Main Menu

మీడియాలో మైన‌స్ అవుతున్న జ‌న‌సేన‌!

Spread the love

రాజ‌కీయాలు, మీడియా మిళితం అయిపోయాయి. మీడియా అండ ఉంటేనే రాజ‌కీయంగా రాణించ‌గ‌ల‌మ‌న్న విష‌యం అంద‌రికీ అర్థ‌మ‌యిపోయింది. సోష‌ల్ మీడియాలో ఎంత‌గా ప్ర‌చారం చేసినా రెగ్యుల‌ర్ మీడియాలో ప్ర‌భావం చూప‌కుండా సామాన్యుల‌ను ఆక‌ట్టుకోవ‌డం క‌ష్ట‌మేన‌న్న‌ది అంద‌రికీ అర్థ‌మ‌వుతోంది. ఆఖ‌రికి త‌మ‌కు సోష‌ల్ మీడియా ఉంద‌ని, మీ మీడియా సంస్థ‌ల‌తో మాకు ప‌నిలేద‌ని చెప్పుకున్న జ‌న‌సేన కూడా సొంతంగా చానెల్ పెట్టుకోవాల్సి వ‌చ్చింది. మ‌రో నాయ‌కుడికి సంబంధించిన ప‌త్రిక‌ను అధికార ప‌త్రిక‌గా మ‌ల‌చుకోవాల్సి వ‌చ్చింది.

అయితే 99 న్యూస్ చానెల్ ని తోట చంద్ర‌శేఖ‌ర్ టేకోవ‌ర్ చేసిన త‌ర్వాత జ‌న‌సేన కార్య‌క్ర‌మాల‌ను ఆ చానెల్ ప్ర‌సారాలు చేస్తోంది. మిగిలిన మీడియా సంస్థ‌ల‌కు అవుట్ పుట్ ఇస్తోంది. అయితే క్వాలిటీ విష‌యంలో త‌గిన జాగ్ర‌త్త‌లు లేక‌పోవ‌డంతో ప్ర‌య‌త్నాలు ఫ‌లిస్తున్న దాఖ‌లాలు లేవు. ప్రేక్ష‌కుల‌ను తీవ్రంగా నిరాశ‌ప‌రుస్తున్న‌ట్టు క‌నిపిస్తోంది. త‌గిన సాంకేతిక బృందం లేక‌పోవ‌డం, కెమెరా మేన్ల విష‌యంలో కూడా అనుభ‌వం లేని వారితో న‌డిపిస్తుండ‌డం చివ‌ర‌కు 99 న్యూస్ చానెల్ లో ప‌వ‌న్ లైవ్ చూడాల‌నుకున్న వాళ్ల‌కు చికాకు క‌లిగిస్తోంద‌నే అభిప్రాయం వ్య‌క్తం అవుతోంది. పీసీఆర్ లో మిక్స‌ర్ విష‌యంలోనూ, అవుట్ ఫుట్ టీమ్ లోనూ జాగ్ర‌త్త‌లు పాటిస్తున్న దాఖ‌లాలు లేవు. చివ‌ర‌కు ఇన్ ఫుట్ కెమెరాల నిర్వ‌హ‌ణ కూడా నాసిర‌కంగా మారింది. ఆడియో నేరుగా ఉప‌న్యాస‌కుడి వ‌ద్ద తీసుకోవాల్సి ఉన్న‌ప్ప‌టికీ బాక్సుల వ‌ద్ద మైకులు పెట్టి తీసుకుంటున్న తీరు విస్మ‌య‌క‌రంగా ఉంది. దాంతో చివ‌ర‌కు ఈ చానెల్ అవుట్ ఫుట్ తో ఇత‌ర చానెళ్లు ప్ర‌సారం చేయాల్సి ఉన్న‌ప్ప‌టికీ నాసిర‌కంగా ఉండ‌డంతో కొంద‌రు సొంతంగా ఏర్పాట్లు చేసుకుంటుంగా, మ‌రికొంద‌రు జ‌న‌సేన స‌భ‌ల క‌వ‌రేజ్ ఇవ్వ‌లేని ప‌రిస్థితి ఏర్ప‌డుతోంది. దాంతో అది ప‌వ‌న్ పార్టీకి మీడియాలో మైన‌స్ గా మారుతోంది. చివ‌ర‌కు ఓబీ వ్యాన్ కూడా మ‌హాటీవీ నుంచి తీసుకుని వాడుతున్న‌ట్టు సాగుతున్న ప్ర‌చారం వాస్త‌వ‌మ‌యితే దాని నాణ్య‌త కూడా ప‌రిశీలించాల్సి ఉంటుంద‌నే అభిప్రాయం ఉంది.

గ‌తంలో ప‌దేళ్ల క్రితం ప్ర‌జారాజ్యం త‌రుపున అప్ప‌ట్లో మా టీవీ బృందం అద్భుతంగా అవుట్ ఫుట్ ఇచ్చేది. ద‌శాబ్ధం క్రిత‌మే అంత నాణ్య‌త‌తో ప్ర‌సారాలు ఉంటే ఇప్పుడెందుకు ఇలాంటి నాసిర‌కంగా ఉంటున్నాయ‌న్న‌ది జ‌న‌సైనికుల‌కు అంతుబ‌ట్ట‌డం లేదు. ఆడియో, వీడియో కూడా క్వాలిటీ ఉండ‌క‌పోవ‌డంతో 99 చానెల్ తో పాటు యూట్యూబ్ వీక్ష‌కులు కూడా విసుగు చెందుతున్న‌ట్టుగా చెబుతున్నారు. ఓవైపు చంద్ర‌బాబు ప‌ర్య‌ట‌న‌ల‌ను ఏబీఎన్, జ‌గ‌న్ యాత్ర‌ను సాక్షి టీవీ అద్భుతంగా ప్ర‌సారాలు చేస్తుండ‌గా ప‌వ‌న్ విష‌యంలో ఈ చానెల్ ఎందుకు విఫ‌ల‌మ‌వుతుంద‌న్న‌ది ఆలోచించుకోవాల‌ని కొంద‌రు సూచిస్తున్నారు. ఇలాంటి ప్రసారాల‌తో ఎక్కువ మంది ప్ర‌జ‌ల‌కు చేరాల‌నే ల‌క్ష్యం దెబ్బ‌తింటోంద‌ని కూడా వాపోతున్నారు. 99 న్యూస్ ఎక్విప్ మెంట్, సిబ్బంది, విష‌యంలో జాగ్ర‌త్త‌లు పాటిస్తేనే ప‌వ‌న్ ల‌క్ష్యం నెర‌వేరుతుంద‌న్న‌ది ప‌లువురి సూచ‌న‌.


Related News

మీడియాకు జ‌న‌సేన ఝ‌ల‌క్

Spread the loveవైసీపీ అధికారిక ప‌త్రిక ముసుగులో స‌ర్థుబాట్లు పేరుతో రాసిన క‌థ‌నం క‌ల‌క‌లం రేపింది. జ‌న‌సేన‌, టీడీపీ మ‌ధ్యRead More

బాబు ప‌రువు తీసిన మీడియా

Spread the loveఏపీ సీఎం చంద్ర‌బాబు కి అనుకున్న‌దొక‌టి..అయ్యిందొక‌టి అన్న‌ట్టుగా మారింది. ఎంతో వ్య‌య‌ప్ర‌యాస‌ల‌తో నిర్వ‌హించిన ఢిల్లీ దీక్ష చివ‌ర‌కుRead More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *