Main Menu

గ‌ర్భిణి కేసులో బ‌రి తెగించిన ఆంధ్ర‌జ్యోతి

Spread the love

ఆంధ్ర‌జ్యోతి రాధాకృష్ణ ప‌సుపు జెండా ప‌ట్టుకోవ‌డ‌మే మిగిలింది త‌ప్ప‌, మిగిలినన్ని ప‌నులు చేస్తున్నార‌నే వాద‌న ఉంది. అయితే తాజాగా ఆ మీడియా సంస్థ ఓ గ‌ర్భిణీ విష‌యంలో బ‌రితెగించిన తీరుతో పూర్తిగా ప‌చ్చ‌పాతంతో వ్య‌వ‌హ‌రిస్తున్నార‌నే విమ‌ర్శ‌లు వంద శాతం నిజ‌మ‌ని రూఢీ అయ్యింది. ఆ సంస్థ వార్త‌ల ప‌ట్ల విశ్వ‌స‌నీయ‌త దాదాపుగా స‌న్న‌గిల్లిపోవ‌డానికి ఈ ఒక్క ఉదాహ‌ర‌ణ చాలని చెప్ప‌వ‌ల‌సి వ‌స్తోంది.

విశాఖ జిల్లా పెద గంట్యాడ‌లో ఓ ఇంటి అద్దె విష‌యంలో య‌జ‌మానికి, బాధితుల‌కు మ‌ధ్య త‌గాదా వ‌చ్చింది. దాంతో మ‌హిళ ప‌ట్ల ఇంటి య‌జ‌మాని దురుసుగా ప్ర‌వ‌ర్తించ‌డంతో వ్య‌వ‌హారం పోలీస్ స్టేష‌న్ కి వెళ్లింది. చివ‌ర‌కు ఆమె ఫిర్యాదుతో పోలీసులు రంగంలోకి వ‌చ్చారు. ఈలోగా గ‌ర్భిణీ ఆరోగ్య ప‌రిస్థితి దెబ్బ‌తిన‌డంతో ఆస్ప‌త్రికి త‌ర‌లించి చికిత్స అందించారు.

అయితే ఆంధ్ర‌జ్యోతి ప‌త్రిక రాసిన క‌థ‌నం చ‌ద‌వండి.. ఏక‌ప‌క్షంగా ఈ విష‌యాన్ని వైసీపీకి ఆపాదించి రాసిన విష‌యం గ్ర‌హించండి. జ‌గ‌న్ మీద రాధాకృష్ణ‌కు వ్య‌క్తిగ‌తంగా ద్వేషం ఉండ‌డంలో త‌ప్పులేదు. ఆ విష‌యాన్ని కొత్త ప‌లుకు, చెత్త ప‌లుకు అంటూ రాసుకునే సొంత కాల‌మ్స్ లో త‌న అభిప్రాయంగా వెలిబుచ్చ‌డంలో వింతేమీ లేదు. కానీ ఈసారి ఏకంగా వార్త‌ల‌కు విష ప్ర‌చారం పూసి ప్ర‌జ‌ల‌ను ప‌క్క‌దారి ప‌ట్టించేందుకు ప్ర‌య‌త్నం చేయ‌డం వివాదంగా మారుతోంది.

ఈ ఘ‌ట‌న ప‌ట్ల పోలీసులు కూడా వ్య‌క్తిగ‌త త‌గాదా అని నిర్థారించారు. ఇంటి అద్దె విష‌యంలో మొద‌ల‌యిన వివాదం దాడికి దారితీసిందని, రాజ‌కీయ కార‌ణాలు లేవ‌ని స్థానిక స‌బ్ ఇన్ స్పెక్ట‌ర్ మీడియాకు వెల్ల‌డించారు. అయినా ఆంధ్ర‌జ్యోతి మాత్రం త‌న మార్క్ వార్తా నిందా ప్ర‌చారాల‌ను మాత్రం ఆపే అవ‌కాశం ఉండ‌ద‌ని భావించాల్సి వ‌స్తోంది. ఇలాంటి క‌థ‌నాల ప‌ట్ల ప్ర‌జ‌ల చైత‌న్యం మాత్ర‌మే ప‌రిష్కారం అవుతుంది. ఇలాంటి ప‌త్రిక‌లు, మీడియా సంస్థ‌ల‌ను దూరం పెట్ట‌డం మాత్ర‌మే ఏకైక మార్గం అవుతుంది.






Related News

రామోజీ..! ఇదేనా ప‌ద్ధ‌తి ?

Spread the loveఈనాడు..తెలుగు మీడియాలో నేటికీ చాలామంది ఆ సంస్థ‌ల విలువ‌ల‌ను ప్ర‌స్తావిస్తూ ఉంటారు. అంతో ఇంతో పాత్రికేయ సూత్రాల‌కుRead More

పుంజుకున్న సాక్షి టీవీ: పొలిటిక‌ల్ సంకేత‌మేనా?

Spread the loveతెలుగు మీడియాలో బార్క్ రేటింగ్స్ కి పెద్ద‌గా ప్రాధాన్య‌త లేక‌పోవ‌చ్చు గానీ వాటికున్న గుర్తింపు వాటికుటుంద‌న‌డంలో సందేహంRead More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *