Main Menu

స్నానం చేస్తుండ‌గా చిత్రీక‌రించి..!!

Spread the love

ప్రపంచ ప్రఖ్యాత హిల్టన్‌ హోటల్స్‌ అండ్‌ రిసార్ట్స్‌పై ఓ మహిళ దావా వేసింది. హోటల్‌ గదిలో తాను స్నానం చేస్తుండగా రహస్య కెమెరాతో చిత్రీకరించారని, అనంతరం ఆ వీడియోను పోర్న్‌ వెబ్‌సైట్లలో పోస్టు చేశారని బాధిత మహిళ ఆరోపించారు. మూడేండ్ల కింద జరిగిన ఈ ఘటన గురించి ఇటీవలే తెలుసుకున్న మహిళ వెంటనే న్యాయస్థానాన్ని ఆశ్రయించి పరువు నష్టం దావా దాఖలు చేశారు. వివరాల్లోకి వెళ్లితే…షికాగోకు చెందిన ఓ మహిళ న్యాయశాస్త్రంలో ఉత్తీర్ణురాలైన తర్వాత బార్‌ పరీక్షల నిమిత్తం 2015 జులైలో న్యూయార్క్‌ వెళ్లారు. అక్కడ అల్బనీలోని హాంప్టన్‌ ఇన్‌ అండ్‌ సూట్స్‌ హోటల్‌లో గది అద్దెకు తీసుకున్నారు. ఆ సమయంలో సదరు మహిళ గదిలో స్నానం చేస్తుండగా అక్కడే ఉన్న రహస్య కెమెరాలో రికార్డయ్యింది.

ఈ విషయం తెలియని మహిళ తిరిగి షికాగో వెళ్లిపోయారు. అయితే మూడేండ్ల తర్వాత ఈ ఏడాది సెప్టెంబరులో ఆ మహిళకు ఓ అజ్ఞాత వ్యక్తి నుంచి ఈ-మెయిల్‌ వచ్చింది. ‘ఈ వీడియోలో ఉన్నది మీరే కదా’ అంటూ అశ్లీల వెబ్‌సైట్‌ లింక్‌ను ఆ వ్యక్తి ఈ-మెయిల్‌లో పంపారు. తద్వారా ఆ వ్యక్తి బెదిరింపులకు పాల్పడ్డాడు. తనకు పెద్ద మొత్తంలో డబ్బు ఇవ్వాలని లేదంటే ఆ వీడియోను ఇతర సైట్లలో కూడా పోస్టు చేస్తానని బెదిరించాడు. ప్రతీనెల 1000 డాలర్ల ( రూ.70,795) చొప్పున అందజేయాలంటూ ఆ మహిళకు తరుచూ ఈ మెయిల్స్‌ పంపాడు. దీంతో, తీవ్ర దిగ్భ్రాంతికి గురైన బాధిత మహిళ న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న అన్ని హిల్టన్‌ హోటళ్లపై 100 మిలియన్‌ డాలర్లకు దావా వేశారు.

ఈ ఘటనపై హిల్టన్‌ గ్రూప్‌ స్పందించింది. హోటల్‌లో బస చేస్తున్న అతిథుల భద్రత, ప్రైవసీపై తాము సీరియస్‌గా ఉంటామని తెలిపింది. ఈ ఘటనకు పాల్పడిన వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకునేందుకు పోలీసులకు మేం అన్ని విధాల సహకరిస్తామని హామీ ఇచ్చింది. ఇటీవల హోటల్‌లో పలు మరమ్మతు పనులు చేపట్టామని, ఎలాంటి రికార్డింగ్‌ పరికరలు లభ్యంకాలేదని హిల్టన్‌ గ్రూప్‌ వెల్లడించింది






Related News

నేనూ టెస్ట్ ట్యూబ్ బేబీనే..!

Spread the loveదేశంలోనే అపర కుబేరుడైన రిలయన్స్‌ అధినేత ముఖేష్‌ అంబానీ గారాలపట్టి ఇషా అంబానీ మరోమారు వార్తల్లోకి ఎక్కారు.Read More

డేటింగ్ చేస్తారా..అయితే ఇది చ‌ద‌వండి..!!

Spread the love‘డేటింగ్‌’ అనే పదం పలకడమే నేరంగా భావించే రోజులు మనదేశంలో సైతం పోయాయి. వాట్సాప్‌ స్నేహాలు… ఫేస్‌బుక్‌Read More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *