Main Menu

టీవీ9 రాజేస్తే ..ఏబీఎన్ పరిష్కరించిందా?

Spread the love

తెలుగు మీడియా పెద్ద వివాదంలో ఇరుక్కుంది. ముఖ్యంగా టీవీ9 మీద సోషల్ మీడియాలో తీవ్ర వ్యతిరేకత కనిపించింది. కత్తి మహేష్, పవన్ ఫ్యాన్స్ వివాదం ఆ చానెల్ రాజేస్తుందనే వాదన పెద్ద స్థాయిలో సాగింది. పదే పదే లైవ్ డిబేట్ ల మూలంగా ఆఖరికి రేటింగ్స్ లో ఎంత ప్రయోజనం దక్కిందో తెలియదు గానీ టీవీ9 మాత్రం పలువురు అభిమానాన్ని కోల్పోయిందనే చెప్పవచ్చు. మొత్తంగా టీవీ9కి కత్తి ఎపిసోడ్ ద్వారా కలిగిన లాభం కంటే నష్టమే ఎక్కువని పలువురు భావిస్తున్నారు.

అదే సమయంలో ఈ వ్యవహారంలో చివరి నిమిషంలో ఏబీఎన్ పాత్ర అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. ఆసక్తిగా కనిపిస్తోంది. కత్తి మహేష్ మీద దాడి జరిగిన తర్వాత ఆయన ఫిర్యాదు చేయడం, ఆ వెంటనే పవన్ కళ్యాణ్ ఫామ్ హౌస్ వ్యవహారాలను ప్రస్తావించడం పెద్ద వివాదంగా మరలుతున్నట్టు కనిపించింది. కానీ అంతలోనే ఫామ్ హౌస్ ప్రస్తావన ముందుకు రాగానే జనసేన కార్యాలయం నుంచి ఓ ప్రెస్ నోట్ విడుదలయ్యింది. అంతా ప్రశాంతంగా ఉండాలని, విమర్శలకు స్పందించవద్దనే వినతి వచ్చింది. పవన్ కళ్యాణ్ కార్యాలయం నుంచి అలాంటి స్పందన కోసం చాలాకాలంగా డిమాండ్ చేస్తున్న కత్తిమహేష్ చివరకు తాను అనుకున్నట్టుగా పార్టీ స్పందించే వరకూ తీసుకొచ్చారు.

దాంతో కథ మారింది. ఆ వెంటనే ఏబీఎన్ రంగంలోకి వచ్చింది. సమస్యకు పరిష్కారం పేరుతో డిబేట్ నిర్వహించింది. కోన వెంకట్ రంగంలోకి వచ్చారు. కత్తి మహేష్ మీద దాడికి పాల్పడిన పవన్ ఫ్యాన్స్ వచ్చి క్షమాపణలు చెప్పారు. ఆ వెంటనే రాత్రి దాడి జరిగితే మధ్యాహ్నం ఫిర్యాదు చేసిన కత్తి, మళ్లీ సాయంత్రానికే కేసు ఉపసంహరించుకున్నారు. దాంతో కథ ముగిసినట్టేనని ప్రచారం మొదలయ్యింది. అదే సమయంలో కత్తి మహేష్ మాత్రం తాను సినీ, రాజకీయ విమర్శలు ఆపేది లేదని తేల్చేశారు. వ్యక్తిగత విమర్శలకు ముగింపు పలికినట్టు ప్రకటించారు.

అంటే ఫామ్ హౌస్ విషయం ప్రస్తావన రాగానే కథలో పెను మార్పులు వచ్చినట్టు అర్థమవుతోంది. ఇదే ఇప్పుడు మరింత చర్చనీయాంశం అవుతోంది. అనేక విమర్శలు వచ్చినప్పటికీ స్పందించని జనసేన అధినేత ఎందుకు ఫ్యాన్స్ ని చల్లబడాలని పిలుపునిచ్చారు, కత్తి విమర్శలకు అధినేత స్పందించరని పదే పదే చెప్పిన ఫ్యాన్స్ చివరకు ఎందుకు క్షమాపణలు చెప్పారు, తన యుద్ధం ఆగదని చెప్పిన కత్తి విమర్శలకు తాత్కాలికంగానైనా విరామం ప్రకటించడానికి సిద్ధం కావడం అంతా చకచకా సాగిపోయాయి. దాంతో ఇకనైనా టీవీలలో ఈ వ్యవహారానికి చెక్ పడినట్టేనని సగటు ప్రేక్షకుడు కొంత రిలీఫ్ ఫీలయ్యే అవకాశం దక్కింది. అదే సమయంలో టీవీ9 అలా..ఏబీఎన్ ఇలా వ్యవహరించడానికి వెనుక ఎవరైనా ఉన్నారా అన్న ప్రశ్నకు మాత్రం ప్రస్తుతానికి సమాధానం లేదు.


Related News

మీడియాకు జ‌న‌సేన ఝ‌ల‌క్

Spread the loveవైసీపీ అధికారిక ప‌త్రిక ముసుగులో స‌ర్థుబాట్లు పేరుతో రాసిన క‌థ‌నం క‌ల‌క‌లం రేపింది. జ‌న‌సేన‌, టీడీపీ మ‌ధ్యRead More

బాబు ప‌రువు తీసిన మీడియా

Spread the loveఏపీ సీఎం చంద్ర‌బాబు కి అనుకున్న‌దొక‌టి..అయ్యిందొక‌టి అన్న‌ట్టుగా మారింది. ఎంతో వ్య‌య‌ప్ర‌యాస‌ల‌తో నిర్వ‌హించిన ఢిల్లీ దీక్ష చివ‌ర‌కుRead More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *