Main Menu

పవన్ కల్యాణ్ కి ఏబీఎన్ ఆర్కే ఘాటు లేఖ

Spread the love

ఏబీఎన్ ఆంధ్రజ్యోతికి అదో సంక్లిష్ట స్థితి. ఓ వైపు పవన్ కల్యాణ్ ని తూలనాడలేదు. అదే సమయంలో ఆయన తీరును పూర్తిగా సమర్థించనూ లేదు. చివరకు ఆ సంస్థ ఎండీ పేరు పెట్టి మరీ విమర్శలు చేసిన నేపథ్యంలో సమాధానం చెప్పక తప్పని స్థితి. అలా అని ఘాటుగా స్పందిస్తే, అసలే చిన్న చిన్న అంశాలను కూడా గుర్తు పెట్టుకునే నాయకుడిగా కనిపిస్తున్న పవన్ కల్యాణ్ ఎలా స్పందిస్తారో తెలియని పరిస్థితి. దాంతో ఆంధ్రజ్యోతి ఎండీ రాధాక్రుష్ణ కొత్త పలుకు కొంత భిన్నంగా ఉంది. ఆయన సహజశైలికి దగ్గరగానే ఉన్నా..పద వినియోగంలో పెద్ద వైరుధ్యం కనిపిస్తోంది.

సహజంగా రాధాక్రుష్ణ మీద ఎవరు విమర్శలు చేసినా ఆయన ఒంటికాలిపై లేస్తారు. అందులోనూ ఓ పార్టీ అదినేత సభలో బహిరంగంగా హెచ్చరిస్తే ఇక ఊరుకుంటారనుకోలేం. అయితే విమర్శలు చేసిన వ్యక్తి మిత్రపక్ష నాయకుడాయే. దాంతో రాధాక్రుష్ణ ఆచితూచి స్పందించారు. ఓవైపు పవన్ ని పొగుడుతూనే మరోవైపు సూచాయగా తన వైఖరిని స్పష్టం చేశారు. తెలుగుదేశం పత్రిక అని వేలెత్తినా దాని జోలికి పోకుండా కులం ఆపాదించడం తమ ఉద్దేశం కాదంటూ పవన్ కి వివరణ ఇచ్చుకున్నారు. అదే సమయంలో తమను హెచ్చరించాలని చూస్తే నీ కన్నా పెద్ద వాళ్లే ఏం చేయలేకపోయారని చెబుతూ, పవన్ ప్రయత్నం వ్రుధా అవుతోందని సుతిమెత్తగా వార్నింగులిచ్చారు. తమ కార్యాలయంలో ఉద్యోగాల కులాల లెక్కలు తీస్తానంటే గుమ్మం వద్దకు వచ్చి స్వాగతం పలుకుతా రమ్మంటా వ్యంగ్యంగా ఆహ్వానం పలికారు.

తమకు పవన్ కల్యాణ్ కులాన్ని ఎత్తిచూపాల్సిన అవసరం లేదని చెబుతున్న రాధాక్రుష్ణ అదే సమయంలో పవన్ రాజకీయ సందిగ్ధంలో ఉన్నారంటూ వ్యాఖ్యానించారు. ముఖ్యంగా తెలుగుదేశం ఎంపీ గల్లా జయదేవ్ వ్యాఖ్యలు కోట్ చేస్తూ పవన్ రాజకీయాల పట్ల సందేహం వ్యక్తం చేశారు. పైగా అనుభవం అనే అంశాన్ని ముందుకు తెచ్చి తనకు తానే ముందరికాళ్ల బంధంగా మారుతున్న పవన్ తీరును వేలెత్తి చూపించారు. మొత్తంగా పవన్ కల్యాణ్ సూటిగా రాధాక్రుష్ణకి వార్నింగ్ ఇస్తే, అదే రీతిలో కాకపోయినా ఏబీఎన్ ఎండీ కూడా దాదాపుగా అదే పని చేశారు. దాంతో వీరిద్దరి వ్యవహారం హాట్ టాపిక్ అవుతోంది అదే సమయంలో పవన్ కల్యాణ్ తీరు గురించి తెలిసిన వారెవరూ ఈ విషయంలో పవన్ స్పందిస్తారని భావిచడం లేదు. మళ్లీ ప్రస్తావిస్తే మాత్రం చివరకు వారి వైరం రాజకీయంగానూ ప్రభావితం చేస్తుందనడంలో సందేహం కనిపించడం లేదు.


Related News

మీటూ ఎఫెక్ట్: ఇద్ద‌రు ఎడిట‌ర్ల‌పై వేటు

Spread the loveమాజీ పత్రికా సంపాదకులు ఎంజె అక్బర్‌, తరుణ్‌ తేజ్‌పాల్‌ను బుధవారం ఎడిటర్స్‌ గిల్డ్‌ ఆఫ్‌ ఇండియా (ఇజిఐ)Read More

చ‌ర్చ‌నీయాంశంగా మారిన టీవీ9 స‌ర్వే

Spread the loveప్ర‌స్తుతం ఎన్నిక‌ల పోరులో ప్ర‌తీ అవ‌కాశం కూడా వినియోగించుకునేందుకు పార్టీలు తీవ్రంగా ప్ర‌య‌త్నిస్తున్నాయి. మీడియా అందుకు తందానRead More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *