Main Menu

సెక్స్ టాయ్స్ మోజులో భారతీయులు

Spread the love

బయటికి కనిపించకపోయినా అంతర్గాతంగా శృంగారం పట్ల మనోళ్లకు ఎంత మక్కువ ఉందో తెలియజేసే ఓ సర్వే ఇప్పుడు హాట్‌ టాపిక్‌గా మారింది.

దట్స్ పర్సనల్ అనే సంస్థ తాజాగా ఓ సర్వే నిర్వహించింది. శృంగార ఉత్పత్తులకు ప్రసిద్ధి చెందిన ఆ కంపెనీ తమకు వచ్చిన 80,000 ఆర్డర్లను.. ఆయా వినియోగదారులను క్షుణ్ణంగా అధ్యయనం చేశాకే ఈ నివేదికను విడుదల చేసినట్లు ప్రకటించింది. వినియోగదారుల్లో 62 శాతం పురుషులు, 38 శాతం మహిళలు ఉన్నారంట. ఓవరాల్‌గా ఈ జాబితాలో మహారాష్ట్ర అగ్రస్థానంలో కొనసాగగా.. కర్ణాటక, పశ్చిమ బెంగాల్‌, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్(అనంతపురం) తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. లిస్ట్ లో లేనప్పటికీ పంజాబ్‌కు మాత్రం ఓ ప్రత్యేక అంశంతో ఈ సర్వేలో ప్రత్యేక స్థానం సంపాదించుకుంది.

ఒకప్పుడు సెక్స్ టాయ్స్ కోసం ఢిల్లీ కరోల్‌ బాగ్‌, ముంబై క్రాఫోర్డ్‌ మార్కెట్‌, లేదా విదేశాలకు హాలీడ్ ట్రిప్‌ వెళ్లినప్పుడో అవసరం ఉన్నవాళ్లు తెప్పించుకునేవారు. కానీ, ఆన్‌ లైన్‌ మార్కెట్‌ పుణ్యమాని ఇప్పుడవన్నీ ఇంటికే వచ్చేస్తున్నాయి. అదిగో ఆ జాబితాలో పంజాబ్‌ మొదటి స్థానంలో ఉందంట. శృంగార ఉత్ప్రేరక వస్తువులను అక్కడి మహిళలే ఎక్కువగా ఆశ్రయిస్తుండటం ఇక్కడ విశేషం.

ఇక గుజరాత్ దాండియాకు ఎంత ప్రసిద్ధో తెలిసిందే. నవ రాత్రుల సందర్భంగా కోలాటాల కోలాహలంతో రాష్ట్రం మారుమోగిపోతుంది. అయితే ఈ దఫా మాత్రం దాండియా కంటే వేరే ఆటకే ఎక్కువగా ప్రాముఖ్యతను ఇచ్చినట్లు తెలుస్తోంది. ఎక్కువ శాతం యువత ఆన్ లైన్‌, ఆఫ్ లైన్‌ అడల్ట్ గేమ్స్‌ను కొనుగోలు చేసినట్లు వెల్లడైంది. మాములు రోజుల్లో కంటే నవ రాత్రుల టైంలో మూడు రెట్లు ఎక్కువగా శృంగార ఉత్పత్తులనే అక్కడి యువత కొనుగోలు చేసిందని సర్వే వెల్లడించింది.

కండోమ్‌ ఉత్పత్తుల కొనుగోలులో భోపాల్ అగ్ర స్థానంలో ఉంది. తెలంగాణకు సంబంధించి మగవాళ్లు సెక్సీగా ఉండే ఇన్నర్‌వేర్‌లు కొనుగోలు చేసేందుకే ఎక్కువ ఆసక్తి చూపుతున్నారంట. బెంగాలీలు పడక సుఖంలో కూడా తిండి మీద మక్కువ చూపిస్తున్నారంట. ఇలా శృంగార కోరికలు.. వాటిని అణుచుకునేందుకు ఉత్పత్తులను ఆశ్రయించంటం గతంలో కంటే ఇప్పుడు బాగా ఎక్కువైపోయిందని ఈ సర్వే తేల్చేసింది.


Leave a Reply

Your email address will not be published. Required fields are marked *