బుల్లితెర‌పై ఎన్టీఆర్ హ‌వా

ntr (1)
Spread the love

ఎన్టీఆర్ త‌న హ‌వా చాటారు. టాలీవుడ్ లో రికార్డులు సృష్టించ‌డానికి అల‌వాటు ప‌డ్డ ఎన్టీఆర్ తాజాగా బుల్లితెర మీద కూడా కొత్త సంచ‌ల‌నం సృష్టిస్తున్నాడు. బిగ్ బాస్ షో తో స్టార్ మా టీవీతో ఎంట్రీ ఇచ్చిన ఎన్టీఆర్ రియాలిటీ షో తాజా రేటింగ్స్ లో టాప్ ప్లేస్ లో నిల‌వ‌డం విశేషం. బుల్లితెరపై బిగ్ బాస్ హవా ప్ర‌ద‌ర్శిస్తుండ‌డం ఎన్టీఆర్ ఫ్యాన్స్ లో ఆనందంలో ముంచుతోంది.

స్టార్ హీరో ఎన్టీఆర్ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న బిగ్ బాస్ షో ఇప్పుడు వార్తల్లో ప్రముఖంగా వినిపిస్తుంది. ఈ తరహా షో తెలుగు ప్రేక్షకులను ఎంత వరకు ఆకట్టుకుంటుందో అన్న అనుమానాలకు ఫుల్ స్టాప్ పెడుతూ బిగ్ బాస్ రికార్డ్ టీఆర్పీలను సాధించింది. తారక్ ఫ్యాన్స్ తో పాటు రియాల్టీ షో అభిమానులు కూడా ఈ షోను ఎంజాయ్ చేస్తున్నారు. బిగ్ బాస్ షోనే ప్రసారం చేస్తున్న స్టార్ మా ఛానల్ టీఆర్పీ రేటింగ్స్ లో దూసుకుపోతోంది.

ముఖ్యంగా వారాంతంలో ఎన్టీఆర్ కనిపించే ఎపిసోడ్స్ లో రేటింగ్ భారీగా ఉంటోందని సమాచారం. స్టార్ మా ప్రకటించిన అధికారిక సమాచారం ప్రకారం టీఆర్ఫీ 16.18 గా నమోదైంది.ఇటీవల కాలంలో ఒక ఛానెల్ కు ఇంతటి టీఆర్ఫీ రాలేదు. ఇన్నాళ్లు నాలుగోస్థానంలో ఉన్న స్టార్ మా బిగ్ బాస్ షో స్టార్ట్ అయిన తరువాత మొదటి స్థానానికి రావటం విశేషం.


Related News

sakshi

సాక్షి చేసింది..చేయాల్సింది..!!

Spread the loveఅధికారం అండ‌తో ప్ర‌వేశించింది. ఆ వెంట‌నే ఆటంకాలు ఎదుర్కోవాల్సి వ‌చ్చింది. అనేక ఒడిదుడుకులు చ‌వి చూసింది. ప్ర‌స్తుతంRead More

Eenadu_Office,Vizag

త‌ప్పులో కాలేసిన ఈనాడు

Spread the loveజర్న‌లిజంలోనే కాదు..ఎక్క‌డ‌యినా అల‌వాటులో పొర‌పాట్లు కొన్ని స‌హ‌జం. అత్యంత జాగ్ర‌త్త‌గా వ్య‌వ‌హ‌రించే చోట కూడా అలాంటివి చోటుకుంటాయి.Read More

 • మీడియా యాజ‌మాన్యానికి జ‌రిమానా
 • ప‌వ‌న్ కి షాకిచ్చిన మీడియా!
 • అయ్యో..ఆంధ్రజ్యోతి..!
 • ఆంధ్ర‌జ్యోతికి కేకు తినిపించిన జ‌గ‌న్
 • రియ‌ల్ టైమ్ గ‌వ‌ర్నెన్స్..కానీ జ‌ర్న‌లిస్టుల‌కు..!
 • అభాసుపాల‌యిన మీడియా
 • తెలుగు మీడియాలో బాబుకి అన్యాయం!
 • టీవీ9 వెన‌క్కి…ఎన్టీవీ అగ్ర‌స్థానానికి
 • Leave a Reply

  Your email address will not be published. Required fields are marked *