Main Menu

అయ్యో..ఆంధ్ర‌జ్యోతికి న‌కిలీల బెడ‌ద‌

Spread the love

ఆంధ్ర‌జ్యోతికి న‌కిలీల బెడ‌ద ఏర్ప‌డింది. వ‌రుస‌గా వెలుస్తున్న న‌కిలీ వ్య‌వ‌హారాల‌తో క‌ల‌త చెందుతోంది. క‌ల‌వ‌రం క‌లిగిస్తున్న వారిపై చ‌ర్య‌లు కోరుతూ ఏకంగా ఖాకీల‌ను ఆశ్ర‌యించింది. ఏబీఎన్- ఆంధ్ర‌జ్యోతి సంస్థల ఎండీ సైబ‌ర్ క్రైమ్ పోలీసుల‌ను ఆశ్ర‌యించారు. త‌న పేరుతో ట్విట్ట‌ర్ లో ఫేక్ అకౌంట్ క్రియేట్ చేశార‌ని ఫిర్యాదు చేశారు. అంతేగాకుండా ఆ అకౌంట్లో విద్వేషాల‌కు దారితీసే కంటెంట్ పోస్ట్ చేస్తున్నారంటూ పోలీసుల దృష్టికి తీసుకెళ్లారు. ఆ అకౌంట్ నిర్వాహ‌కుల‌పై చర్య‌లు తీసుకోవాల‌ని కోరారు. త‌న‌కు అధికారికంగా ట్విట్ట‌ర్ లో గానీ, ఫేస్ బుక్ లో గానీ ఎటువంటి అకౌంట్లు లేవ‌ని స్ప‌ష్టం చేశారు.

అదే స‌మ‌యంలో ‘ఏబీఎన్‌ ఆంధ్రజ్యోతి’ లోగో, చానల్‌ బ్రేకింగ్‌న్యూస్‌ టెంప్లేట్‌ స్ర్కీన్‌షాట్లు దుర్వినియోగం అవుతున్నాయ‌ని ఆ సంస్థ వాపోతోంది. రెచ్చగొట్టే వార్తలు, వ్యాఖ్యలతో మార్ఫింగ్‌ చేసి వాట్సాప్‌, ట్విటర్‌, ఫేస్‌బుక్‌లలో దుష్ప్రచారాలకు పాల్పడుతున్నారని మండిప‌డుతోంది. ‘ఆంధ్రజ్యోతి’, ‘ఏబీన్‌-ఆంధ్రజ్యోతి’ పేరుతో సోషల్‌ మీడియాతో ఎలాంటి నకిలీ ఖాతాలు సృష్టించినా చ‌ర్య‌లు త‌ప్ప‌వ‌ని చెబుతోంది. వివాదాస్పద కంటెంట్‌ పోస్ట్‌ చేసినా.. సంస్థ లోగోని దుర్వినియోగం చేసిన వారిపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది.

మొత్తంగా సోష‌ల్ మీడియా దెబ్బ‌తో బ‌డా మీడియా సంస్థ‌లు కూడా త‌ల్ల‌డిల్లిపోతున్న‌ట్టు క‌నిపిస్తోంది. ముఖ్యంగా ఫేక్ అకౌంట్ల త‌ల‌నొప్పి వ్య‌క్తుల‌కే కాకుండా తాజాగా పాపుల‌ర్ మీడియా సంస్థ‌ల‌కు కూడా మొద‌ల‌యిన‌ట్టు క‌నిపిస్తోంది. దానిని అడ్డుకోవ‌డానికి ఏబీఎన్ రంగంలో దిగ‌డంతో మిగిలిన వారికి కూడా ఊర‌ట ల‌భించే అవ‌కాశం ఉంది.






Related News

టీవీ9 మళ్లీ అమ్మేశారు..

Spread the love7Sharesతెలుగు మీడియాలో వరుసగా పలు సంస్థల అమ్మకాలు సాగుతున్నాయి. ఇప్పటికే జనసేన కోసం తోట చంద్రశేఖర్ ఆధ్వర్యంలోRead More

బ్రాహ్మ‌ణి స్థానంలో భార‌తి అయితే..!

Spread the love60Sharesఏపీ రాజ‌కీయాల్లో మీడియా పాత్ర బాగా మిళితం అయిపోయింది. రాజ‌కీయ అవ‌స‌రాల‌కు త‌గ్గ‌ట్టుగా మీడియా యాజ‌మాన్యాలు స్పందించేRead More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *