పాస్ పోర్ట్ మ‌రింత సులువుగా ..

Passport-PTI
Spread the love

భారతీయులు పాస్‌పోర్టు పొందడం మరింత సులభతరమైంది. పాస్‌పోర్ట్‌కు దరఖాస్తు చేసుకునే ప్రక్రియలో ఇక నుంచి బర్త్ సర్టిఫికెట్‌ను చూపించాల్సిన పనిలేదు. ఆధార్, లేదంటే పాన్‌కార్డునే జన్మదిన ధ్రువీకరణకు ప్రమాణంగా పరిగణించనున్నట్టు ప్రభుత్వం పార్లమెంటుకు తెలియజేసింది. నిజానికి పాస్‌పోర్టు నిబంధనలు 1980 ప్రకారం.. జనవరి 26, 1989, ఆ తర్వాత పుట్టిన వారు పాస్‌పోర్టుకు దరఖాస్తుచేసుకునే సమయంలో విధిగా బర్త్ సర్టిఫికెట్‌ను చూపించాల్సి ఉంటుంది. ప్రభుత్వం తాజాగా తీసుకున్న నిర్ణయంతో ఇక నుంచి వీరు స్కూల్ ట్రాన్స్‌‌ఫర్ సర్టిఫికెట్, మెట్రిక్యులేషన్ సర్టిఫికెట్, ఆధార్, పాన్‌కార్డు, డ్రైవింగ్ లైసెన్స్, ఓటర్ ఐడీ, ఎల్ఐసీ పాలసీ బాండ్లలో ఏదో ఒకటి చూపిస్తే సరిపోతుందని కేంద్రమంత్రి వీకే సింగ్ పార్లమెంటుకు తెలిపారు. అలాగే 60 ఏళ్ల పైబడిన వారు, 8 ఏళ్ల లోపు చిన్నారులకు పాస్‌పోర్టు ఫీజులో 10 శాతం రాయితీ ఇవ్వనున్నట్టు పేర్కొన్నారు.


Related News

Passport-PTI

పాస్ పోర్ట్ మ‌రింత సులువుగా ..

Spread the love భారతీయులు పాస్‌పోర్టు పొందడం మరింత సులభతరమైంది. పాస్‌పోర్ట్‌కు దరఖాస్తు చేసుకునే ప్రక్రియలో ఇక నుంచి బర్త్Read More

Young sexy naked heterosexual couple making love in bed- shoot with lensbaby

అక్ర‌మ సంబంధాల్లో అవే ఎక్కువ‌..!

Spread the love యువ దంపతులతో పోలిస్తే.. లేటు వయసు దంపతుల్లోనే వివాహేతర సంబంధాలు ఎక్కువని తాజాగా ఓ అధ్యయనRead More

 • ఒక్క చెట్టుకి ఎంత పెట్టుబ‌డో తెలుసా?
 • క్యాన్స‌ర్ త‌గ్గించే క‌ణాలు
 • యువ‌కుడిపై పోర్న్ స్టార్ దాడి
 • సెక్స్ కి అదే స‌రైన స‌మ‌యం
 • సెక్స్ భోజ‌నానికి ముందా? త‌ర్వాత‌??
 • సెక్స్ కోరిక‌ల‌పై నాన్ వెజ్ ప్ర‌భావం!
 • ఇది డేంజ‌ర్ సుమా..!
 • భార్యాభ‌ర్త‌ల బంధం ఇలా ఉండాలి..!
 • Leave a Reply

  Your email address will not be published. Required fields are marked *