జ్యోతి వక్రభాష్యం, ఈనాడు వంతపాట

nandyala
Spread the love

మీడియాలో మార్పులు అనివార్యం అని అందరికీ తెలుసు. సొంత ఎజెండా కోసమే సంస్థలు పుట్టిన తర్వాత మీడియాలో బాకా ఊదే బ్యాచ్ పెరుగుతూనే ఉంటుంది. దానికి అనుగుణంగా వార్తల వక్రీకరణలు కొనసాగుతూనే ఉంటాయి. తాజాగా నంద్యాలలో శిల్పా చక్రపాణిరెడ్డి మీద జరిగిన దాడిని చిత్రీకరించడానికి ఆంధ్రజ్యోతి తపన, అందుకోసం అడ్డగోలుగా రాసిన రాతలు ఆశ్చర్యం కలిగిస్తున్నాయి. అదే సమయంలో ఈనాడు కూడా ఇష్టారాజ్యంగా తెలుగుదేశం పార్టీకి ఇబ్బంది రాకుండా చూసుకోవడమే లక్ష్యంగా సాగినట్టు స్పష్టమవుతోంది. ఆ ముసుగులో నంద్యాలలో అరాచకానికి తెరలేపి, ఆఖరికి కాల్పుల వరకూ వెళ్లిన అభిరుచి మధు భాగోతాన్ని కప్పిపుచ్చే ప్రయత్నం చేశాయి.

నంద్యాలలో జరిగిన ఘటనలకు సంబంధించి పత్రికల్లో వివిధ కథనాలు వచ్చాయి. ఒక్కో పత్రిక ఒక రకంగా అక్కడి పరిస్థితిని పాఠకులకు అందించాయి. మీడియా చానెళ్లు వెనువెంటనే సమాచారం అందించాల్సిన నేపథ్యంలో కొంత అత్యుత్సాహం, కొంత అసమగ్రంగా ప్రసారం చేస్తాయని అందరికీ తెలుసు. కొన్ని సార్లు తప్పులు జరిగినా పెద్దగా ఆశ్చర్యపోవాల్సిన పనిలేదు. కానీ పత్రికలకు తగిన సమయం ఉంటుంది. పూర్తిగా విశ్లేషించుకునే అవకాశం ఉంటుంది. మద్యాహ్నం జరిగిన ఘటన కాబట్టి రాత్రి వరకూ తీరిగ్గా అక్కడి వాస్తవాలను తెలుసుకుని, వార్త ఇచ్చే అవకాశం ఉంటుంది. అయినా ఆంధ్రజ్యోతి, ఈనాడు రాతలకు మిగిలిన పత్రికలకు పొంతన కనిపించడం లేదు. దానికి కారణం వాస్తవాలను వక్రీకరించడానికి ఈ రెండు పత్రికలు ప్రయత్నించడమే అని చెప్పక తప్పదు. అదే సమయంలో సాక్షి పూర్తిగా స్వప్రయోజనాల పరిరక్షణకు ప్రాధాన్యతనిచ్చినప్పటికీ వాస్తవానికి కొంత దగ్గరగా ఉంది.

నంద్యాలలో తన అభిమాని బంధువు మరణించడంతో పరామర్శకు వెళ్లిన శిల్పా చక్రపాణిరెడ్డి తిరిగి వస్తుండగా గిల్లి కజ్జాలు పెట్టుకున్నది అబిరుచి మధు. అసలే రౌడీషీటర్, పైగా నంద్యాల పోలింగ్ తర్వాత అసహనంతో ఉండడం, పోలింగ్ ముగింపు సందర్భంగా సాగిన వివాదం కారణంగా అభిరుచి మధు అడ్డుగా కారు పెట్టి వివాదానికి మూలమయ్యారు. ఆ సమయంలో శిల్పా అనుచరులు దూసుకురావడం వివాదానికి దారితీసింది. ఇరువర్గాలు రెచ్చిపోయే పరిస్థితి వస్తున్నా పోలీసులు కళ్లప్పించి చూడడంతో సమస్య తీవ్రమయ్యింది. ఆ క్రమంలోనే అబిరుచి మధు గన్ మేన్ కాల్పులు జరపడం ప్రకంపనలు పుట్టించింది. చెల్లాచెదరయిన శిల్పా అనుచరులు రాళ్లు రువ్వడం, మధు కారు అద్దాలు ధ్వంసం కావడం జరిగింది. చివరకు టెంకయాల కత్తితో మధు వీరంగా విజువల్స్ సాక్షిగా కనిపిస్తోంది.

అయినా ఆంధ్రజ్యోతి మాత్రం మధు మీద దాడి జరిగినట్టు చిత్రీకరించడానికి తీవ్రంగా శ్రమించింది. అతడిదేమీ తప్పులేదని చెప్పడానికి సాహసించింది. ఎన్నికల కోడ్ ఉండగా ప్రైవేట్ గన్ మేన్ దగ్గర తుపాకి ఉన్న వాస్తవాన్ని కప్పిపుచ్చడానికి కథనం కేటాయించింది. అదే సమయంలో ఈనాడు కూడా దానికి తగ్గట్టుగానే వ్యవహరించింది. వాస్తవాన్ని వక్రీకరించడానికి తోడ్పడింది. మిగిలిన పత్రికల్లో వాస్తవాలు రాగా, ఈ రెండు పత్రికలు మాత్రం యధేశ్చగా రెచ్చిపోయి వక్రభాష్యాలతో పునీతమయినట్టు స్పష్టమవుతోంది. అదే సమయంలో పోలీస్ యంత్రాంగం కూడా కత్తి, గన్ తో వీరంగం చేసిన వ్యక్తిని కాకుండా శిల్పా మీద కేసు నమోదు చేయడం ద్వారా ప్రభుత్వ ఆదేశాల మేరకు రౌడీషీటర్లకు వత్తాసు పలికినట్టు కనిపించింది. మీడియా దానికి తందాన తాన అన్నట్టుగా అర్థమవుతోంది. కానీ రౌడీయిజాన్ని ఇలా రాజకీయం ముసుగులో సమర్థించాలని చూస్తే చివరకు ఎలా పామై కాటేస్తుందో అందరికీ తెలిసిందే. కాబట్టి మరచిపోతే ప్రమాదం సుమా






Related News

media

తెలుగు మీడియా కళ్లు తెరవదా?

Spread the loveఏపీ రాజకీయ వ్యవహారాల్లో మాత్రం తెలుగు మీడియా తీరు భిన్నంగా ఉంటుంది. చంద్రబాబు అధికారంలో ఉన్న సమయంలోRead More

whatsapp fb

ఎఫ్ బీ, గూగుల్ కి నోటీసులు

Spread the loveప్రింట్ , ఎలక్ట్రానిక్ మీడియాలే కాదు డిజిటల్ మీడియాలో కూడా నిబంధనలు పాటించాల్సిందే. దానికి భిన్నంగా సాగితేRead More

  • మీడియా విషయంలో మనసు మార్చుకున్న జనసేన
  • చంద్రబాబు దొరికిపోయారు..
  • మహిళా జర్నలిస్టుపై వేధింపులు
  • ఆ చానెల్ ని జనసేన టేకోవర్ చేస్తుందా?
  • అయ్యో..ఆంధ్ర‌జ్యోతికి న‌కిలీల బెడ‌ద‌
  • మీడియా వాళ్లంతా నంగ‌నాచులా..?
  • ప‌వ‌న్ పై ఏబీఎన్ ఎదురుదాడి…
  • ఆ చానెల్ ని కూడా వ‌దిలిపెట్ట‌ని ప‌వ‌న్ క‌ళ్యాణ్
  • Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *