అమరావతి ఆశలు నీరుగార్చేసిన చానెల్

amaravati design
Spread the love

ఏపీ రాజధానిలో రకరకాల నగరాల నిర్మాణం కోసం చంద్రబాబు ప్రయత్నిస్తున్నారు. ఇప్పటికే ప్రకటించారు కూడా. పరిపాలన అంతా ఒక ప్రాంతంలో, హెల్త్ సిటీ, ఎడ్యుకేషన్ సిటీ అన్నట్టుగా వివిధ రంగాల వారీగా పలు సంస్థలు అక్కడికి వస్తాయని చెబుతున్నారు. అందులో భాగంగా పెట్టుబడుల ఆకర్షణ కోసమేనంటూ ప్రపంచమంతా పర్యటనలు సాగిస్తున్నారు. ఫలితాలతో సంబంధం లేకుండా సాగిపోతున్నారు. అదే సమయంలో మీడియా కూడా అమరావతికి తరలిరావాలని అంతా ఆశిస్తున్నారు. మన రాష్ట్రం, మన చానెల్ అంటూ ఏపీ వాసుల్లో చాలామందిలో అలాంటి అభిప్రాయం ఉంది. హైదరాబాద్ వార్తలకే ప్రాధాన్యతనిస్తూ ఏపీ ఆశలకు గండికొట్టేస్తున్నారనే అభిప్రాయం కూడా ఉంది.

కానీ ఆచరణలో అలాంటి ప్రయత్నాలకు చాలామంది దూరంగా ఉన్నారు. విజయవాడ కేంద్రంగా న్యూస్ చానెల్ నడపడం సులువు కాదని భావించి, కొందరు స్టూడియోలతో సరిపెట్టేశారు. కానీ ఏపీ 24*7 పేరుతో ఓ చానెల్ రంగ ప్రవేశం చేయడం అందరినీ ఆనందంలో ముంచింది. ప్రత్యేకంగా ఆంద్రప్రదేశ్ ప్రజల ఆకాంక్షలకు తగ్గట్టుగా చానెల్ ఉంటుందని ఆశించారు. కానీ తీరా ఫలితం చూస్తే చాలా పేలవంగా కనిపిస్తోంది. చానెల్ ప్రభావం దాదాపు శూన్యంగా మారింది. విజయవాడలో మీడియా విస్తరణకు మార్గదర్శకంగా ఉంటుందనుకుంటే తీరా మరింత సంక్లిష్టంగా మార్చేసినట్టు కనిపిస్తోంది.

చాలా సమస్యలు ఎదుర్కొని, ఎట్టకేలకు తెరమీదకు వచ్చిన చానెల్ కి తెలంగాణా రాష్ట్రానికి చెందిన వెంకట క్రుష్ణ సారధ్యం వహిస్తున్నారు. సాయి లాంటి వాళ్లు కొందరు తోడయ్యారు. దాంతో చానెల్ ఎంతో కొంత ఆదరణ పొందుతుందని అభిప్రాయం వ్యక్తం అయ్యింది. కానీ తీరా చూస్తే నాణ్యతలో గానీ, న్యూస్ లో గానీ, ప్రోగ్రామ్స్, ప్రోమెల విషయంలో గానీ ఎక్కడా ప్రమాణాలకు తగ్గట్టుగా కనిపించడం లేదన్నది పలువురి అబిప్రాయం. పైగా ఏపీ వాసుల మనోభావాలను ప్రతిబింబించడం ద్వారా కొంతైనా దూసుకెళ్లే అవకాశం ఉన్నప్పటికీ సంస్థలో పెట్టుబడిదారులంతా ప్రభుత్వ అనునాయులు కావడంతో అలాంటి అవకాశం కూడా లేకుండా పోయింది. దాంతో చానెల్ కి జనాదారణ దక్కడం ఇక కష్టమనే అభిప్రాయం బలపడుతోంది.

ఇప్పటికే హైదరాబాద్ ని వీడి వెళ్లిన వారు కూడా తిరుగుపయనంలో ఉన్నారు. సంస్థలో పరిణామాలు కూడా ఉత్సాహంగా లేకపోవడం దానికి కారణంగా చెబుతున్నారు. ఆధిపత్య పోరుకే ప్రాధాన్యతనిస్తున్న బాసులు, అదే సమయంలో చానెల్ అభివ్రుద్ధికి తగ్గట్టుగా వ్యవహరించకపోవడం కారణంగా భావిస్తున్నారు. ఇప్పటికే అవుట్ ఫుట్, ఇన్ పుట్ సిబ్బంది మీద కొంత ఒత్తిడి పెంచే వ్యవహారాలు సాగుతుండడంతో చాలామంది అర్థాంతరంగా వెనుదిరిగే యోచనలో ఉన్నారని సమాచారం. ఈ నేపథ్యంలో ఈ చానెల్ ఆశించినదానికి భిన్నంగా సాగుతున్నట్టు కనిపిస్తోంది. మొత్తంగా ఆంద్రప్రదేశ్ ఆకాంక్షలను ప్రతిబింబించలేక, ప్రజాదరణ పొందలేక , చానెల్లో సిబ్బందికి సానుకూల వాతావరణ కనిపించలేకపోవడంతో పేరులో ఉన్న ఏపీ పెద్ద సేఫుగా కనిపించడం లేదన్నది మీడియా వర్గాల భోగట్టా.


Related News

sakshi

సాక్షి చేసింది..చేయాల్సింది..!!

Spread the love5Sharesఅధికారం అండ‌తో ప్ర‌వేశించింది. ఆ వెంట‌నే ఆటంకాలు ఎదుర్కోవాల్సి వ‌చ్చింది. అనేక ఒడిదుడుకులు చ‌వి చూసింది. ప్ర‌స్తుతంRead More

Eenadu_Office,Vizag

త‌ప్పులో కాలేసిన ఈనాడు

Spread the love8Sharesజర్న‌లిజంలోనే కాదు..ఎక్క‌డ‌యినా అల‌వాటులో పొర‌పాట్లు కొన్ని స‌హ‌జం. అత్యంత జాగ్ర‌త్త‌గా వ్య‌వ‌హ‌రించే చోట కూడా అలాంటివి చోటుకుంటాయి.Read More

 • మీడియా యాజ‌మాన్యానికి జ‌రిమానా
 • ప‌వ‌న్ కి షాకిచ్చిన మీడియా!
 • అయ్యో..ఆంధ్రజ్యోతి..!
 • ఆంధ్ర‌జ్యోతికి కేకు తినిపించిన జ‌గ‌న్
 • రియ‌ల్ టైమ్ గ‌వ‌ర్నెన్స్..కానీ జ‌ర్న‌లిస్టుల‌కు..!
 • అభాసుపాల‌యిన మీడియా
 • తెలుగు మీడియాలో బాబుకి అన్యాయం!
 • టీవీ9 వెన‌క్కి…ఎన్టీవీ అగ్ర‌స్థానానికి
 • Leave a Reply

  Your email address will not be published. Required fields are marked *