Main Menu

పోర్న్ చూసి…

Spread the love

పిల్ల‌ల‌పై పోర్న్ ప్ర‌భావం పెరుగుతోంది. మొబైల్ డేటా అందుబాటులోకి వ‌చ్చిన త‌ర్వాత అంద‌రికీ ఇంట‌ర్నెట్ అందుబాటులోకి వ‌చ్చింది. పిల్ల‌లు కూడా నెట్ లో వీడియోలు చూస్తూ ప‌క్క‌దారి ప‌డుతున్నారు. తాజాగా అలాంటి ఘ‌ట‌నే జ‌రిగింది. ఉత్తరాఖండ్‌లో దారుణం చోటు చేసుకుంది. పోర్న్‌ వీడియోలు చూసి 9 నుంచి 14 ఏళ్ల మధ్య వయసున్న ఐదుగురు బాలురు 8 ఏళ్ల బాలికపై అత్యాచారానికి పాల్పడ్డారు. మొబైల్ ఫోన్‌లో రెండు రోజులపాటు పోర్న్ వీడియో చూసిన బాలురు ఆ తర్వాత చిన్నారిని ఓ ఇంట్లోకి తీసుకెళ్లి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. డెహ్రాడూన్‌లోని సాహస్‌పూర్‌లో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

సాహస్‌పూర్‌ చెందిన ఐదుగురు బాలురు, అక్కడే ఉన్న బాలికను ఆడుకుందామని నమ్మించి ఓ స్నేహితుడి ఇంట్లోకి తీసుకెళ్లి ఈ దుర్మార్గానికి పాల్పడ్డారని పోలీసులు వెల్లడించారు. ఈ ఘటనకు రెండు రోజుల ముందు ఫోన్‌లో పోర్న్ వీడియోలు చూసినట్లు నిందితుల్లో ఒకడైన బాలుడు తెలిపారన్నారు. అనంతరం బాలికపై అత్యాచారానికి ఒడిగట్టినట్లు విచారణలో తేలిందన్నారు. నిందితులపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి బాల్య గృహంకు తరలించినట్లు పోలీసులు పేర్కొన్నారు.






Related News

నేనూ టెస్ట్ ట్యూబ్ బేబీనే..!

Spread the loveదేశంలోనే అపర కుబేరుడైన రిలయన్స్‌ అధినేత ముఖేష్‌ అంబానీ గారాలపట్టి ఇషా అంబానీ మరోమారు వార్తల్లోకి ఎక్కారు.Read More

డేటింగ్ చేస్తారా..అయితే ఇది చ‌ద‌వండి..!!

Spread the love‘డేటింగ్‌’ అనే పదం పలకడమే నేరంగా భావించే రోజులు మనదేశంలో సైతం పోయాయి. వాట్సాప్‌ స్నేహాలు… ఫేస్‌బుక్‌Read More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *