లైంగికాసక్తి పెరగడానికి..!

sex
Spread the love

జీవితం 100 శాతం పరిపూర్ణత సాధించటానికి 4 అంశాలు దోహదపడతాయి. 25 శాతం లైంగిక ఆరోగ్యం, 25 శాతం మెంటల్‌ హెల్త్‌, 25శాతం శారీరక ఆరోగ్యం, 25శాతం సైకలాజికల్‌ హెల్త్‌. వీటిలో లైంగిక ఆరోగ్యం లోపిస్తే 75 శాతంజీవితాన్నే ఆస్వాదించినవాళ్లమవుతాం. ఆ లోటును కూడా భర్తీ చేయగలిగినప్పుడే సంపూర్ణ ఆరోగ్యం సొంతమవుతుంది. లైంగిక సంతృప్తి పొందటం వల్ల ఎన్నో ఆరోగ్యపరమైన ప్రయోజనాలున్నాయి. ఆ తృప్తి పొందినప్పుడు శరీరంలో ఆక్సిటోసిన్‌, డోపమైన్‌ అనే ఫీల్‌గుడ్‌ హార్మోన్లు విడుదలవుతాయి. ఫలితంగా శరీరం కొత్త ఉత్తేజం పొందుతుంది. రక్త ప్రసరణ మెరుగై చర్మం యవ్వనవంతంగా ఉంటుంది. మానసిక సంతృప్తి పొందుతారు. మరిముఖ్యంగా భాగస్వామితో బంధం బలపడుతుంది. సెక్స్‌ సంతృప్తి కొరవడినప్పుడు సీ్త్రలలో డిప్రెషన్‌, చిరాకు, ఆందోళన, అకారణమైన ఒళ్లు నొప్పులులాంటి లక్షణాలు కనిపిస్తాయి.

లైంగికాసక్తి పెరగాలంటే…

ఈస్ట్రోజెన్‌ హార్మోన్‌ ఉత్పత్తిని ప్రేరేపించే సోయా ఉత్పత్తులు రోజూ తీసుకోవాలి.
చీజ్‌ బదులుగా టోఫు తినాలి.
విటమిన్‌ ఇ, సి ఉన్న ఆహారం తీసుకోవాలి.
లైంగిక ఉద్రేకం పొందటంలో రక్త ప్రసరణ ప్రధాన పాత్ర పోషిస్తుంది. కాబట్టి రక్త వృద్ధిని పెంచే ఆకుకూరలు, దానిమ్మ పండ్లు తినాలి.
ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్లు ఉండే ఫిష్‌ ఆయిల్‌ తీసుకోవాలి.
జననావయవాల దగ్గర వర్జిన్‌ ఆలివ్‌ ఆయిల్‌తో మర్దనా చేయాలి.
క్రమం తప్పక యోగా, ప్రాణాయామం చేసినా ఫలితం ఉంటుంది.
చక్కటి శరీరాకృతినిచ్చే వ్యాయామాలు చేయాలి.


Related News

men

మగాడు ఈ రెండూ షేర్ చేయకూడదు…

Spread the loveపురుషులు కొన్ని విషయాలు ఎప్పటికీ, ఎవ్వరితోనూ పంచుకోకూడదట. ఇది ఇప్పటి పరిశోధనల్లో తేలిన విషయంకాదండి. కొన్నేళ్ల క్రితంRead More

sex

మగాళ్లు రాత్రి.. ఆడాళ్లు పగలు..!

Spread the loveమన దేశంలో సెక్స్‌ ప్రోడక్ట్స్‌ విక్రయించే ఓ ఆన్‌లైన్‌ సంస్థ నిర్వహించిన తాజా సర్వేలో ఇలాంటి ఆసక్తికరమైనRead More

 • పెళ్లికి పన్ను భారమాయే..!
 • సెక్స్ ఆసక్తి తగ్గుతోంది..
 • నెట్ లో పడిన బాల్యం బంధీగా మారింది…
 • 500మందికి ఒకే ఆధార్
 • మందు కొడితే..భాష బహుబాగు
 • గర్భిణీలకే పెళ్లి..
 • సెక్స్ టాయ్స్ మోజులో భారతీయులు
 • సేఫ్టీ కోసం వాట్సాప్ వాడకం నిలిపివేత
 • Leave a Reply

  Your email address will not be published. Required fields are marked *