Main Menu

ప‌రువు న‌ష్టం కేసుల్లో ‘ది వైర్’

Spread the love

వ‌ర్త‌మాన మీడియా వైఖ‌రి మారిపోయింది. పాల‌కుల విధానాల‌ను ప్ర‌శ్నించే ప‌ని దాదాపుగా ఆగిపోయింది. కీల‌కాంశాల‌లో మౌనం దాలుస్తోంది. మ‌రీ త‌ప్ప‌ద‌నుకుంటే క‌ర్ర విర‌గ‌కుండా పాము చావ‌కుండా అన్న‌ట్టుగా క‌థ‌నాల‌తో కాల‌క్షేపం చేస్తోంది. అలాంటి స‌మ‌యంలో కేంద్రంలో అధికార పార్టీ పెద్ద‌ల‌ను ఇరుకున పెట్టే క‌థ‌నాలు వ‌స్తుంటే ఊరుకునే అవ‌కాశం ఉండ‌దు. అందుకు సాక్ష్య‌మే వెబ్ పోర్ట‌ల్ ది వైర్ ప్ర‌స్థానం క‌నిపిస్తోంది.

వివాదాస్పద రాఫెల్‌ డీల్‌పై ‘ద వైర్‌’ (న్యూస్‌ వెబ్‌సైట్‌) చర్చా కార్యక్రమాన్ని ప్రసారం చేసినందుకు అభ్యంతరం వ్యక్తం చేస్తూ అనిల్‌ అంబానీ కోర్టుకు ఎక్కారు. అహ్మదాబాద్‌ సిటీ సివిల్‌ కోర్టు లో ఆయనకు చెందిన ‘రిలయెన్స్‌ ఇన్ఫ్రాస్ట్రక్చర్‌’ సంస్థ పరువునష్టం దావా వేసింది. పరువునష్టం కింద రూ.6వేల కోట్లు తమకు చెల్లిం చాలని ఈ పిటీష న్‌లో రిలయెన్స్‌ కోరింది. పిటీషన్‌ను విచా రణకు స్వీకరించిన న్యాయస్థానం ఈకేసులో వాదోపవాదనలు విన్నది. విచార‌ణ వాయిదా ప‌డింది.

రాఫెల్‌ డీల్‌ : అండస్టాండింగ ద కాంట్రవర్సీ’ అనే పేరుతో చర్చా కార్యక్రమాన్ని తమ వెబ్‌సైట్‌లో ఈ ఏడాది ఆగస్టు 23న ‘ద వైర్‌’ ప్రసారం చేసింది. రక్షణ రంగ పాత్రికే యుడు అజరు శుక్లా, ‘ద వైర్‌’ వ్యవస్థాపక ఎడిటర్స్‌లో ఒకరు ఎం.కే.వేణు, విషయ నిపుణుడు జాకోబ్‌…వీరు చర్చాకార్యక్రమంలో పాల్గొ న్నారు. ఇందులో వక్తలు వ్యక్తం చేసిన అభిప్రాయాలు అన్నీ తప్పుడువనీ, ముందుగా ఒక ఉద్దేశాన్నినిర్ణ‌యించుకుని కార్యక్రమం నడిపారనీ, దీనివల్ల మా సంస్థ పరువుప్రతిష్టలని, చైర్మెన్‌గా ఉన్న తన ప్రతిష్టను దెబ్బతీశారనీ పిటీషన్‌లో అనిల్‌ అంబానీ సంస్థ ఆరోపించింది.

ఇప్ప‌టికే ది వైర్ పై ఆరు కేసులు న‌మోద‌య్యాయి. బీజేపీ జాతీయ అధ్య‌క్షుడు అమిత్ షా త‌న‌యుడి బండారం బ‌య‌ట‌పెట్ట‌డంతో రెండు కేసులు వేశారు. ఆ త‌ర్వాత రిల‌యెన్స్ ముఖేష్ అంబానీ,అదానీ వంటి వారి త‌రుపున కూడా ప‌రువు న‌ష్టం కేసులు న‌డుస్తున్నాయి. ఇవ‌న్నీ విచార‌ణ‌లో ఉండ‌గానే అనిల్ అంబానీ త‌రుపున రెండో కేసు వేశారు. తాజా కేసు విషయమై ‘ద వైర్‌’ వ్యవస్థాప‌క‌ ఎడిటర్స్‌లో ఒకరైన సిద్థార్థ్‌ వరదరాజన్‌ మాట్లాడుతూ, ”రాఫెల్‌ డీల్‌ విషయంలో మాట్లాడుతున్న మీడియా నోరు నొక్కడానికే ఇదంతా చేస్తున్నారు. ప్రశ్నించడాన్ని సహించలేకపోతున్నారు. ఇలాంటి కుయుక్తుల్ని ఎదుర్కొంటాం. పరువునష్టం కేసే కాదు, మరికొన్ని కేసులు మాపై వేశారు. వాటన్నింటినీ సమర్థంగా ఎదర్కొంటా”మని అన్నారు. మీడియాను లొంగ‌దీసుకునే ప్ర‌య‌త్నాలు చేయ‌డం, దానికి స‌సేమీరా అంటే కేసులతో స‌మ‌స్య‌లు సృష్టించడం ఆన‌వాయితీగా మారుతున్నట్టు ఈ వ్య‌వ‌హారం చాటుతోంది.


Related News

రామోజీ..! ఇదేనా ప‌ద్ధ‌తి ?

Spread the loveఈనాడు..తెలుగు మీడియాలో నేటికీ చాలామంది ఆ సంస్థ‌ల విలువ‌ల‌ను ప్ర‌స్తావిస్తూ ఉంటారు. అంతో ఇంతో పాత్రికేయ సూత్రాల‌కుRead More

పుంజుకున్న సాక్షి టీవీ: పొలిటిక‌ల్ సంకేత‌మేనా?

Spread the loveతెలుగు మీడియాలో బార్క్ రేటింగ్స్ కి పెద్ద‌గా ప్రాధాన్య‌త లేక‌పోవ‌చ్చు గానీ వాటికున్న గుర్తింపు వాటికుటుంద‌న‌డంలో సందేహంRead More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *