పేరు మారింది..కానీ తీరు..?

app times
Spread the love

ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాజ‌ధాని నుంచి శాటిలైట్ చానెళ్ల చ‌రిత్ర‌లో కొత్త సంచ‌ల‌నం అంటూ చెప్పుకున్న ఏపీ టైమ్స్ పుట్టెడు క‌ష్టాల్లో ఉన్న‌ట్టు క‌నిపిస్తోంది. ఆర్థికంగా స‌మ‌స్య‌లు లేక‌పోయినా ఇత‌ర అంశాలు మాత్రం ఆ చానెల్ రాక‌ను అడ్డుకుంటున్నాయి. ఇప్ప‌టికే నాలుగు నెల‌ల క్రితం రిక్రూట్ మెంట్ జ‌రిగింది. నెల క్రితం కార్యాల‌యం కూడా ప్రారంభించారు. కానీ చానెల్ మాత్రం క‌నిపించ‌డం లేదు. యూట్యూబ్ లో వార్త‌లు చూసుకుని ఆ సంస్థ సిబ్బంది, అభిమానులు మురిసిపోవాల్సి వ‌స్తోంది. దాంతో అస‌లు ఎప్పుడు తెరంగేట్రం అనే సందేహం క‌నిపిస్తోంది.

అమ‌రావ‌తి నుంచి ఇప్ప‌టి వ‌ర‌కూ ఒక్క న్యూస్ చానెల్ కూడా రాలేదు. దాంతో తొలిచానెల్ గా ఏపీ టైమ్స్ చెప్పుకునే అవ‌కాశం ద‌క్కింది. కానీ చానెల్ పేరులో అభ్యంత‌రాలు వివాదం కావ‌డంతో చివ‌ర‌కు పేరు మార్చారు. ఏపీ టైమ్జ్ గా తీర్చిదిద్దారు. ఆప్ర‌క్రియ పూర్తికావ‌డానికి రెండు నెల‌ల స‌మ‌యం వృధా అయిన‌ట్టు క‌నిపిస్తోంది. ఈలోగా మేనేజ్ మెంట్ వ్య‌వ‌హారాలు చూస్తున్న పెద్ద‌ల మ‌ధ్య స‌ఖ్య‌త క‌నిపించ‌డం లేద‌ని స‌మాచారం. తెలంగాణా నుంచి వ‌చ్చి ఏపీ టైమ్జ్ సార‌ధ్య బాధ్య‌త‌లు చూస్తున్న వెంక‌ట‌కృష్ణ తీరు మేనేజ్ మెంట్ లోని కొంద‌రికి రుచించ‌డం లేదంటున్నారు. దాంతో మొద‌ల‌యిన గ్యాప్ ఇప్పుడు తీవ్ర‌మ‌వుతోంద‌నే ప్ర‌చారం సాగుతోంది. చానెల్ ఆల‌శ్యానికి అదే కార‌ణ‌మా అనే అనుమానాలు క‌నిపిస్తున్నాయి.

ఇక సిబ్బంది విష‌యంలో మాత్రం వేత‌నాలు వ‌స్తుండ‌డంతో పెద్ద‌గా అభ్యంత‌రాలు క‌నిపించ‌డం లేదు. కానీ చానెల్ తెర‌మీద‌కు రావ‌డంలో జ‌రుగుతున్న ఆల‌శ్యం వారిలోనూ సందేహాలు పెంచుతోంది. మ‌రోవైపు ఏపీ టీవీ పేరుతో మ‌రో చానెల్ కి రంగం సిద్ధ‌మ‌య్యింది. ఆర్థికంగా నిల‌దొక్కుకున్న సంస్థ ద్వారా ఏపీ టీవీ రాబోతున్న‌ట్టు నిర్వాహ‌కులు చెబుతుండ‌డంతో ఏపీ టైమ్జ్ క‌న్నా ముందే మ‌రో చానెల్ వ‌స్తుందా అనే అభిప్రాయం వ్య‌క్త‌మ‌వుతోంది. కానీ ఇప్ప‌టికే ప‌లు కార్య‌క్ర‌మాలు పూర్తిచేసుకున్న ఏపీ టైమ్జ్ కి అవ‌కాశాలున్నాయి. చూడాలి..మ‌రి ఎప్ప‌టికీ ద‌ర్శ‌న‌మిస్తుందో..ఈలోగా ఎన్ని ప‌రిణామాలు సాగుతాయో..!!


Related News

papers telugu news

మీడియా ఏం చేసినా చెల్లుతుందా..?

Spread the loveఇదే ప్ర‌శ్న చాలామంది నుంచి వినిపిస్తోంది. రాజ‌కీయ పార్టీలు, మ‌త బోధ‌కులు, కుల సంఘాలు కూడా మీడియాలోకిRead More

tv9-telugu-live-streaming

అడిగి తిట్టించుకుంటున్న టీవీ9

Spread the loveఆశ్చ‌ర్యంగా ఉందా..అనుమానం ఎందుకు..కింద‌న ఉన్న ట్వీట్ చ‌ద‌వండి. మీకే అర్థ‌మ‌వుతుంది. అయినా అన్నింటికీ నాట‌కీయ‌త అద్ద‌డ‌మే న్యూస్Read More

 • మీడియా సంస్థ‌ల‌కు బాబు ఆఫ‌ర్
 • తెలుగు న్యూస్ చానెళ్ల తాజా రేటింగ్స్
 • జ‌ర్న‌లిస్టును చంపేస్తాం..!
 • పేరు మారింది..కానీ తీరు..?
 • ఎన్టీవీ చైర్మ‌న్ ఇంట అఖిల‌ప‌క్షం..!
 • నెల‌రోజులుగా యుద్ధం “ముచ్చట్లు”…
 • బుల్లితెర‌పై ఎన్టీఆర్ హ‌వా
 • ఏపీ జ‌ర్న‌లిస్టుల‌కు ట్రిపుల్ ఆశ‌లు..!
 • Leave a Reply

  Your email address will not be published. Required fields are marked *