Main Menu

‘సాక్షి’కి అన్యాయం జ‌రిగిందా..?

Spread the love

మీడియా ఓ రాజకీయ సాధ‌నంగా మారిపోయిన త‌ర్వాత పాల‌క‌ప‌క్షాలు ఇష్టారాజ్యంగా వ్య‌వ‌హ‌రించ‌డం విస్తృత‌మ‌య్యింది. గ‌తంలో కూడా కొంద‌రు నేత‌లు ఏక‌ప‌క్షంగా వ్య‌వ‌హ‌రించిన అనుభ‌వాలున్న‌ప్ప‌టికీ ఇటీవ‌ల అది మ‌రింత విశృంఖ‌లంగా మారుతోంది. చంద్ర‌బాబు పాల‌నా తీరు అందుకో ఉదాహ‌ర‌ణ‌. సాక్షి ప‌త్రిక‌కు ప్ర‌భుత్వ ప్ర‌క‌ట‌న‌ల జారీ విష‌యంలో నేరుగా సీఎంవో జోక్యంతోనే జ‌రిగిన తంతు గ‌మ‌నిస్తే ప్ర‌జ‌ల క‌న్నా పార్టీ ప్ర‌యోజ‌నాల‌కే పెద్ద పీట వేసిన‌ట్టు క‌నిపిస్తోంది.

గ‌డిచిన మూడేళ్ల లెక్క‌లు అందుకు ఉదాహ‌ర‌ణ‌గా ఉన్నాయి. తాజాగా స‌మాచార క‌మిష‌న‌ర్ వెల్ల‌డించిన వివ‌రాల‌ను సాక్షి ప‌త్రిక బ‌య‌ట‌పెట్టింది. వాటి ప్ర‌కారం ఈనాడు ప‌త్రిక‌కు మూడేళ్ల‌లో 33.05 కోట్ల కేటాయించారు. అదే స‌మ‌యంలో ఆంధ్ర‌జ్యోతి ప‌త్రిక‌కు 21.99 కోట్లు కేటాయించారు. కానీ సాక్షికి మాత్రం కేవ‌లం 8.99 కోట్లు మాత్ర‌మే కేటాయించ‌డం గ‌మ‌నిస్తే టీడీపీ ప్ర‌భుత్వ తీరు తేట‌తెల్లం అవుతోంది. నిబంధ‌న‌ల‌కు నీళ్లు వ‌ద‌లిన‌ట్టు కాగ్ సైతం అభ్యంత‌రం వ్య‌క్తం చేయాల్సి వ‌చ్చింది.

సాక్షి స‌ర్క్యులేష‌న్ కి, ఆంద్ర‌జ్యోతి స‌ర్క్యులేష‌న్ కి పొంత‌న‌లేదు. ఆంధ్ర‌జ్యోతికి అంద‌నంత ఎత్తులో సాక్షి ఉంటుంది. అయినా ప్ర‌భుత్వానికి బాకాగా మారిన నేప‌థ్యంలో భారీ ప్ర‌యోజ‌నాలు అందించిన‌ట్టు స్ప‌ష్టం అవుతోంది. ఇక అదే స‌మ‌యంలో ఆంధ్ర‌ప్ర‌భ కి 6.74 కోట్లు కేటాయించి, స‌ర్క్యులేష‌న్ లో నాలుగో స్థానంలో ఉండే ప్ర‌జాశ‌క్తి వంటి ప‌త్రిక‌ల‌కు త‌గిన ప్ర‌క‌ట‌న‌లు ఇవ్వ‌క‌పోవ‌డం కూడా ప్ర‌భుత్వ ధోర‌ణిని చాటుతోంది. ఈ రీతిలో ప్ర‌భుత్వ వ్య‌వ‌హారం కాగ్ సైతం క‌న్నెర్ర చేసే స్థాయిలో ఉన్న తీరు చూస్తుంటే మీడియా మేనేజ్ మెంట్ లో చంద్ర‌బాబు నైజం స్ప‌ష్ట‌మ‌వుతోంది.






Related News

డిజిట‌ల్ న్యూస్ లో టాప్ బ్రాండ్స్ ఇవే..!

Spread the loveదేశంలో ప్ర‌స్తుతం డిజిట‌ల్ మీడియా విస్త‌ర‌ణ‌కు మ‌రిన్ని అవ‌కాశాలు క‌నిపిస్తున్నాయి. రాబోయే రోజుల్లో మ‌రింత విస్త‌రించ‌డం ఖాయంగాRead More

టీవీ5పై నిషేధం న్యాయ‌మేనా?

Spread the loveప్ర‌జాస్వామ్యంలో ఫోర్త్ పిల్ల‌ర్ మీడియాకు ప్ర‌త్యేక ప్రాధాన్య‌త ఉంటుంది. కానీ రానురాను అది తారుమార‌వుతోంది. మీడియా రూపంRead More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *