ఆంధ్రభూమి మూసివేత?

andhrabhoomi
Spread the love

మళ్లీ ఈ వ్యవహారం తెరమీదకు వచ్చింది. గడిచిన కొన్నేళ్లుగా పదే పదే ముందుకొస్తున్నా…మళ్లీ ఎటువంటి ఆటంకాలు లేకుండానే ఆంధ్రభూమి, డెక్కన్ క్రానికల్ పత్రికలు నడుస్తున్నాయి. కానీ ఈసారి మాత్రం అలాంటి పరిస్థితి ఉండదనే చర్చ మొదలయ్యింది. ఆంధ్రభూమి మూత ఖాయమని పలువురు విశ్వసిస్తున్నారు. ఇటీవలే ఈ పత్రికలో సుదీర్ఘకాలం పనిచేసిన ఎడిటర్ వైదొలిగారు. త్వరలో మరి కొందరు సీనియర్ పాత్రికేయులు కూడా అదే బాట పట్టబోతున్నారు. దాంతో ఆంధ్రభూమి వ్యవహారం హాట్ టాపిక్ అవుతోంది.

చాలాకాలంగా డెక్కన్ క్రానికల్ హోల్డింగ్స్ సంస్థ పలు వివాదాల్లో ఇరుక్కుని ఉంది. సీబీఐ, ఈడీ కేసులు ఎదుర్కొంటోంది. అటాచ్ మెంట్లు కూడా సాగాయి. ఆ క్రమంలోనే దివాళా చట్టం కింద చర్యలు కూడా ప్రారంభమయ్యాయి. ముఖ్యంగా డెక్కన్ ఛార్జర్స్ పేరుతో ఐపీఎల్ క్రికెట్ టీమ్ వ్యవహారంలోనూ ఇతరత్రా వ్యవహారాల్లోనూ అక్రమాలు సాగినట్టు ఆరోపణలు వచ్చాయి. దాంతో ఆంధ్రభూమి యాజమాన్యం అవస్థల్లో ఉన్నట్టు కనిపిస్తోంది.

అయినా సిబ్బంది విషయంలో ఆ సంస్థ చిన్న చిన్న సమస్యలు తప్ప ఎన్నడూ జాప్యం చేయలేదు. వేతనాలు గానీ ఇతర విషయాలలో గానీ సిబ్బంది పట్ల సానుకూలంగా స్పందించింది. అయితే ఇటీవల కొన్ని పరిణామాలు ఆశ్చర్యంగా ఉన్నాయి. ముఖ్యంగా ఎంవీఆర్ శర్మ వైదొలగాల్సి రావడం వెనుక కారణాలపై రకరకాల ప్రచారాలున్నాయి. అందుకుతోడుగా మరికొందరు పెద్ద తలకాయలు వైదొలుగుతున్నట్టు సంకేతాలిస్తున్నారు. ఇది ఖచ్చితంగా ఆంధ్రభూమి భవితవ్యం మీద అనుమానాలతోనేనని చాలామంది విశ్వసిస్తున్నారు.

దాంతో గత ఏప్రిల్ లో ఇచ్చిన నోటీసుల ప్రకారం ఆరు నెలల్లోగా సంస్థను అమ్మకం గానీ, నిర్వహణ కోసం గానీ ఇతరులకు అప్పగించాలి. లేదంటే జప్తు తప్పదనే రీతిలో ప్రచారం సాగుతోంది. దాంతో డెక్కన్ క్రానికల్ యాజమాన్యం మూసివేత ఆలోచనలో ఉన్నారనే వాదన జరుగుతోంది. సుదీర్ఘకాలంగా తెలుగు, ఇంగ్లీష్ పత్రికల్లో ప్రత్యేకతను చాటుకున్న ఈ సంస్థ కొనసాగాలనే పలువురు ఆశిస్తున్నారు. మరి చివరకు గతంలో సాగిన ప్రచారం మాదిరిగా తేలిపోతుందా…నిజంగానే మూతపడుతుందా అన్నదానికి కాలమే సమాధానం చెప్పాలి. సివ


Related News

media

తెలుగు మీడియా కళ్లు తెరవదా?

Spread the loveఏపీ రాజకీయ వ్యవహారాల్లో మాత్రం తెలుగు మీడియా తీరు భిన్నంగా ఉంటుంది. చంద్రబాబు అధికారంలో ఉన్న సమయంలోRead More

whatsapp fb

ఎఫ్ బీ, గూగుల్ కి నోటీసులు

Spread the loveప్రింట్ , ఎలక్ట్రానిక్ మీడియాలే కాదు డిజిటల్ మీడియాలో కూడా నిబంధనలు పాటించాల్సిందే. దానికి భిన్నంగా సాగితేRead More

 • మీడియా విషయంలో మనసు మార్చుకున్న జనసేన
 • చంద్రబాబు దొరికిపోయారు..
 • మహిళా జర్నలిస్టుపై వేధింపులు
 • ఆ చానెల్ ని జనసేన టేకోవర్ చేస్తుందా?
 • అయ్యో..ఆంధ్ర‌జ్యోతికి న‌కిలీల బెడ‌ద‌
 • మీడియా వాళ్లంతా నంగ‌నాచులా..?
 • ప‌వ‌న్ పై ఏబీఎన్ ఎదురుదాడి…
 • ఆ చానెల్ ని కూడా వ‌దిలిపెట్ట‌ని ప‌వ‌న్ క‌ళ్యాణ్
 • Leave a Reply

  Your email address will not be published. Required fields are marked *