Main Menu

స్వయంతృప్తి మహిళలకు చేటు చేస్తుందా?

Spread the love

సెక్స్ జీవితంలో భారతీయ మహిళలకు అనేక ఆటంకాలుంటాయి. స్వేచ్ఛగా అనుభవించే అవకాశాలు తక్కువే. సంప్రదయాల పేరుతో కట్టుబాట్లు చాలా ఉంటాయి. అయినప్పటికీ స్వయంతృప్తి చేటు చేస్తుందనే దుష్ప్రచారంలో వాస్తవం లేదంటున్నారు నిపుణులు. పైగా అది ప్రయోజనకరంగా చెబుతున్నారు.

ప్రపంచవ్యాప్తంగా 62% మంది మహిళలు స్వయంతృప్తిని అనుసరిస్తున్నారని ఓ అంచనా. స్వయంతృప్తి వల్ల ఎటువంటి దుష్ప్రభావాలూ లేకపోగా, ఎలాంటి సుఖవ్యాధులూ దరి చేరకుండా ఉంటాయన్నది వైద్యుల అభిప్రాయం. పైగా స్వయంతృప్తి వల్ల గర్భం దాల్చే వీలూ ఉండదు కాబట్టి స్వయంతృప్తి వల్ల శరీరంలో ఫీల్‌గుడ్‌ ఎండార్ఫిన్లు విడుదలై ఒత్తిడి తొలగి, కండరాలు సాంత్వన పొందుతాయని చెబుతున్నారు. నెలసరి నొప్పులు కూడా తగ్గుముఖం పడతాయని కూడా శాస్త్రీయంగా చెబుతున్నారు. ఇటీవలే జరిపిన ఒక అధ్యయనంలో స్వయంతృప్తి వల్ల ‘రెస్ట్‌లెస్‌ లెగ్‌ సిండ్రోమ్‌’ తగ్గుతుందనీ, గుండెకు తగిన వ్యాయామం కూడా అందుతుందనీ వెల్లడైంది.

మహిళలు తమ శరీరాల్ని స్వయంగా శోధించుకుని, తమకు అనుకూలమైన పద్ధతిలో స్వయంతృప్తి పొందడం హర్షణీయమే! భాగస్వామి లేనివాళ్లతోపాటు, పెళ్లైన మహిళలూ స్వయంతృప్తి పద్ధతులను అనుసరిస్తూ ఉంటారు. ఇందుకు కారణం, ఆ చర్య కొన్ని సందర్భాల్లో లైంగిక క్రీడకు మించిన ఆనందాన్ని అందించడమే! స్వయంతృప్తి అనుసరించడం ద్వారా, క్లైమాక్స్‌ చేరుకోవడం కోసం విభిన్నమైన స్పర్శలు, ఒత్తిడులను తమకు తాముగా మహిళలు తెలుసుకోగలుగుతారు.

ఇలా తెలుసుకోవడం మహిళలతోపాటు, పురుషులకూ అవసరమే! దంపతులు లైంగిక జీవితాన్ని సంపూర్ణంగా ఆస్వాదించాలనుకుంటే, స్వయంతృప్తిలో మహిళలు పొందే అలౌకిక ఆనందానికి కారణాల్ని పురుషులు గ్రహించి, అనుసరించాలి. అయితే సమాజంలో మహిళల స్వయంతృప్తి గురించి ఎన్నో అభ్యంతరాలు, అపోహలు ఉన్నాయి. వీటిని పారదోలి, మహిళలు నిర్భయంగా స్వయంతృప్తిని అనుసరించవచ్చు.






Leave a Reply

Your email address will not be published. Required fields are marked *