Main Menu

పోర్న్ సైటుల‌కు బ్రేకులు ప‌డ్డ‌ట్టేనా?

Spread the love

పిల్లలు, యువతను తప్పుదోవ పట్టిస్తోన్న సుమారు 827 పోర్న్‌ వెబ్‌సైట్లను(భారతదేశ పరిధిలో) బ్లాక్‌ చేయాలని ఎట్టకేలకు కేంద్ర ప్రభుత్వం ఇంటర్నెట్‌ సర్వీస్‌ ప్రొవైడర్లను(ఐఎస్‌పీ) ఆదేశించింది. ఉత్తరాఖండ్‌ హైకోర్టు గత నెలలో ఓ కేసు విషయమై మొత్తం 857 వెబ్‌సైట్లను బ్లాక్‌ చేయాలని పేర్కొనగా.. అందులో 30 సైట్లలో ఎలాంటి అశ్లీల కంటెంట్‌ లేదని.. బ్లాక్‌ చేయాల్సిన మొత్తం 827 వెబ్‌సైట్ల జాబితాను టెలికామ్‌ విభాగానికి ఇప్పటికే అందజేసినట్టు అధికారులు పేర్కొన్నారు. ఐతే, పోర్న్‌ వెబ్‌సైట్లను నిషేధించడానికి సంబంధించి మూడేండ్ల క్రితమే కేంద్రం ఓ నోటిఫికేషన్‌ను జారీ చేసినప్పటికీ అది అమలు కాలేదు. కాగా, పోర్న్‌ వీడియో క్లిప్పింగ్‌లు చూసిన అనంతరం డెహ్రాడూన్‌లోని ఒక పాఠశాల విద్యార్ధులు తన తోటి విద్యార్థినిపై సామూహిక అత్యాచారానికి పాల్పడినట్టు గత నెలలో పలు మీడియాల్లో వచ్చిన వార్తలను సుమోటోగా స్వీకరించిన ఉత్తరాఖండ్‌ హైకోర్టు.. పోర్న్‌ వెబ్‌సైట్ల నిషేధాన్ని అమలు చేసేందుకు మార్గదర్శకాలు జారీ చేయాలని కేంద్రానికి తెలిపింది. పోర్న్‌ వెబ్‌సైట్ల నిషేధంపై కేంద్రం ఉదాశీన వైఖరిని ఉత్తరాఖండ్‌ హైకోర్టు ఈసందర్భంగా తప్పు పట్టడం గమనార్హం.

పోర్న్‌ వెబ్‌సైట్లను అరికట్టేందుకు అధికారులు ముమ్మర ప్రయత్నాలు ప్రారంభించినప్పటికీ.. ఆయా చర్యలు సత్ఫలితాలు ఇస్తాయో లేదోనన్న సందేహాలు కలుగుతున్నాయి. ఇక, ఆ విషయాన్ని పక్కనబెడితే, దేశంలో ఉచిత వైఫై ఉపయోగించే యువతలో 33 శాతం మంది మొదటి ప్రాధాన్యత పోర్న్‌ సైట్లేనని ఓ అధ్యయనం వెల్లడించగా.. బడిపిల్లల్లో కూడా పోర్న్‌ సైట్లు చూస్తున్న వారి సంఖ్య రోజు రోజుకు పెరిగిపోతుండటం.. పట్టణ యువతలో 63 శాతం మంది పోర్న్‌ వలలో చిక్కుకొని కొన్ని సార్లు డిప్రెషన్లోకి వెళ్తున్నట్టు పలు సర్వేలు తేల్చడం విస్తుగొలుపుతోంది. చిన్నారుల చేతుల్లో మొబైల్స్‌ ఉన్నప్పుడు పేరెంట్స్‌ వాళ్ళని ఓ కంట కనిపెట్టడం మంచిదని మానసిక నిపుణులు చెబుతున్నారు. ఇక, మొబైల్‌ లో అశ్లీల సైట్లని బ్లాక్‌ చెయ్యడం కోసం ఆండ్రాయిడ్‌ ఆపరేటింగ్‌ సిస్టం గూగుల్‌ ప్లే స్టోర్‌, ఐఫోన్‌ వాడుతున్న వాళ్లకు యాప్‌ స్టోర్‌లో అనేక అప్లికేషన్లు లభిస్తున్నాయని.. వీటిని చిన్నారులు ఉపయోగించే మొబైల్స్‌ లో ఇన్స్టాల్‌ చేయడం వల్ల పోర్న్‌ సైట్ల బెడదను పారదోలచ్చని టెక్‌ నిపుణులు చెబుతున్నారు. పోర్న్‌ బ్లాకర్‌, యాంటీ పోర్న్‌, సేఫ్‌ బ్రౌజర్‌ పోర్న్‌ వంటి యాప్స్‌ ఇప్పటికే, పోర్న్‌ బ్లాకింగ్‌ యాప్స్‌ గా వినియోగదారుల మన్ననలు అందుకోవడం తెలిసిందే!

బాలల పట్ల లైంగిక నేరాల నిరోధం కోసం ఏర్పాటు చేసిన హెల్ప్‌ లైన్‌ నంబర్‌ను కొన్ని రోజులపాటు తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్టు పక్షం రోజుల క్రితం కేంద్ర సర్కారు ప్రకటించడం తెలిసిందే! ప్రస్తుతం చైల్డ్‌ హెల్ప్‌ లైన్‌ కోసం వినియోగిస్తున్న 1098 నంబర్‌ స్థానంలో త్వరలోనే మరో కొత్త నంబర్‌ని తీసుకువస్తామని సదరు అధికారులు ఈసందర్భంగా వెల్లడించారు. కాగా, ఇంటర్‌నెట్‌లో అశ్లీల విషయాల గురించి సర్చ్‌ చేస్తున్నప్పుడు ఈ చైల్డ్‌ హెల్ప్‌ లైన్‌ నంబర్‌ కనిపిస్తుండటంతో.. బ్రౌజ్‌ చేసే జనాలు ఈ నంబర్‌కు సెక్సువల్‌ సర్వీస్‌ల కోసం ఫోన్లు చేయడమే ఈ చర్యకు కారణంగా తెలుస్తోంది. 2016లో మహిళాశిశు సంక్షేమ మంత్రిత్వ శాఖ చిన్నపిల్లల పట్ల లైంగిక నేరాలకు పాల్పడే వారికి వ్యతిరేకంగా ఫిర్యాదులు చేయడానికి వీలుగా ఈ చైల్డ్‌ హెల్ప్‌ లైన్‌ నంబర్‌ను తీసుకొచ్చారు.

ఆశ్లీల సైట్లపై మూడు నెలల స్పెషల్‌ డ్రైవ్‌ నిర్వహించి ఏకంగా 4,000 పోర్న్‌ వెబ్‌సైట్లను, ఖాతాలను ఇటీవలే చైనా ప్రభుత్వం పకడ్బందీగా మూసివేయగా.. అత్యాచారాలు ఎక్కువ అవుతున్న నేపథ్యంలో దేశంలోని అన్ని అశ్లీల వెబ్‌సైట్లను నిషేధించాలని నేపాల్‌ ప్రభుత్వం సైతం నిర్ణయించడం గమనార్హం. ఇక, ఏదైనా అశ్లీల వెబ్‌సైట్‌ను తెరవాలని ప్రయత్నిస్తే ఆ వెబ్‌సైట్‌కు బదులు భక్తిపాటలు వచ్చేలా.. బనారస్‌ హిందూ విశ్వవిద్యాలయానికి చెందిన ఓ ప్రొఫెసర్‌ యాప్‌ ను తయారు చేయడం విశేషం.

దేశంలో భద్రతా వ్యవహారాలను చూసు కునే కేంద్ర హౌంమంత్రిత్వశాఖలోని సిబ్బందే అశ్లీల చిత్రాలు చూస్తున్నట్టు ఆ శాఖ మాజీ కార్య దర్శే వ్యాఖ్యానించడం అప్పట్లో సంచలనం స ష్టించింది. గత ఏప్రిల్‌ నెలలో ముంబైలో నిర్వ హించిన మొదటి ఆర్థిక భద్రతా మహాసభలో ప్రసంగిస్తూ జీకే పిళ్ళై పై వ్యాఖ్యలు చేశారు. రెండునెలలకోసారి హౌంమంత్రి త్వశాఖ ఆఫీ సులోని అన్ని కంప్యూటర్లకు వైరస్‌ సమస్యలు వవ్చేవని.. ఎందుకిలా జరుగుతుందో సమీక్షిం చగా, అసలు సంగతి తేలిందని ఆయన చెప్పుకొచ్చారు.


Related News

నేనూ టెస్ట్ ట్యూబ్ బేబీనే..!

Spread the loveదేశంలోనే అపర కుబేరుడైన రిలయన్స్‌ అధినేత ముఖేష్‌ అంబానీ గారాలపట్టి ఇషా అంబానీ మరోమారు వార్తల్లోకి ఎక్కారు.Read More

డేటింగ్ చేస్తారా..అయితే ఇది చ‌ద‌వండి..!!

Spread the love‘డేటింగ్‌’ అనే పదం పలకడమే నేరంగా భావించే రోజులు మనదేశంలో సైతం పోయాయి. వాట్సాప్‌ స్నేహాలు… ఫేస్‌బుక్‌Read More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *