Main Menu

ఏపీ జర్నలిస్టులకు తెలంగాణా అధ్యక్షుడు

Spread the love

ఆంధ్రప్రదేశ్ లో వ్యవహారాలు ఆసక్తిగా ఉంటాయి. చివరకు జర్నలిస్టు రాజకీయాలు కూడా అతీతం కాదు. అందుకు ఉధాహరణ తాజాగా హౌసింగ్ కోసమంటూ ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీ కనిపిస్తోంది. రాష్ట్ర విభజన జరిగిన నాలుగేళ్లు గడుస్తున్నా ఇప్పటికీ ఏపీ జర్నలిస్టుల మీద తెలంగాణా నేతల పెత్తనం కొనసాగడం పలువురిని విస్మయానికి గురిచేస్తోంది. సుమారు 30వేల వర్కింగ్ జర్నలిస్టులున్న ఆంధ్రప్రదేశ్ లో వారికి నాయకత్వం వహించడానికి తెలంగాణా నేతలే ఉండడం విశేషంగా చెప్పక తప్పదు.

వాస్తవానికి ఆంధ్రప్రదేశ్ లో ఇటీవల ప్రభుత్వ పెద్దల ప్రోత్సాహంతో తెరమీదకు వచ్చిన ఏపీజేఎఫ్ సహా పలు పాత్రికేయ సంఘాలున్నాయి. అందులో సుదీర్ఘ చరిత్ర కలిగిన సంఘం ఏపీడబ్ల్యూజే. దానికి అనుబంధంగా ఏపీ ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టుల సంఘం ఒకటి నడుపుతున్నారు. ఎలక్ట్రానిక్ మీడియా విస్తరించిన నేపథ్యంలో వారి సమస్యల కోసం ఈ విభాగం ఏర్పాటు చేశారు. అయితే ఆ సంఘానికి ప్రత్యేకంగా సమావేశాలు గానీ, సభలు గానీ నిర్వహించి కమిటీని ఎన్నుకున్న చరిత్ర లేదు. అయినా ఆంధ్రప్రదేశ్ ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టుల సంఘం అధ్యక్షుడినంటూ ఒక వ్యక్తి చెప్పుకోవడం, ఆయనకు హౌసింగ్ కోసం కమిటీలో అవకాశం ఇవ్వడం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది.

ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు కూడా ఇదే రీతిలో తానే అధ్యక్షుడినని చెప్పుకుంటూ పలు వ్యవహారాలు చక్కదిద్దుకున్న అనుభవాలున్నాయి. అదే విధంగా ప్రస్తుతం హైదరాబాద్ లోని జర్నలిస్టుల ఇళ్ల స్థలాలకు సంబంధించిన కమిటీలో కూడా ప్రతినిధిగా ఉన్న వ్యక్తి ఇప్పుడు ఏపీలో జర్నలిస్టులకు ఇళ్ళు నిర్మించడం కోసం ఏర్పాటు చేసిన కమిటీలో చోటు కల్పించడం అనుమానాలకు తావిస్తోంది. ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధుల సంఘమే అనుకుంటే ఏపీడబ్ల్యూజేఎఫ్ కి అనుబంధంగా ఏపీబీజేఏ అనే సంఘం కూడా ఉంది. వారికి మాత్రం ప్రాతినిధ్యం లేదు. ఒక వేళ ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టుల ప్రతినిధిగా ఒక సంఘాన్నే గుర్తిస్తే అసలు అధ్యక్షుడిగా చెప్పుకుంటున్న వ్యక్తే ఎలక్ట్రానిక్ మీడియాలో పనిచేయడం లేదు. అంతేగాకుండా తెలంగాణా రాష్ట్రానికి చెందిన వ్యక్తి అయినప్పటికీ ఏపీ కమిటీలో చోటు కల్పించడం విమర్శలకు తావిస్తోంది.

ముఖ్యంగా జర్నలిస్టుల పేరుతో ప్రభుత్వం అందిస్తున్న పలు పథకాలు ఇప్పటికే పక్కదారి పడుతున్నాయి. అక్రిడేషన్లు వర్కింగ్ జర్నలిస్టులకు ఇవ్వాల్సి ఉన్నప్పటికీ అవి ఎవరెవరికి ఉన్నాయో తెలియాలంటే ఆర్టీసీ సిబ్బంది బాగా చెబుతారు. అలాంటి చిన్న అక్రిడేషన్ కార్డులే దుర్వినియోగానికి నిదర్శనాలుగా ఉన్నప్పుడు ఇళ్లు కేటాయించే సమయంలో మరిన్ని అవకతవకలకు అవకాశం ఉంటుంది. అందుకు తగ్గట్టుగా ఏర్పాటు చేయాల్సిన కమిటీలో ఏపీకి చెందని, ఎలక్ట్రానిక్ మీడియా లో పనిచేయని, అసలు సంఘానికి నాయకుడిగా ఎక్కడా, ఎన్నడూ ఎన్నుకోని వ్యక్తికి అవకాశం కల్పించడం గమనిస్తే పాత్రికేయ సంఘాల పరిస్థితి ఎంత దయనీయంగా ఉందో అర్థమవుతోంది. అడ్డగోలుతనానికి నిదర్శనంగా ఉంది. ప్రభుత్వం ద్రుష్టిపెట్టకపోతే కమిటీనే సక్రమంగా లేని సమయంలో నిజమైన జర్నలిస్టులకు న్యాయం జరుగుతుందని ఆశించడం కష్టం అవుతుంది.

కమిటీ వివరాలు ఇవిగో..

జర్నలిస్టుల గ్రుహ నిర్మాణ రాష్ట్ర జాయింట్ యాక్షన్ కమిటీ

1. అంబటి ఆంజనేయులు ఐజేయు
2. నల్లి ధర్మారావు ఏపీడబ్ల్యూజే
3. ఐవీ సుబ్బారావు ఏపీడబ్ల్యూజే
4. జి ఆంజనేయులు ఫెడరేషన్
5. ఉప్పల లక్ష్మణ్ జాప్
6. పున్నం రాజు జాప్
7. శ్రీరామ్ యాదవ్ ఏపీజేెఎఫ్
8. నారాయణ ఫోటో జర్నలిస్ట్ అసోసియేషన్
9. టీవీ రమణ ఫోట్ జర్నలిస్ట్ అసోసియేషన్
10. చందు జనార్థన్ ఏపీ ఎలక్ట్రానిక్ మీడియా
11. చావా రవి సీనియర్ జర్నలిస్ట్
12. నిమ్మరాజు చలపతిరావు సీనియర్ జర్నలిస్ట్
13. ఎస్ కే బాబు సీనియర్ జర్నలిస్ట్


Related News

‘టైమ్’ మారిపోయింది..

Spread the loveతెలుగులోనే కాదు ప్ర‌పంచ వ్యాప్తంగా మీడియా సంస్థ‌లు చేతులు మారే రోజులు వ‌చ్చేశాయి. అనేక సంస్థ‌లు వ‌రుస‌గాRead More

మూర్తి అడుగులు అటువైపేనా..!

Spread the loveమహామూర్తిగా చెల‌రేగిన సీనియర్ జ‌ర్న‌లిస్ట్ వ్య‌వ‌హారం ఇప్పుడు ఆస‌క్తిగా మారింది. మీడియా వ‌ర్గాల‌తో పాటు రాజ‌కీయంగానూ చ‌ర్చ‌నీయాంశంRead More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *