ప‌వ‌న్ పై ఏబీఎన్ ఎదురుదాడి…

Pawan---You-Can-t-Scare-Me--ABN-RK-1512890001-114
Spread the love

జ‌న‌సేన అధినేత వ్య‌వ‌హారం ఆస‌క్తిగా మారుతోంది. టీడీపీతో తెగ‌తెంపులు చేసుకున్న నెల‌రోజుల‌కే ఆయ‌న‌కు మీడియాలో వ్య‌తిరేక ప‌వ‌నాలు వీస్తున్నాయి. దాదాపుగా ప్ర‌ధాన చానెళ్ల‌న్నీ జ‌న‌సేనానికి వ్య‌తిరేకంగా క‌థ‌నాలు ప్ర‌సారం చేస్తున్నాయి. అందుకు శ్రీరెడ్డిని పావుగా వాడుకున్నార‌న్న‌ది ప‌వ‌న్ అభిప్రాయంగా క‌నిపిస్తోంది. అందుకు త‌గ్గ‌ట్టుగానే త‌న త‌ల్లిమీద చేసిన వ్యాఖ్య‌ల‌ను ప్ర‌సారం చేశారంటూ తీవ్రంగా మండిప‌డ్డారు. అభ్యంత‌ర‌క‌ర భాష‌ను వాడిన శ్రీరెడ్డికి అనుగుణంగా వ్య‌వ‌హ‌రించిన చానెళ్ల తీరును ట్విట్ట‌ర్ సాక్షిగా త‌ప్పుబ‌ట్టారు. దానికితోడు ఫిల్మ్ ఛాంబ‌ర్ ఎదుట నిర‌స‌న‌కు కూడా దిగారు. ఈ సంద‌ర్భంగా ప‌వ‌న్ అభిమానులు, ఏబీఎన్ ప్ర‌తినిధుల మ‌ధ్య జ‌రిగిన వాగ్వాదం, ఆఖ‌రికి ఏబీఎన్ వాహ‌నం మీద దాడి జ‌రిగే వ‌ర‌కూ వెళ్లింది.

ఈ నేప‌థ్యంలో ఏబీఎన్ ఎదురుదాడికి స‌న్న‌ద్ధ‌మ‌య్యింది. ప‌వ‌న్ ని క‌ట్ట‌డి చేయ‌డానికి అదొక్క‌టే అస్త్ర‌మ‌ని భావిస్తోంది. గ‌తంలో టీఆర్ఎస్ మాదిరిగ‌తా వ్య‌వ‌హ‌రించాల‌ని, ఇప్పుడు టీడీపీ తీరున అయితే చిక్కుకుంటామ‌ని అంచ‌నా వేసిన ఏబీఎన్ రాధాకృష్ణ ఘాటుగా స్పందించారు. ప‌వ‌న్ క‌ళ్యాణ్ మీద ప‌రువున‌ష్టం దావా వేస్తున్న‌ట్టు ప్ర‌క‌టించారు. 10కోట్ల రూపాయ‌ల‌కు ప‌రువు న‌ష్టం దావా వేస్తున్న‌ట్టు తెలిపారు. త‌ద్వారా మ‌రోసారి త‌మ మీద ప‌వ‌న్ దాడి చేయ‌కుండా అడ్డుక‌ట్ట వేయాల‌నే ఆలోచ‌న చేస్తున్న‌ట్టు క‌నిపిస్తోంది. ప‌వ‌న్ త‌ల్లి మీద శ్రీరెడ్డి కామెంట్స్ ని తాము ప్ర‌చారం చేసిన స‌మ‌యంలో మ్యూట్ చేశామ‌ని, బ్ల‌ర్ చేసిన విజువ‌ల్స్ వాడామంటూ స‌మ‌ర్థించుకున్నారు. అయినా ప‌వ‌న్ ట్వీట్ మూలంగా ప‌రిణామాలు తీవ్రంగా మారాయ‌ని ఆరోపించారు. అందుకు బాధ్య‌త‌గా ప‌వ‌న్ మీద క్రిమిన‌ల్, సివిల్ కేసులు వేస్తున్న‌ట్టు తెలిపారు.

దాంతో ఇప్పుడు ప‌వ‌న్ ఓవైపు టీడీపీతోనే కాకుండా, ఆయ‌న భావిస్తున్న టీడీపీ అనుకూల మీడియాతో కూడా ఏక‌కాలంలో పోరాడాల్సిన ప‌రిస్థితి వ‌చ్చింది. దాంతో ఇదో రాజ‌కీయ మీడియా ర‌ణరంగంగా మార‌బోతోంద‌ని చెప్ప‌వ‌చ్చు.


Related News

media

తెలుగు మీడియా కళ్లు తెరవదా?

Spread the loveఏపీ రాజకీయ వ్యవహారాల్లో మాత్రం తెలుగు మీడియా తీరు భిన్నంగా ఉంటుంది. చంద్రబాబు అధికారంలో ఉన్న సమయంలోRead More

whatsapp fb

ఎఫ్ బీ, గూగుల్ కి నోటీసులు

Spread the loveప్రింట్ , ఎలక్ట్రానిక్ మీడియాలే కాదు డిజిటల్ మీడియాలో కూడా నిబంధనలు పాటించాల్సిందే. దానికి భిన్నంగా సాగితేRead More

 • మీడియా విషయంలో మనసు మార్చుకున్న జనసేన
 • చంద్రబాబు దొరికిపోయారు..
 • మహిళా జర్నలిస్టుపై వేధింపులు
 • ఆ చానెల్ ని జనసేన టేకోవర్ చేస్తుందా?
 • అయ్యో..ఆంధ్ర‌జ్యోతికి న‌కిలీల బెడ‌ద‌
 • మీడియా వాళ్లంతా నంగ‌నాచులా..?
 • ప‌వ‌న్ పై ఏబీఎన్ ఎదురుదాడి…
 • ఆ చానెల్ ని కూడా వ‌దిలిపెట్ట‌ని ప‌వ‌న్ క‌ళ్యాణ్
 • Leave a Reply

  Your email address will not be published. Required fields are marked *