అయ్యో..ఆంధ్రజ్యోతి..!

29133490_964365123736737_6682061375532957696_n
Spread the love

తెలంగాణా అసెంబ్లీలో జరిగిన పరిణామాలు అందరినీ ఆందోళనకు గురిచేశాయి. ముఖ్యంగా కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకటరెడ్డి హెడ్ సెట్స్ విసరడం, మండలి చైర్మన్ స్వామిగౌడ్ గాయాలు పాలయినట్టు ప్రచారం సాగడం విశేషంగా మారింది. గవర్నర్ ప్రసంగం ముగించే దశలో జరిగిన ఈ పరిణామం సంచలనంగా మారింది.

అయితే దానికి సంబంధించిన వార్త ప్రసారంలో ఆంధ్రజ్యోతి వ్యవహారం సంచలనంగా మారింది. పెద్ద వివాదానికి దారితీసింది. చివరకు తప్పు జరిగిందని ఆంధ్రజ్యోతి యాజమాన్యం అంగీకరించే వరకూ వెళ్లింది. దానికి కారణంగా ఉన్న స్వామిగౌడ్ కన్ను విషయం చర్చనీయాంశం అయ్యింది. టీవీ9లో కుడికన్నుకి గాయం అయినట్టు కనిపించగా, ఆయన పడుకున్న విజువల్స్ వేశారు. అదే సమయంలో ఏబీఎన్ లో మాత్రం దానికి భిన్నంగా స్వామి గౌడ్ నడిచి వస్తుండగా ఎడమ కన్నుకి కట్టు ఉన్న ద్రుశ్యాలు కలకలం రేపాయి. ఒకచోట ఎడమ కన్ను, మరో చోట కుడికన్నుగా ఎలా మారిందనే ప్రశ్నలు ఉదయించాయి. సోషల్ మీడియాలో ఈ వ్యవహారం హాట్ టాపిక్ అయ్యింది. సదరు పిక్ వైరల్ అయ్యింది.

దాంతో ఆంధ్రజ్యోతి అనూహ్యంగా వివరణ ఇచ్చింది. చిత్రీకరణలో లోపాల వల్ల అలా జరిగిందని చెప్పుకొచ్చింది. కానీ విశ్వసించే పరిస్థితి ఎంతవరకూ అన్నదే ప్రశ్నార్థకం.


Related News

Eenadu_Office,Vizag

త‌ప్పులో కాలేసిన ఈనాడు

Spread the love6Sharesజర్న‌లిజంలోనే కాదు..ఎక్క‌డ‌యినా అల‌వాటులో పొర‌పాట్లు కొన్ని స‌హ‌జం. అత్యంత జాగ్ర‌త్త‌గా వ్య‌వ‌హ‌రించే చోట కూడా అలాంటివి చోటుకుంటాయి.Read More

NDTV

మీడియా యాజ‌మాన్యానికి జ‌రిమానా

Spread the love2Sharesదేశంలోనే ప్ర‌ఖ్యాత మీడియా సంస్థ‌కు జ‌రిమానా విధించారు. నిబంధ‌న‌ల‌కు విరుద్ధంగా వ్య‌వ‌హ‌రించ‌డ‌మే దానికి కార‌ణంగా చెబుతున్నారు. అయితేRead More

 • ప‌వ‌న్ కి షాకిచ్చిన మీడియా!
 • అయ్యో..ఆంధ్రజ్యోతి..!
 • ఆంధ్ర‌జ్యోతికి కేకు తినిపించిన జ‌గ‌న్
 • రియ‌ల్ టైమ్ గ‌వ‌ర్నెన్స్..కానీ జ‌ర్న‌లిస్టుల‌కు..!
 • అభాసుపాల‌యిన మీడియా
 • తెలుగు మీడియాలో బాబుకి అన్యాయం!
 • టీవీ9 వెన‌క్కి…ఎన్టీవీ అగ్ర‌స్థానానికి
 • వైసీపీ కేసులో ఆంధ్ర‌జ్యోతి ఎండీకి ఊర‌ట‌
 • Leave a Reply

  Your email address will not be published. Required fields are marked *