Main Menu

ఏపీ జ‌ర్న‌లిస్టుల‌కు ట్రిపుల్ ఆశ‌లు..!

houing
Spread the love

స‌హ‌జంగా మ‌నిషి ఆశ‌కు హ‌ద్దు ఉండ‌దు. అది అంద‌రిక‌న్నా రాజ‌కీయ నాయ‌కుల‌కు బాగా తెలుసు. చంద్ర‌బాబు లాంటి అనుభ‌వ‌జ్ఞుల‌కు అంత‌కుమించి తెలుసు. అందుకే ఇప్పుడాయ‌న పాత్రిక‌యేయ లోకాన్ని ట్రిపుల్ ఆశ‌ల్లో ముంచేశారు. క‌న్న‌త‌ల్లికి కోక‌యినా పెట్ట‌ని వాడు పినత‌ల్లికి ప‌ట్టు చీర కొంటాన‌న్నట్టుగా ఏపీలో మూడున్న‌రేళ్ల పాల‌న‌లో ఒక్క ఇల్లు కూడా పూర్తిచేయ‌లేని చంద్ర‌బాబు ఇప్పుడు ఏకంగా ట్రిపుల్ బెడ్ రూమ్ ఇళ్లు జ‌ర్న‌లిస్టుల కోస‌మంటూ ప్ర‌క‌టించి ప‌లువురిని ఆశ‌ల పందిరిలో ఊరేగించ‌డం ప్రారంభించారు.

వాస్త‌వానికి రాజ‌కీయ నాయ‌కులు హామీలు ఇవ్వ‌డం అందులో ప‌దో వంతు అమ‌లు చేసి నూట ఇర‌వై శాతం అమ‌ల‌యిన‌ట్టు చెప్పుకోవ‌డం స‌ర్వ‌సాధార‌ణం. అయితే నేత‌లు చెప్పే మాట‌ల‌ను ప్ర‌చారంలో పెట్టే జ‌ర్న‌లిస్టుల‌ను కూడా అదే స్థాయిలో ప్ర‌చార వంచ‌న‌కు గురిచేయ‌డానికి ప్ర‌య‌త్నించ‌డ‌మే విస్మ‌యం క‌లిగిస్తుంది. వాస్త‌వానికి గ‌త ఎన్నిక‌ల‌కు ముందు జ‌ర్న‌లిస్టుల‌కు చెప్పిన ఒక్క హామీని ప్ర‌భుత్వం అమ‌లుచేయ‌లేదు. టీడీపీ మ్యానిఫెస్టెలో ఉన్న ఏ అంశ‌మూ నెర‌వేర్చ‌లేదు. ఇక మ‌ళ్లీ నంద్యాల ఉప ఎన్నిక‌ల‌కు ముందు కొత్త మాట‌లు చెప్ప‌డం కొంత సందేహించాల్సిన విష‌య‌మే. సూటిగా చెప్పాలంటే ఏపీలో ప్రెస్ అకాడ‌మీ కి సొంత గూడు లేక అస‌లు అది ఉందో లేదో తెలియ‌ని ప‌రిస్థితి ఉంది. ఇక జ‌ర్న‌లిస్టుల‌కు ఇచ్చిన హెల్త్ కార్డుల వ్య‌వ‌హారం ఎంత నాన్చుడో అంద‌రికీ తెలుసు. ఇళ్ళ‌స్థ‌లాలు ఇస్తాన‌ని రాసిన రాత‌లు చెరిపేసి ఇప్పుడు ట్రిపుల్ ఊహాలు ప్రారంభించారు.

ప్ర‌స్తుతం ఏపీలో దాదాపుగా 17వేల మంది అక్రిడేటెడ్ జ‌ర్న‌లిస్టులున్నారు. ఇప్ప‌టికే ప్ర‌భుత్వం ద్వారా వివిధ ప‌థ‌కాల్లో ల‌బ్ది పొందిన వారిని తీసేస్తే క‌నీసంగా 15వేల మందికి ట్రిపుల్ బెడ్ రూమ్ ఇళ్లు నిర్మించాల్సి ఉంటుంది. అంటే ఒక్కో ఇంటికి 3 ల‌క్ష‌లు క‌నీసంగా లెక్క‌లేసినా 5వేల కోట్లు జ‌ర్న‌లిస్టుల హౌసింగ్ కోసం ఖ‌ర్చు చేయాల్సి ఉంటుంది. అది కూడా స్థ‌లం కాకుండా కేవ‌లం నిర్మాణానికి అతి త‌క్కువ‌గా అంచ‌నా వేస్తే అయ్యే ఖ‌ర్చు. అస‌లు ఐదేళ్ల పాల‌న‌లో మొత్తం చంద్ర‌బాబు గృహ‌నిర్మాణానికి కేటాయించిందే అంత లేదు. అలాంటిది జ‌ర్న‌లిస్టుల కోసం అంత భారీ మొత్తం వ్య‌యం చేస్తార‌నుకోవ‌డం విడ్డూర‌మే. పోనీ అందులో స‌గం చేయాల్సి వ‌చ్చినా బ‌డ్జెట్ స‌హ‌క‌రించ‌దు. పావు వంతు చేయాల‌న్నా మిగిలిన పేద‌ల ప‌థ‌కాల‌కు కోత త‌ప్ప‌దు. పైన లెక్క‌లు అతి స్వ‌ల్పంగా వేసిన‌వే కావ‌డంతో అదనంగా భారీ ఖ‌ర్చ‌వుతుంది. కాబ‌ట్టి ట్రిపుల్ బెడ్ రూమ్ ఇళ్లు అర‌కొర‌గా అక్క‌డ‌క్క‌డా క‌ట్ట‌డానికి మాత్ర‌మే అవ‌కాశం ఉంటుంది. అయినా అది కూడా చంద్ర‌బాబుకి చిత్త‌శుధ్ది ఉందా అంటే సందేహ‌మే. ఎందుకంటే ఈ మూడున్న‌రేళ్ల అనుభ‌వ‌మే దానికి నిద‌ర్శ‌నం.

ఇక తెలంగాణాలో డ‌బుల్ బెడ్ రూమ్ అంటూ చెప్పుకొచ్చిన కేసీఆర్ ఇక్క‌డి జ‌ర్న‌లిస్టును ఏం చేశారో అంద‌రికీ ఎరుకే. ఇక ఏపీలో జ‌ర్న‌లిస్టుల‌కు ఏమ‌వుతుందో చెప్ప‌డానికి ఇంత‌కుమించిన ఉదాహ‌ర‌ణ అవ‌స‌రం లేదు. అయినా సీఎం చెప్పారు..కాబ‌ట్టి ఆశిద్దాం అన‌డంలో త‌ప్పులేదు. కానీ సీఎం ఈ విష‌యం ఎన్నిక‌ల స‌భ‌లో చెప్ప‌డ‌మే తాయిలాల ప‌రంప‌ర‌లో భాగ‌మ‌ని భావించాల్సి ఉంటుంద‌న్న‌ట్టుగా మీడియా ప్ర‌ముఖుల అంచ‌నా. మ‌రి బాబు ఏం చేస్తారో…పాత్రికేయ గూడు క‌ల చెదిరిపోకుండా ఎలా చేస్తారో చూద్దాం..!!

కానీ చంద్ర‌బాబు ప్ర‌క‌ట‌న మా గొప్పేన‌ని ఒక‌టి రెండు సంఘాలు జ‌బ్బ‌లు చ‌రుచుకోవ‌డం జ‌ర్న‌లిస్టు సంఘాల దిగజారుడుత‌నానికి నిద‌ర్శ‌న‌మ‌ని కొంద‌రు వ్యాఖ్యానిస్తున్నారు. ఓ సంఘం స‌మావేశానికి రావ‌డానికే మొఖం చాటేసిన సీఎం వాళ్లు చెబితే చేసేశార‌ట‌. ఆ రోజు సీఎం ఆ సంఘం నేత‌ల‌ను ఎంత మాట‌న్నారో మీడియా కోడైకూసింది. కానీ ఇప్పుడే మా వ‌ల్లే అని భుజాలు చ‌రుచుకుంటున్నారు. ఇక మిగిలిన సంఘాలు కూడా అదే ప‌ద్ధ‌తి. నిజంగా ఆయా సంఘాల వ‌ల్లే ట్రిపుల్ బెడ్ రూమ్ ప్ర‌క‌ట‌న వ‌స్తే, అది విజ‌య‌వాడ‌లో చేసి ఉంటే, జ‌ర్న‌లిస్టుల స‌మ‌క్షంలో చేసి ఉంటే న‌మ్మ‌శ‌క్యంగా ఉండేది. కానీ ఇప్పుడు దానికి భిన్నంగా ఎన్నిక‌ల ముందు నంద్యాల‌ను వ‌రాల వ‌ర్షంలో త‌డిపేస్తున్న బాబు అదే పరంప‌ర‌లో చెప్పిన మాట‌కు కూడా మేమే కార‌ణం అనుకోవ‌డం విచిత్ర‌మే.


Related News

ntv

స్వ‌రం స‌వ‌రించుకున్న చానెల్

Spread the loveతెలుగుమీడియాలో చాలాకాలంగా చంద్ర‌బాబుకి సానుకూల‌త ఉంటుంది. దానికి అనేక కార‌ణాలున్నాయి. సామాజిక స‌మీక‌ర‌ణాలు అందులో ఒక‌టి. ముఖ్యంగాRead More

The-Media

మీడియా సంద‌డి మొద‌ల‌య్యింది..!

Spread the loveమ‌ళ్లీ క‌ద‌లిక మొద‌ల‌య్యింది. తెలుగు మీడియాకి జోష్ వ‌చ్చిన‌ట్టు క‌నిపిస్తోంది. వ‌రుస‌గా మీడియా సంస్థ‌ల యాజ‌మాన్యాలు మారుతున్నాయి.Read More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *