ఎఫ్ బీ కన్నా యూట్యూబ్ మిన్న

కాలం మారుతున్న కొద్దీ యువత టేస్ట్ మారుతూ ఉంటుంది. రెండు మూడేళ్ల క్రితం వరకూ ఫేస్ బుక్ అంటే యూత్ పడిచచ్చిపోయేది. ఫేస్బుక్లో చాటింగ్ చేయడం కోసం ఎంతో సమయం వెచ్చించేది. కానీ ఇప్పుడు ఎఫ్ బీ కన్నా యూట్యూబ్లో వీడియోలు చూడటానికి యువత ఆసక్తి చూపిస్తోందని తాజా సర్వే సారాంశం. అమెరికాకు చెందిన ఫ్యూ పరిశోదన చేసిన సర్వేలో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. 13-17 సంవత్సరాల యువతీ యువకుల్లో దాదాపుగా 85% మంది యూట్యూబ్లో వీడియోలను చూడటంలోనే ఎక్కువ సమయం గడుపుతున్నారంట. ఈ విషయాలను మొత్తం 743 మంది యువతను ప్రశ్నించి వివరాలను ఫ్యూ సంస్థ సేకరించింది.
యూట్యూబ్ తర్వాత ఎక్కువ మంది ఇన్స్టాగ్రాంలో గడిపేస్తున్నారని తెలిసింది. ఇన్స్టాగ్రాంలో 72% మంది, చాటింగ్లో 69% మంది, ఫేస్ బుక్లో 57% మంది తమ విలువైన సమయాన్ని కేటాయిస్తున్నట్లు తెలింది. అమెరకన్లో 95% మందికి స్మార్ట్ఫోన్ వాడే విధానం తెలుసు. అంతేకాక నిత్యం 43% మంది ఇంటర్నెట్ వాడుతున్నారని వెల్లడైంది. సోషల్ మీడియాల వల్ల మంచి జరుగుతుందని 31% మంది అంటున్నారు. కాదు చేటు అని 24% మంది నమ్ముతున్నట్లు ఫ్యూ సంస్థ సర్వేలో పేర్కొంది.
ఈ సంస్థ 2014-15లో కూడా సర్వే చేపట్టింది. అప్పటి సర్వేలో కేవలం 24% మంది యువత నిరంతరం ఆన్లైన్లో ఉండేవారని తెలిసింది. టెక్నాలజీ పెరుగుతున్న కొద్దీ స్మార్ట్ పోన్ వాడకం పెరిగిపోయింది.
Related News

నేనూ టెస్ట్ ట్యూబ్ బేబీనే..!
Spread the loveదేశంలోనే అపర కుబేరుడైన రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ గారాలపట్టి ఇషా అంబానీ మరోమారు వార్తల్లోకి ఎక్కారు.Read More

డేటింగ్ చేస్తారా..అయితే ఇది చదవండి..!!
Spread the love‘డేటింగ్’ అనే పదం పలకడమే నేరంగా భావించే రోజులు మనదేశంలో సైతం పోయాయి. వాట్సాప్ స్నేహాలు… ఫేస్బుక్Read More