Main Menu

ఎన్టీఆర్ కి షాకిచ్చిన దగ్గుబాటి రానా

young-tiger-ntr-vs-rana-daggubati-with-television-shows_b_2207170924
Spread the love

టాలీవుడ్ లో రెండు పెద్ద కుటుంబాల నేపథ్యంలో వచ్చిన హీరోలే అయినప్పటికీ ఎన్టీఆర్, దగ్గుబాటా రానా ఇద్దరిదీ ప్రత్యేక శైలి. ఎవరి పంథాలో వారు దూసుకుపోతున్నారు. సగటు ప్రేక్షకుడిని సంత్రుప్తి పరచడంలో ముందుంటున్నారు. అయితే తాజాగా ఇద్దరూ ఒక విషయంలో పోటీపడ్డారు. అది కూడా వెండితెరపై మాత్రం కాదు. బుల్లితెరపై ఇద్దరూ ఏకకాలంలో అడుగపెట్టి ముందుకు సాగుతున్నారు. ఈ నేపథ్యంలో ఈ పోరులో తొలుత ఎన్టీఆర్ తిరుగులేని స్థానంలో నిలిచాడు. బిగ్ బాస్ అంటూ మా టీవీని ముందుకు తీసుకెళ్లాడు. కానీ తాజాగా రానా ఆ విషయంలో ఎన్టీఆర్ ని దాటేశాడు.

వాస్తవానికి ఓపెనింగ్ డేనాడే బిగ్ బాస్ ఏకంగా 16.18 రేటింగ్ తో నంబర్ వన్ పొజిషన్‌లో నిలిచింది బిగ్ బాస్ షో… అయితే… వీకెండ్‌లో ఎన్టీఆర్ పాల్గొన్న ఎపిసోడ్స్‌కు ఉన్న వీవర్ షిప్ మిగిలిన రోజుల్లో ఉండటం లేదు… దాంతో స్లో అండ్ స్టడీ తరహాలో సాగుతున్న రానా నంబర్ వన్ యారీ బిగ్ బాస్ టీఆర్‌పీని అధిగమించింది.

తొలి రెండు వారాల్లో బిగ్ బాస్ హడావిడి చేసినా, రానా నిర్వహిస్తున్న నంబర్ వన్ యారీ ప్రోగ్రామ్ డీసెంట్ రేటింగ్‌నే కొనసాగిస్తోంది. గతంలో 9.1 ఉన్న ఈ షో టీఆర్‌పీ లేటెస్ట్ వీక్ 10.3కు పెరిగింది. అయితే బిగ్ బాస్ షోకు 6.23 టీఆర్‌పీనే రావడం గమనార్హం. అయితే సీరియల్స్‌కు మహిళాదరణ ఏ మాత్రం తగ్గలేదనే చెప్పాలి. కుంకుమ పువ్వు-10.7, స్వాతిచినుకులు-10, ముద్దమందారం-10, టీఆర్‌‌పీ రేటింగ్స్ సాధించాయి. ఇక సినిమాల విషయానికి వస్తే మన్యం పులి-10, నేను లోకల్ రిపీట్- 8, రాధ- 7.7 టీఆర్‌పీ సాధించాయ రేస్‌లో ముందుండాలంటే బిగ్‌బాస్ ఏదైనా అద్భుతం చేయాలి.

మొత్తంగా భల్లాలదేవుడు ఇప్పుడు ముందుకొచ్చాడు. బిగ్ బాస్ ని దాటేయడం చర్చనీయాంశం అవుతోంది.






Related News

at news republic

తెలుగులో మ‌రో శాటిలైట్ చానెల్ సిద్దం

Spread the love1Shareతెలుగు మీడియాలో ఇప్ప‌టికే న్యూస్ చానెళ్ల సంఖ్య పెరిగిపోయింది. ఇటీవ‌ల వెబ్ చానెళ్లు విజృంభిస్తుండ‌డంతో కెమెరాల సంద‌డిRead More

1c4a95fb-2e04-4d54-a3bf-870ee131bcc2

ఆంధ్ర‌జ్యోతి ప‌రువు తీసిన ఈనాడు

Spread the love4Sharesఏదైనా వార్త అన్ని పత్రిక‌ల్లో ఒకేలా వ‌స్తుంది. రావాలి కూడా. ప‌దాలు, వ్యాఖ్యాల ప్రాధాన్య‌త‌లు మారినా మొత్తంRead More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *