Main Menu

డేటింగ్ చేస్తారా..అయితే ఇది చ‌ద‌వండి..!!

Spread the love

‘డేటింగ్‌’ అనే పదం పలకడమే నేరంగా భావించే రోజులు మనదేశంలో సైతం పోయాయి. వాట్సాప్‌ స్నేహాలు… ఫేస్‌బుక్‌ ప్రేమలు… టిండర్‌ డేటింగ్‌లు ఇప్పుడు ఇక్కడ కూడా సర్వసాధారణం అయ్యాయి. ఆధునిక పోకడలను అవపోసన పడుతున్న నవతరం తమ సోల్‌మేట్‌ కోసం డేటింగ్‌ను నమ్ముకుంటోంది. ఐతే, పక్కదారి పడుతు న్న డేటింగ్‌ యాప్స్‌ పట్ల జాగ్రత్త అవసరమంటున్నారు నిపుణులు.

యుక్తవయసు వచ్చిన అబ్బాయిలు, అమ్మాయిలు ఒకరినొకరు అర్థం చేసుకునేందుకు, బంధం ఏర్పరచు కునేందుకు.. ఒకటి కంటే ఎక్కువసార్లు వ్యక్తిగతంగా కలుసుకోవడాన్ని డేటింగ్‌ అంటారన్న సంగతి విదితమే! అయితే, డేటింగ్‌ యాప్స్‌ను పాశ్చాత్య దేశాల్లో ఎక్కువగా కబుర్ల కోసం ఉపయోగిస్తుండగా.. భారతదేశంలో ఎక్కువ గా సరైన లక్ష్యం కోసమే యువత డేటింగ్‌ యాప్స్‌ ను ఉప యోగిస్తున్నట్టు తెలుస్తోంది. అయితే, అర్థవంతమైన అనుబంధాన్ని కోరుకునే వాళ్ళు మనదగ్గర కూడా తక్కువ గానే ఉండటం ఆలోచించాల్సిన అంశం. ‘వూస్‌’ అనే దేశీయ డేటింగ్‌ యాప్‌ సంస్థ ఇదే విషయంపై భారతీయులను ఇంటర్వ్యూ చేయగా.. కేవలం 32 శాతం మంది మాత్రమే తాము అర్థవంతమైన సంబంధం కోసం డేటింగ్‌ యాప్స్‌ ను వాడుతున్నట్టు సమాధానం ఇవ్వడం గమనార్హం. ఇక, కొత్త ప్రదేశాల్లో నూతన పరిచయాల కోసం 28 శాతం మంది, సామాజిక సర్కిల్‌ను పెంచుకోవడం కోసం 17 శాతం మంది వీటిని వాడుతున్నట్టు పేర్కొన్నారు. కాగా, మన దేశంలో డేటింగ్‌ యాప్స్‌ను ఉపయోగిస్తున్న వారిలో 26 శాతం మంది మహిళలు ఉన్నట్టు.. ఈ సంఖ్య అమెరికాలో నలభై శాతం కంటే ఎక్కువగా ఉన్నట్టు అంచనా.

నివేదికల ప్రకారం.. వ్యక్తిగత సమాచారాన్ని డేటింగ్‌ యాప్స్‌లో వెల్లడించేందుకు ఏకంగా 70 శాతం మంది మహిళలు భయపడుతున్నారు. అబ్బాయిల అశ్లీల మాటలు, ఆంతర్యం, ఒత్తిడిని తట్టుకోలేకపోవడమే దీనికి కారణంగా వాళ్ళు చెబుతున్నారు. స్వల్పకాలిక అనుబంధాల కోసం, శారీరక అవసరాల కోసం మాత్రమే ఇలాంటి యాప్‌లను ఎక్కువ మంది అబ్బాయిలు వాడుతున్నట్టు ఇప్పటికే పలు సర్వేలు సైతం తేల్చాయి. ఒకరు నచ్చకపోతే మరొకరు.. తమ ఇష్టాలను ఈజీగా మార్చుకుంటూ.. ప్లేబోర్సు లా మారిపోయే అబ్బాయిల సంఖ్య రోజురోజుకూ ఎక్కువవుతోంది. ఇందుకు ఇండియా మినహాయింపు కాదు. ‘ఇష్టపడే లేదా నచ్చే మహిళా ప్రొఫైళ్లు ఎక్కువ కనిపించడం లేద’ని అబ్బాయిలు చెబుతుండగా.. అబ్బాయిల అబద్ధపు మాటలకు భయపడే.. నిజమైన ప్రొఫైళ్లు పెట్టడం లేదని అమ్మాయిలు చెబుతున్నారు. అయితే, అమ్మాయిలా ఫేక్‌ ప్రొఫైల్‌ క్రియేట్‌ చేస్తూ అబ్బాయిలతో… అబ్బాయిల్లా అమ్మాయిలతో మాట్లాడి.. ఆర్ధికంగా, మానసికంగా హింసిం చడం, వివాహితులు కూడా పెళ్లి కాలేదని చెప్పి ఎదుటి వారి ని లోబర్చుకోవడం వంటివి డేటింగ్‌ యాప్స్‌లో నిత్యకృత్య మైన తరుణంలో వాటి వాడకాన్ని నేటి యువత తగ్గిస్తే మంచిదని, ఇండియాపై ప్రత్యేక శ్రద్ధ పెట్టిన టిండర్‌, బంబుల్‌ డేటింగ్‌ యాప్స్‌ వాడకంలో పరిమితులు పెట్టుకోవాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

అమెరికాలో పేరుగాంచిన డేటింగ్‌ సంస్థ టిండర్‌ గత సెప్టెంబర్‌లో ‘మై లవ్‌’ అనే డేటింగ్‌ యాప్‌ను వినియోగం లోకి తీసుకురాగా.. టిండర్‌ పోటీ సంస్థ ‘బంబుల్‌’ మన దే శంపై ప్రత్యేక శ్రద్ధ కనబరిచింది. అందులో భాగంగానే ఈ నెలలో బాలీవుడ్‌ సినీ నటి ప్రియాంక చోప్రాతో కలిసి ఓ భారతీయ డేటింగ్‌ యాప్‌ను ప్రారంభించబోతున్నట్టు సమా చారం. అయితే, నార్వేజియన్‌ యూనివర్సిటీ ఆఫ్‌ సైన్స్‌ అం డ్‌ టెక్నాలజీకి చెందిన కొంత మంది ప్రొఫెసర్లు ఈ డేటింగ్‌ ట్రెండ్‌ యాప్స్‌ ఎలా ఉన్నాయోనని 19-29 ఏండ్ల వయ సున్న కొంతమంది అబ్బాయిలు, అమ్మాయిలనూ ఆరాతీ యగా.. వీటి వల్ల లాభం కంటే, శారీరకంగా, మానసి కం గా, ఆర్దికంగా నష్టమే ఎక్కువగా ఉన్నట్టు తేలడం గమనార్హం.

సోషల్‌ మీడియా దిగ్గజం ఫేస్‌బుక్‌ డేటింగ్‌ ఆప్షన్‌ను ప్రయోగాత్మకంగా కొలంబియాలో ఇది వరకే అమలు చేసిం ది. ”తాత్కాలిక అనుబంధాల కోసం ఆరాటపడేవారికి కాదు. నిజమైన ప్రేమను కోరుకునే వారికే ఈ డేటింగ్‌ యాప్‌” అని ఫేస్‌బుక్‌ వ్యవస్థాపకుడు జుకర్‌బెర్గ్‌ పేర్కొన్నప్పటికీ.. ఫేస్‌బుక్‌ డేటింగ్‌ యాప్‌ పై నిపుణులు పలు సందేహాలను వ్యక్తం చేస్తున్నారు. దీనికి కారణం యూజర్ల వ్యక్తిగత సమాచార భద్రత, ‘కేంబ్రిడ్జ్‌ అనలిటికా’ ఉదంతం తర్వాత ఫేస్‌బుక్‌ విశ్వసనీయతపై నీలినీడలు కమ్ముకోవడమే!


Related News

నేనూ టెస్ట్ ట్యూబ్ బేబీనే..!

Spread the loveదేశంలోనే అపర కుబేరుడైన రిలయన్స్‌ అధినేత ముఖేష్‌ అంబానీ గారాలపట్టి ఇషా అంబానీ మరోమారు వార్తల్లోకి ఎక్కారు.Read More

డేటింగ్ చేస్తారా..అయితే ఇది చ‌ద‌వండి..!!

Spread the love‘డేటింగ్‌’ అనే పదం పలకడమే నేరంగా భావించే రోజులు మనదేశంలో సైతం పోయాయి. వాట్సాప్‌ స్నేహాలు… ఫేస్‌బుక్‌Read More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *