వైసీపీ కేసులో ఆంధ్ర‌జ్యోతి ఎండీకి ఊర‌ట‌

Vemuri-RadhakrishnaABN RK
Spread the love

వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామ‌కృష్ణారెడ్డికి చుక్కెదుర‌య్యింది. ఆంధ్ర‌జ్యోతి మీద వేసిన ప‌రువు న‌ష్టం కేసులో సుప్రీం కోర్ట్ పిటీష‌న్ ను తిర‌స్క‌రించింది. విచార‌ణ‌కు అనుమ‌తి నిరాక‌రించింది. దాంతో ఆళ్ల ఆశ‌ల‌పై ఉన్న‌త న్యాయ‌స్థానం నీళ్లు జ‌ల్లిన‌ట్ట‌య్యింది. గ‌తంలో ఈ కేసులో హైకోర్ట్ లోక‌ల్ స్టాండీ అనే పేరుతో పిటీష‌న్ కొట్టేసింది. దాంతో త‌న పార్టీకి న‌ష్టం క‌లిగించేలా క‌థ‌నాలు రాశారంటూ సుప్రీంని ఆశ్ర‌యించారు. దాంతో అక్క‌డ కూడా నిరాశ ఎదుర‌వ‌డంతో న్యాయ‌పోరాటంలో ఆంధ్ర‌జ్యోతిదే పై చేయి అయ్యింది.

అదే స‌మ‌యంలో విచార‌ణ సంద‌ర్భంగా ఇలాంటి క‌థ‌నాలు సాధ‌ర‌ణ‌మేనంటూ సుప్రీం కోర్ట్ న్యాయ‌మూర్తి వ్యాఖ్యానించ‌డంతో వైసీపీ ఆశ‌లు నీరుగారిపోయాయి. ఈ కేసులో జ‌యంత్ భూష‌ణ్ పిటీష‌న‌ర్ త‌రుపున వాదించారు.

గ‌త ఏడాది మే నెల‌లో జ‌గ‌న్ ఢిల్లీ వెళ్లి ప్ర‌ధానిని క‌లిసిన సంద‌ర్భంగా ఆంధ్ర‌జ్యోతి నిరాధారంగా వార్త‌లు రాసి, ప‌రువు న‌ష్టం క‌లిగించింద‌న్న‌ది ఆళ్ల వాద‌న‌. ఏపీ ప్ర‌యోజ‌నాల కోసం తాము పీఎంని క‌లిస్తే దానికి భిన్నంగా వార్త‌లు రాసి నింద‌లు వేశారంటూ ఆరోపించారు. కానీ హైకోర్ట్, సుప్రీంకోర్ట్ లో కూడా ఈ కేసు నిల‌వ‌క‌పోవ‌డంతో ఆంధ్ర‌జ్యోతి ఎండీకి ఇది ఊర‌ట‌నిచ్చే అంశంగా చెప్ప‌వ‌చ్చు. గ‌తంలో ఈ కేసు విచార‌ణ సంద‌ర్భంగా ఏబీఎన్ రాధాకృష్ణ‌ను కోర్ట్ కి హాజ‌రుకావాల్సిందేనంటూ ప‌లుమార్లు న్యాయ‌స్థానం ఆదేశాలివ్వ‌డంతో ఆర్కే స‌త‌మ‌త‌మ‌య్యారు. చివ‌ర‌కు సానుకూల తీర్పు రావ‌డంతో ఊపిరిపీల్చుకునే అవ‌కాశం ద‌క్కింది.


Related News

Eenadu_Office,Vizag

త‌ప్పులో కాలేసిన ఈనాడు

Spread the love6Sharesజర్న‌లిజంలోనే కాదు..ఎక్క‌డ‌యినా అల‌వాటులో పొర‌పాట్లు కొన్ని స‌హ‌జం. అత్యంత జాగ్ర‌త్త‌గా వ్య‌వ‌హ‌రించే చోట కూడా అలాంటివి చోటుకుంటాయి.Read More

NDTV

మీడియా యాజ‌మాన్యానికి జ‌రిమానా

Spread the love2Sharesదేశంలోనే ప్ర‌ఖ్యాత మీడియా సంస్థ‌కు జ‌రిమానా విధించారు. నిబంధ‌న‌ల‌కు విరుద్ధంగా వ్య‌వ‌హ‌రించ‌డ‌మే దానికి కార‌ణంగా చెబుతున్నారు. అయితేRead More

 • ప‌వ‌న్ కి షాకిచ్చిన మీడియా!
 • అయ్యో..ఆంధ్రజ్యోతి..!
 • ఆంధ్ర‌జ్యోతికి కేకు తినిపించిన జ‌గ‌న్
 • రియ‌ల్ టైమ్ గ‌వ‌ర్నెన్స్..కానీ జ‌ర్న‌లిస్టుల‌కు..!
 • అభాసుపాల‌యిన మీడియా
 • తెలుగు మీడియాలో బాబుకి అన్యాయం!
 • టీవీ9 వెన‌క్కి…ఎన్టీవీ అగ్ర‌స్థానానికి
 • వైసీపీ కేసులో ఆంధ్ర‌జ్యోతి ఎండీకి ఊర‌ట‌
 • Leave a Reply

  Your email address will not be published. Required fields are marked *