సెక్స్ భోజ‌నానికి ముందా? త‌ర్వాత‌??

o-COUPLE-BED-sex
Spread the love

శృంగారం ఆరోగ్యకరమైనది. శరీరంలోని టాక్సిన్స్‌ అన్ని సమయంలో విడుదలైపోవడం, రక్తప్రసరణ బాగా జరగడం వల్ల మనిషిని ఆరోగ్యవంతుణ్ణి చేస్తుంది శృంగారం. అయితే శృంగారం భోజనానికి ముందు చేస్తే మంచిదా లేక తర్వాత చేస్తే మంచిదా? అనే సందేహానికి మనం తీసుకునే ఆహారమే సమాధానమట. అల్పాహారం, జ్యూస్‌, ఎనర్జీ డ్రింక్స్‌ వంటివి శృంగారానికి ముందు తీసుకోవచ్చు. కడుపునిండుగా తిన్నతర్వాత మాత్రం వెంటనే శృంగారంలో పాల్గొనకూడదు. ఎందుకంటే మన శరీరంలో రక్త ప్రసరణ సహా అన్ని వ్యవస్థలు మనం తిన్న ఆహారం మీదే దృష్టికేంద్రీకరించి పనిచేస్తుంటాయి. తిన్నవెంటనే శృంగారంలో పాల్గొంటే త్వరగా అలిసిపోతారు. దీంతో శృంగారాన్ని పూర్తిగా ఎంజాయ్‌ చేయలేరు. ఒకవేళ లిమిట్‌గా తినేవారు, డైట్‌ ఫాలో అవుతున్న వారికైతే తిన్న తరువాతే శృంగారం మంచిది. అలా అని శృంగారం తర్వాత కూడా వెంటనే ఆహారం తినకూడదు. కొంచెం గ్యాప్‌ ఇచ్చి శరీరంలోని అన్ని వ్యవస్థలూ రిలాక్స్‌ స్టేజికి వచ్చాక తినాలి. అప్పుడు కూడా తక్కువగానే తినాలి. లేకుంటే ఊబకాయం వచ్చే అవకాశాలు ఎక్కువ. ఎక్స్పెస్‌ మ్యాగజైన్స్‌ వారు నిర్వహించిన సర్వే ప్రకారం, మగవారిలో 41శాతం మంది తినడానికి ముందే శృంగారం ఇష్టపడతారు కానీ ఆడవారిలో 61శాతంమంది తిన్న తర్వాతే శృంగారానికి ఇష్టపడతారట. లైట్‌గా ఫుడ్‌ తీసుకున్న తర్వాతే శృంగారం చేయడం ఆరోగ్యవంతమైనదనేదే ఈ సర్వే సారాంశం.

ఈమధ్య కాలంలో వివాహం తర్వాత ఒకరిద్దరు పిల్లలు పుట్టగానే దాంపత్య జీవితంపై అనాసక్తి పెరుగుతోంది. దీనికి కారణాలు అనేకం. కానీ పూర్వకాలంలో వివాహితులు ప్రతిరోజూ శృంగారంలో పాల్గొనడం వల్ల ఆరోగ్యపరంగా వారికి ఎంతో మేలు జరిగేదని పరిశోధకులు చెబుతున్నారు. అందుకు నాలుగు కారణాలున్నాయి. ఒకటి శృంగారం కూడా ఒక వ్యాయామం. ఇది అందరికీ తెలిసిందే. ఇక రెండోది శ్వాసక్రియ క్రమంగా పెరిగి ఎక్కువ కాలరీల శక్తి కరిగి శరీరం ఫిట్నెస్‌ సంతరించుకుంటుంది. వారానికి మూడుసార్లు 15 నిమిషాలు వంతున శృంగారంలో పాల్గొంటే ఏడాదికి 7,500 కాలరీల శక్తి పోతుంది. అంటే 75మైళ్ళు జాగింగ్‌ చేసినట్టే. ఇక మూడవది శృంగార సమయంలో అధికంగా శ్వాస తీసుకుంటారు. దీనివల్ల శరీర కణాలకు ఆక్సిజన్‌ విరివిగా లభిస్తుంది. శృంగారంలో ప్రతిరోజు పాల్గొనడంవల్ల ఎనలేని ప్రయోజనాలుంటాయని పలు అధ్యయనాలు తెలియజేస్తున్నాయి. నాలుగవ కారణం దంపతుల మధ్య బంధం పటిష్టం కావడమే కాకుండా పగటిపూట రోజూవారీ పనుల్లో చిరాకు, ఒత్తిడి తగ్గుతుంది. మధుమేహం, గుండెజబ్బులు లాంటి సమస్యల నుంచి కూడా దూరంగా ఉండవచ్చు.






Related News

Drinks-at-Grafton

మందు కొడితే..భాష బహుబాగు

Spread the loveమద్యం వల్ల ఆరోగ్యం పాడవుతుందని మన అందరికీ తెలుసు. మద్యాన్ని అధికంగా తీసుకోవడం వల్ల మనసు, శరీరం,Read More

TODA TRIBES

గర్భిణీలకే పెళ్లి..

Spread the loveఆదివాసీల సంప్రదాయాలు ఆధునికులకు వింతగా ఉంటాయి. ఒక్కో తెగ పద్దతులు ఒక్కోలా ఉంటాయి. అలాగే తమిళనాడు అడవుల్లోRead More

  • సెక్స్ టాయ్స్ మోజులో భారతీయులు
  • సేఫ్టీ కోసం వాట్సాప్ వాడకం నిలిపివేత
  • పోర్నోగ్రఫీతో పెనుముప్పు
  • హై హీల్స్ కి అనుమతి లేదు..
  • లైంగికాసక్తి పెరగడానికి..!
  • పాస్ పోర్ట్ మ‌రింత సులువుగా ..
  • అక్ర‌మ సంబంధాల్లో అవే ఎక్కువ‌..!
  • ఒక్క చెట్టుకి ఎంత పెట్టుబ‌డో తెలుసా?
  • Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *