అయ్యో…ఈనాడుకి స్పీకర్ కొడుకు తెలియదట!

22365185_1854603891520047_4654271792630519741_n
Spread the love

ఆశ్చర్యపోకండి. నిజంగా నిజం..అంత పెద్ద తెలుగు పత్రికకి ఏపీ అసెంబ్లీ స్పీకర్ కొడుకు తెలియకపోవడం ఏంటని అనుకుంటున్నారా…నిజంగా తెలియనట్టే ఉంది. కావాలంటే కిందన ఉన్న పేపర్ క్లిప్పుంగులో ఉంది. మీరు కూడా చూడండి.

ఇటీవల స్పీకర్ కొడెల శివప్రసాద్ రావు తనయుడు కోడెల శివరామక్రుష్ణ వ్యవహారాలు శ్రుతిమించిపోతున్నాయి. పలు వివాదాల్లో ఆయన వేలు పెడుతున్నారు. అది చివరకు కోర్టులకు చేరింది. సీబీఐ విచారణ జరపాలంటూ ఓ రైతు వేసిన పిటీషన్ పై ఉమ్మడి రాష్ట్ర హైకోర్ట్ స్పందించింది. స్పీకర్ తనయుడికి నోటీసులు జారీ చేసింది. దాంతో ఈ వ్యవహారం ఇప్పుడు పల్నాడు రాజకీయాల్లో పెను సంచలనంగా మారుతోంది.

తెలుగుదేశం నాయకుడిగా, స్పీకర్ తనయుడిగా వచ్చే ఎన్నికల్లో బరిలో దిగాలని శివరామక్రుష్ణ సన్నాహాలు చేసుకుంటున్నారు. ఈ సమయంలో హైకోర్ట్ నోటీసులు ఆయనకు కొంత కలవరం కలిగించే అంశం. దాంతో ఈనాడు తన అసలు రూపం బయటపెట్టింది. స్పీకర్ తనయుడు అనే విషయాన్ని కప్పిపుచ్చిితే పాఠకులు వాస్తవాన్ని గ్రహించలేరని భావించి అసలు బుద్ధిచాటుకుంది. అందుకే స్పీకర్ తనయుడు అనే మాటను విస్మరించి వార్తను వండి వార్చేసింది. తద్వారా పాఠకులకు అసలు విషయం చేరకుండా ప్రయత్నించింది. ఎవరో కోడెల శివరామక్రుష్ణ అనే దానికి, స్పీకర్ కోడెల తనయుడు అనే దానికి చాలా వైరుధ్యం ఉంటుంది. అందులోనూ ఇప్పుడు సదరు నోటీసులందుకున్న వ్యక్తి కూడా స్పీకర్ అధికార బలాన్ని అవకాశంగా మార్చుకుని సాగిస్తున్న వ్యవహారాలే కాబట్టి దానిని ప్రస్తావించాల్సి ఉంది. అయినా ఈనాడు అర్థసత్యాలతో కథనం ఇవ్వడం ఆశ్చర్యం కాకపోయినా మరో అడుగు దిగజారిందనడానికి నిదర్శనం.


Leave a Reply

Your email address will not be published. Required fields are marked *