

ys-jaganmohan-reddy
Spread the love

సోష‌ల్ మీడియా ప్ర‌భావం ప‌లు స‌మ‌స్య‌ల‌కు కూడా కార‌ణం అవుతోంది. అనేక అపోహ‌ల‌కు దారితీస్తోంది. తాజాగా అలాంటిదే విజ‌య‌వాడ‌లో జ‌రిగింది. జ‌గ‌న్ పాద‌యాత్ర న‌గ‌రంలో అడుగుపెడుతున్న స‌మ‌యంలో హ‌ల్ చ‌ల్ చేసిన ఒక వీడియో తీవ్ర క‌ల‌క‌లం రేపింది. జ‌గ‌న్ యాత్ర‌కు వెళుతున్న యువ‌త‌ను అడ్డుకున్నారంటూ ఆ వీడియోని పోస్ట్ చేసిన వారు ప్ర‌చారం చేయ‌డంతో దుమారానికి దారితీసింది. పోలీసులు ఇష్టారాజ్యంగా కొడుతున్న దృశ్యం క‌ల‌క‌లం రేపింది. అయితే తీరా చూస్తే స‌ద‌రు వీడియో యూపీకి చెందిన బీఎస్పీ కార్య‌క‌ర్త‌ల‌ద‌ని తేలింది. మొన్న‌టి ఏప్రిల్ 2 భార‌త్ బంద్ లో భాగంగా అందులో పాల్గొన్న ముగ్గురు యువ‌కుల‌పై పోలీసులు రెచ్చిపోయిన దృశ్యాల‌ని నిర్ధారించారు.

యూపీలో విజువ‌ల్స్ తీసుకుని ఏపీకి ఆపాదిస్తూ, బీఎస్పీ కార్య‌క‌ర్త‌ల‌ను వైసీపీ అభిమానులుగా పేర్కొంటూ సాగించిన ప్ర‌చారం పెద్ద వైర‌ల్ గా మారింది. దాంతో అప్ర‌మ‌త్త‌మ‌యిన పోలీసులు చ‌ర్చ‌కు పూనుకున్నారు. ఆ వీడియో పోస్ట్ చేసిన వైఎస్ జ‌గ‌న్ ది లీడ‌ర్ అనే ఫేస్ బుక్ పేజ్ నిర్వాహ‌కుల‌పై కేసు న‌మోదు చేశారు. ఆ పేజ్ నిర్వాహ‌కుడు కొల్ల‌ప‌ల్లి శ్యామ్ తో పాటు మ‌రికొంద‌రిపై ఐపీసీ 469, 471,120(బి), 153 సెక్ష‌న్ల కింద కేసు న‌మోదు చేశారు.

దాంతో ఇలాంటి ప్ర‌చారానికి ఫుల్ స్టాప్ పెట్టాల్సిన అవ‌స‌రం క‌నిపిస్తోంది. ఇప్ప‌టికే వైసీపీకి చెందిన ప‌లువురు కార్య‌క‌ర్త‌ల మీద సైబ‌ర్ నేరాల కింద కేసులు న‌మోదు చేసి వేధిస్తున్నార‌నే ప్ర‌చారం ఉంది. అయితే త‌ప్పుడు వీడియోల ద్వారా ప్ర‌జ‌ల్లో అశాంతిని రాజేసే ప్ర‌య‌త్నం చేస్తే మాత్రం అది ఆపార్టీకి బూమ‌రాంగ్ అయ్యే ప్ర‌మాదం ఉంటుంది.


Related News

janasena pawan kalyan

ఆ చానెల్ ని కూడా వ‌దిలిపెట్ట‌ని ప‌వ‌న్ క‌ళ్యాణ్

Spread the loveజ‌న‌సేన అధినేత దూకుడు పెంచాడు. ఈసారి నేరుగా ఆయ‌న పొలిటిక‌ల్ వార్ మాత్ర‌మే కాకుండా మీడియాతోనూ యుద్ధంRead More

tv channels ratings

హోదా ఉద్యమానికి మీడియా ఆటంకం?

Spread the loveఇలాంటి అనుమానం కలుగుతోంది. గతంలో ప్రత్యేక తెలంగాణా ఉద్యమ సమయంలో తెలుగు మీడియా మరో మాట మాట్లాడకుండాRead More

 • జ‌ర్న‌లిస్ట్ కి గ‌వ‌ర్న‌ర్ క్ష‌మాప‌ణ‌
 • ఆమెను మీడియా వాడుకుందా…?
 • కేసుల్లో వైఎస్ జ‌గ‌న్ పేరుతో ఉన్న ఫేస్ బుక్ పేజ్
 • లోకేష్ వ్యాఖ్య‌ల‌ను టీవీ9 ఎందుకు ప్ర‌సారం చేసింది…?
 • మోడీ స‌ర్కార్ వెన‌క‌డుగు
 • జ‌ర్న‌లిస్టు గుర్తింపు ర‌ద్దు
 • టీవీ యాంకర్ ఆత్మహత్య
 • త‌ప్పుడు ప్ర‌చారం చేస్తూ మోడీ అనుచ‌రుడు అరెస్ట్
 • Leave a Reply

  Your email address will not be published. Required fields are marked *