పోర్నోగ్రఫీతో పెనుముప్పు

porn watching
Spread the love

పోర్న్‌ చూడటం వల్ల ఎటువంటి పరిణామాలు కలుగుతాయి?

– పోర్న్‌ వీడియోలు చూసే వ్యక్తి క్రమంగా అందరికీ దూరమైపోయి ఒంటరితనాన్ని కోరుకుంటాడు. పోర్న్‌ చూసే కాలం, పోర్న్‌ (మామూలు సంభోగం నుండి హింసాత్మకమైనవాటి వరకు) స్థాయి పెరిగే కొద్దీ ఈ ఒంటరితనం పెరుగుతుంది.

– పోర్న్‌ చూసేవారు జీవిత భాగస్వామిని గాయపరిచే అవకాశం ఎక్కువ. ఆమె ఇష్టాయిష్టాలు, ఇబ్బందులు లక్ష్యపెట్టకపోవడమే కాదు. క్రమంగా ఆమెతో మానసిక సాన్నిహిత్యానికి భయపడతారు.

– ఆరోగ్యకరమయిన సహజ శారీరక సంబంధాలపై విముఖత ఏర్పడుతుంది. పోర్న్‌ చూస్తూఉండకపోతే లైంగిక తృప్తి పొందలేరు.

– పోర్న్‌ సినిమాలపై మాటల్లో, చర్యల్లో ఆధిపత్యాన్ని, ఉద్రేకాన్ని, హింసను చూపుతాయి. నిజానికి లైంగిక హింసను స్త్రీలు ఆనందిస్తారని చెప్పి నమ్మిస్తాయి. కాబట్టి పోర్న్‌ వ్యక్తిని లైంగిక దాడికి మానసికంగా సన్నద్ధం చేస్తుంది. ఆలోచనల్నే కాక చేతల్ని కూడా ప్రభావితం చేయగలదు.

– రాను రాను పోర్న్‌ మరింత క్రూరంగా, జుగుప్సాకరంగా నిర్ఘాంతపోయేంత అమానవీయంగా మారుతున్నది.

– అక్రమ రవాణా నుండి వ్యభిచారం నుండి పోర్న్‌ను విడదీసి చూడటం ఎంతమాత్రం సాధ్యం కాదు.

– పోర్న్‌ వలన వ్యక్తిగత జీవితం, కుటుంబ జీవితం వృత్తి జీవితం కూడా దెబ్బతింటాయి.
కాబట్టి పోర్న్‌ను ఏ హానీ లేని వినోదంగా, భావ వ్యక్తీకరణగా చూడటం తప్పు.

ఎట్లా మానాలి?

– పోర్న్‌ చూసే వ్యక్తి తాను చూసే అలవాటును మానేయాలని బలంగా కోరుకోవాలి. మారడానికి ప్రయత్నించాలి.

– ఎవరితోనైనా తన సమస్యను పూర్తి నిజాయితీతో తన సమస్యను పంచుకోవాలి.

– తన నెట్‌లో పోర్న్‌ రాకుండా బ్లాక్‌ చేసుకోవాలి. తనదగ్గర ఉన్నది తీసేయాలి.

– ఎవరైనా మిత్రుల సహకారం తీసుకోవాలి. ఖాళీ లేకుండా ఇతర వ్యాపకాలు పెట్టుకోవాలి.

– భార్య పిల్లలు బాధపడుతున్నారని పదే పదే గుర్తు చేసుకోవాలి. ఒంటరిగా కంప్యూటర్‌తో ఆడకుండా భార్య పిల్లలతో కలిసి ఆపరేట్‌ చెయ్యాలి.

– ఆరోగ్యకర లైంగిక సంబంధాలు పునరుద్ధరించుకోవాలి. సాధ్యంకాకుంటే కౌన్సిలర్‌ సాయం తీసుకోవాలి.


Related News

men

మగాడు ఈ రెండూ షేర్ చేయకూడదు…

Spread the loveపురుషులు కొన్ని విషయాలు ఎప్పటికీ, ఎవ్వరితోనూ పంచుకోకూడదట. ఇది ఇప్పటి పరిశోధనల్లో తేలిన విషయంకాదండి. కొన్నేళ్ల క్రితంRead More

sex

మగాళ్లు రాత్రి.. ఆడాళ్లు పగలు..!

Spread the loveమన దేశంలో సెక్స్‌ ప్రోడక్ట్స్‌ విక్రయించే ఓ ఆన్‌లైన్‌ సంస్థ నిర్వహించిన తాజా సర్వేలో ఇలాంటి ఆసక్తికరమైనRead More

 • పెళ్లికి పన్ను భారమాయే..!
 • సెక్స్ ఆసక్తి తగ్గుతోంది..
 • నెట్ లో పడిన బాల్యం బంధీగా మారింది…
 • 500మందికి ఒకే ఆధార్
 • మందు కొడితే..భాష బహుబాగు
 • గర్భిణీలకే పెళ్లి..
 • సెక్స్ టాయ్స్ మోజులో భారతీయులు
 • సేఫ్టీ కోసం వాట్సాప్ వాడకం నిలిపివేత
 • Leave a Reply

  Your email address will not be published. Required fields are marked *