Main Menu

రాజకీయ పాత్రలో రాధాకృష్ణ‌

Spread the love

కుక్క పిల్ల సబ్బు పిల్ల కవితకు అనర్హమో కాదో తెలియదు గానీ అన్ని సందర్భాలనూ రాజకీయ అవసరాలకు అనుగుణంగా మార్చుకోవడం ద్వారా చావు, పెళ్లి, శ్రీమంతం కావేవి రాజకీయాలకనర్హం అన్నట్టుగా మార్చేశారు మన రాజకీయ నేతలు. అందుకు తగ్గట్టుగా ఇప్పడుు అన్ని వేడుకలు కనిపిస్తున్నాయి. రాజకీయ అవసరాలకు తగ్గట్టుగానే వాటిని తీర్చిదిద్దుతున్నారు. తాజాగా పరిటాల సునీత రాజకీయ వారసుడిగా రంగ ప్రవేశానికి సిద్ధమవుతున్న శ్రీరామ్ పెళ్లి వేడుక దానికి నిదర్శనం. వచ్చే ఎన్నికల్లో అసెంబ్లీ బరిలో దిగాలని తహతహలాడుతున్న శ్రీరామ్ దానికి తగ్గట్టుగానే ధర్మవరం రాజకీయలలో ముద్రవేయడానికి తగ్గట్టుగా వివాహ వేడుకను నిర్వహించారు. అతిరథ మహారథుల రాకతో అంగరంగ వైభవంగా నిర్వహించారు.

అయితే ఈ పెళ్లి వేడుకలను భవిష్యత్తు రాజకీయాలకు తగ్గట్టుగా కేసీఆర్ మార్చుకున్న తీరు అందరిలో ఆసక్తి రేకెత్తించింది. పయ్యావుల కేశవ్ తో కేసీఆర్ జరిపిన ప్రత్యేక మంతనాలు పలురకాల వాదనలకు ఆస్కారమిచ్చింది. కేసీఆర్ కూడా అదే కోరుకున్నట్టు భావించాల్సి వస్తోంది. గతంలో మోడీ హైదరాబాద్ పర్యటన సందర్భంగా కేసీఆర్ ని పక్కకు పిలిచి మాట్లాడగా..ఇప్పుడు కేసీఆర్ అదే పనిచేసి కొత్త చర్చకు తెరలేపారు. టీటీడీపీ నేతలకు పూర్తిగా గందరగోళంగా మార్చేశారు.

అదే సమయంలో శ్రీరామ్ వివాహ వేడుకల్లో మరో ఆసక్తికర అంశం ఆంధ్రజ్యోతి యజమాని రాధాకృష్ణ‌ అంశం. చాలాకాలంగా ఆయన మీడియాలో ఉన్నప్పటికీ రాజకీయాలే చేస్తారన్నది చాలామంది అంగీకరించే విషయం. చివరకు వైసీపీ నుంచి ఫిరాయింపులు ప్రోత్సహించడం వెనుక ఆయన పాత్ర ఉందనే విమర్శలు బహిరంగంగానే వినిపించాయి. ఇక తాజాగా ఆయన పరిటాల వారి పెళ్లి వేడుకలో ఇద్దరు ముఖ్యమంత్రుల మధ్య సఖ్యత కుదిర్చే వారధిగానే కాకుండా, తెలుగుదేశం నేతలందరితో రాసిపూసుకుని తిరిగిన నేపథ్యం గమనిస్తే త్వరలో ఆయన పూర్తిస్థాయి రాజకీయ నేతగా మారడానికి తహతహలాడుతున్నారనే ప్రచారం ఊపందుకుంది. వాస్తవానికి ఆయన రాజ్యసభ రేసులో ఉన్నారని చాలాకాలంగా ప్రచారం ఉంది. అయినా అది ఆచరణ రూపం దాల్చలేదు. ఇక ఇప్పుడు మారుతున్న రాధాకృష్ణ‌ వ్యవహారం గమనిస్తే ఖచ్చితంగా పొలిటికల్ స్క్రీన్ ఎంట్రీ ఖాయమని చెబుతున్నారు. అది ఏమేరకు ఆచరణ సాధ్యం అవుతుందన్నది కాలమే సమాధానం చెప్పాలి.


Related News

‘టైమ్’ మారిపోయింది..

Spread the loveతెలుగులోనే కాదు ప్ర‌పంచ వ్యాప్తంగా మీడియా సంస్థ‌లు చేతులు మారే రోజులు వ‌చ్చేశాయి. అనేక సంస్థ‌లు వ‌రుస‌గాRead More

మూర్తి అడుగులు అటువైపేనా..!

Spread the loveమహామూర్తిగా చెల‌రేగిన సీనియర్ జ‌ర్న‌లిస్ట్ వ్య‌వ‌హారం ఇప్పుడు ఆస‌క్తిగా మారింది. మీడియా వ‌ర్గాల‌తో పాటు రాజ‌కీయంగానూ చ‌ర్చ‌నీయాంశంRead More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *