Main Menu

ఆంధ్ర‌జ్యోతికి అప్ప‌నంగా ..!?

Spread the love

తెలుగు మీడియాలో నిత్యం వివాదాల్లో ఉండే సంస్థ ఆంధ్ర‌జ్యోతి. ఎండీ రాధాకృష్ణ దూకుడు కార‌ణంగా ఉభ‌య తెలుగు రాష్ట్రాల్లోనూ ఈ మీడియా సంస్థ వార్త‌ల్లో ఉంటుంది. ఈసారి అవినీతి ఆరోప‌ణ‌ల వ్య‌వ‌హారంలో ఆ సంస్థ‌కు సంబంధాలున్నాయ‌నే అనుమానాలు విశేషంగా మారుతున్నాయి. మీడియా. రాజ‌కీయ వ‌ర్గాల్లో చ‌ర్చ‌కు దారితీస్తున్నాయి.

ఏపీ ప్ర‌భుత్వ మాజీ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి అజ‌య్ క‌ల్లం ఆరోప‌ణ‌లు క‌ల‌క‌లం రేపుతున్నాయి. ఏకంగా 700 కోట్లు నాలుగేళ్ల‌లో ఓ మీడియా సంస్థ‌కు క‌ట్ట‌బెట్టారంటూ ఆయ‌న వ్యాఖ్యానించారు. దాంతో ప్ర‌భుత్వ కార్యక్ర‌మాల ప్ర‌సార హ‌క్కులు ద‌క్కించుకోవ‌డం, విశాఖ‌, రేణిగుంట స‌హా ప‌లు చోట్ల ఆంధ్ర‌జ్యోతి కార్యాల‌యాల‌కు ప్ర‌భుత్వం ద్వారా విలువైన స్థలాలు ద‌క్కించుకోవ‌డం వంటి ప‌రిణామాల నేప‌థ్యంలో ఆ మీడియా సంస్థ ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతేన‌ని అంతా భావిస్తున్నారు.

వాస్త‌వానికి వైఎస్ హ‌యంలోనే రాధాకృష్ణ మీద ఆరోప‌ణ‌లువ‌చ్చాయి. ఇప్ప‌ట్లో ఇబ్ర‌హీంప‌ట్నంలోని రాధాకృష్ణ ప‌వ‌ర్ ప్లాంట్ కి అవ‌స‌ర‌మైన నీటి వ‌న‌రులు స‌హా ప‌లు అవ‌స‌రాల‌కు వైఎస్ అడ్డుప‌డ్డ‌ట్టు రాధాకృష్ణ కూడా చెప్పుకున్నారు. దాంతోనే వైఎస్ ప్ర‌భుత్వానికి వ్య‌తిరేకంగా ఆంధ్ర‌జ్యోతి క‌థ‌నాలు రాసేద‌ని కొంద‌రు భావించేవారు. ఆత‌ర్వాత కిర‌ణ్ కుమార్ రెడ్డి స‌ర్కారులో రాధాకృష్ణ ప‌వ‌ర్ ప్లాంట్ కి అనుమ‌తులు రావ‌డం కూడా విమ‌ర్శ‌లు తావిచ్చింది.

ఇక చంద్ర‌బాబు ప్ర‌భుత్వంలో రాధాకృష్ణ‌కు భారీ ల‌బ్ధి చేకూరిన‌ట్టు ప‌లు ఆరోప‌ణ‌లు ఉన్నాయి. ముఖ్యంగా టెండ‌ర్లు కూడా లేకుండా అసెంబ్లీ ప్ర‌సారాల క‌వ‌రేజ్ ని రాధాకృష్ణ త‌న‌యుడు ఆదిత్య పేరుతో ఉన్న సంస్థ‌కు క‌ట్ట‌బెట్ట‌డంపై వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామ‌కృష్ణారెడ్డి కోర్టులో కేసు కూడా వేశారు. ఈ నేప‌థ్యంలో అజ‌య్ క‌ల్లం ఆరోపించిన‌ట్టు ఏకంగా 700 కోట్లు అంటే ప్ర‌తీ ఏటా 200 కోట్ల వ‌ర‌కూ ఒక్క మీడియా సంస్థ‌కు చంద్రబాబు మేలు చేయ‌డం ఆస‌క్తిగా మారింది. దాంతోనే విప‌క్షాల‌కు వ్య‌తిరేకంగా నిత్యం క‌థ‌నాలు వండి వారుస్తూ, చంద్ర‌బాబు భ‌జ‌న‌లో ఈ సంస్థ మునిగితేలుతుంద‌నే వాద‌న‌కు బ‌లం చేకూరుతోంది. అయితే ఈ ఆరోప‌ణ‌ల ప‌ట్ల ఆర్కే మార్క్ స్పంద‌న ఎలా ఉంటుందో చూడాలి.






Related News

మీటూ ఎఫెక్ట్: ఇద్ద‌రు ఎడిట‌ర్ల‌పై వేటు

Spread the loveమాజీ పత్రికా సంపాదకులు ఎంజె అక్బర్‌, తరుణ్‌ తేజ్‌పాల్‌ను బుధవారం ఎడిటర్స్‌ గిల్డ్‌ ఆఫ్‌ ఇండియా (ఇజిఐ)Read More

చ‌ర్చ‌నీయాంశంగా మారిన టీవీ9 స‌ర్వే

Spread the loveప్ర‌స్తుతం ఎన్నిక‌ల పోరులో ప్ర‌తీ అవ‌కాశం కూడా వినియోగించుకునేందుకు పార్టీలు తీవ్రంగా ప్ర‌య‌త్నిస్తున్నాయి. మీడియా అందుకు తందానRead More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *