Main Menu

ఆంధ్రజ్యోతి అవస్థలు అన్నీఇన్నీ కావు…

Spread the love

ఏపీ రాజకీయాల్లో ఆంధ్రజ్యోతి పాత్ర గురించి అందరికీ తెలిసిందే. చంద్రబాబు కాల్లో ముళ్లు గుచ్చుకుంటే ఏబీఎన్ యాజమాన్యం నొప్పి అనుభవిస్తుంది. అంతలాంటి రాజకీయ, ఆర్థిక సంబంధాలున్న వారికి తాజా పరిణామాలు అంతగా రుచించడం లేదు. ఓవైపు కమలనాధులు చంద్రబాబుని దాదాపుగా దూరం పెట్టేశారు. కనీస గౌరవం కూడా ఇవ్వడం లేదు. చివరకు ఏడాదికి పైగా కాలం పాటు పీఎం అపాయింట్ మెంట్ కూడా ఇవ్వకుండా ఆశ్చర్యపరిచారు. అయినా చంద్రబాబు ఏమీ అనలేని స్థితిలో ఉన్నారు.కొందరు ఎంపీలు, మంత్రులు రాజీనామాల ప్రస్తావని తెచ్చినా వద్దు అనే వారిస్తున్నారు. కనీసం నిరసన తెలపడానికి కూడా ఆయన సాహించించడం లేదు. ఇది బీజేపీ నేతలకు మరింత అలుసుగా మారింది. తెలుగుదేశం ఎంపీలకు ఇన్నాళ్లుగా ఢిల్లీలో గౌరవం లేదని బాధపడితే, తాజాగా తమను విపక్షం కన్నా దూరం పెడుతున్నారని చెబుతున్నారు.

ఇలాంటి పరిణామాల నేపథ్యంలో వచ్చిన బడ్జెట్ వ్యవహారం పెను దుమారంగా మారింది. ప్రజల్లో బీజేపీ, టీడీపీ విధానాల మీద అసంత్రుప్తి పెరుగుతోంది. దాంతో ఈ దానిని బీజేపీ వైపు మళ్లించే పనిలో చంద్రబాబు ఉన్నారు. ఏపీ అభివ్రుద్ధికి బీజేపీ సహకారం లేకపోవడమే కారణమని చెప్పడానికి సిద్ధపడుతున్నారు. అదే సమయంలో కేంద్రంలో మరోసారి కీలకంగా మారబోతున్నారనే ప్రచారాన్ని ముందుకు తెస్తున్నారు. దానికి తగ్గట్టుగానే ఆంధ్రజ్యోతి అనేక అవస్థలు పడుతోంది. వాస్తవానికి విరుద్ధంగా వార్తలు వండివార్చే పనిలో బిజీగా గడుపుతోంది.

వారం క్రితం నియోజకవర్గాల పెంపుదల గురించి ఆంధ్రజ్యోతి చేసిన హడావిడి అంతా కాదు. చివరకు మోడీ ఆమోదం కూడా వచ్చేసిందని వార్తలు రాశారు. ఆంధ్రజ్యోతి కథనాలు చూసిన చాలామంది ఎవరో వైసీపీ ఎమ్మెల్యే టీడీపీ వైపు మొగ్గుచూపుతున్నట్టుగా ఉందని అంచనాలు వేశారు. దానికి తగ్గట్టుగానే గుంటూరు ఎమ్మెల్యే ముస్తాఫా వెళ్లి ముఖ్యమంత్రిని కలవడం చూశాము. ఇక పార్లమెంటరీ పార్టీ మీటింగ్ నేపథ్యంలో తెలుగుదేశం అధినేతతో అమిత్ షా నుంచి రాజ్ నాథ్ సింగ్ వరకూ కేంద్రంలో కీలక నేతలంతా వరుసగా ఫోన్ లో మాట్లాడుతున్నట్టు లీకు వార్తలు రాసేస్తున్నారు. అది మరింత శ్రుతిమించి చివరకు రాజ్ థాకరేతో కూడా మాట్లాడినట్టు వార్తలు రాసే వరకూ వెళ్లింది. దానిని చంద్రబాబు శిబిరం ఖండించాల్సి వచ్చింది. దాని మూలంగా తప్పుడు సంకేతాలు వెళతాయని భావించి ఆగిపోయినట్టు కనిపిస్తోంది. కానీ ఏబీఎన్ ప్రయత్నాలు మాత్రం విస్మయకరంగా ఉన్నాయి. చంద్రబాబు ఇన్నాళ్లుగా బీజేపీ ఉంటే రాష్ట్ర ప్రయోజనాల కోసం, ఎవరు వారితో పొత్తు పెట్టుకున్నా అది రాష్ట్రానికి నష్టం అన్నట్టుగా చిత్రీకరించడానికి చేస్తున్న ప్రయత్నాలు విడ్డూరంగా కనిపిస్తున్నాయి.


Related News

టీవీ9 మళ్లీ అమ్మేశారు..

Spread the loveతెలుగు మీడియాలో వరుసగా పలు సంస్థల అమ్మకాలు సాగుతున్నాయి. ఇప్పటికే జనసేన కోసం తోట చంద్రశేఖర్ ఆధ్వర్యంలోRead More

బ్రాహ్మ‌ణి స్థానంలో భార‌తి అయితే..!

Spread the loveఏపీ రాజ‌కీయాల్లో మీడియా పాత్ర బాగా మిళితం అయిపోయింది. రాజ‌కీయ అవ‌స‌రాల‌కు త‌గ్గ‌ట్టుగా మీడియా యాజ‌మాన్యాలు స్పందించేRead More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *