Main Menu

నేనూ టెస్ట్ ట్యూబ్ బేబీనే..!

Spread the love

దేశంలోనే అపర కుబేరుడైన రిలయన్స్‌ అధినేత ముఖేష్‌ అంబానీ గారాలపట్టి ఇషా అంబానీ మరోమారు వార్తల్లోకి ఎక్కారు. గత నెలలో అత్యంత ఖరీదైన వివాహం చేసుకున్న అతివగా సందడి చేసిన ఇషా అంబానీ తాజాగా తనకు సంబంధించిన సంచలన విషయాలను వెల్లడిస్తూ మరోమారు వార్తల్లోకి వచ్చారు. ఇటీవల ఓ మ్యాగజీన్‌కు ఇచ్చిన ఇంటర్వూలో ఇషా పలు ఆసక్తికర విషయాలను వెల్లడించారు. ‘మా అమ్మానాన్నల పెళ్లి జరిగిన ఏడేండ్లకు నేను, నా కవల సోదరుడు ఆకాశ్‌ జన్మించాం. మేమిద్దరం ఐవీఎఫ్‌ (ఇన్‌ విట్రో ఫెర్టిలైజేషన్‌- టెస్ట్‌ట్యూబ్‌ బేబీ) పద్ధతి ద్వారా జన్మించాం. మాకు ఐదేళ్లు వచ్చే దాకా మా అమ్మ తన పూర్తి సమయాన్ని మా కోసమే వెచ్చించారు. అయితే తను చాలా స్ట్రిక్ట్‌గా ఉండేవారు’ అంటూ ఇషా చెప్పుకొచ్చారు. తన నాన్న ఎంత బిజీగా ఉన్నప్పటికీ మాకు ఆయన అవసరం ఉందనిపిస్తే మాత్రం.. ఆయన మా దగ్గరే ఉండిపోతారని ఆమె తెలిపింది. తన కలలను నెరవేర్చుకునేందుకు, రిలయన్స్‌ను మేటి సంస్థగా నిలిపేందుకు మా నాన్న పడ్డ కష్టాన్ని చూస్తూ పెరిగానని ఇషా తెలిపారు. అమ్మానాన్నలు ఎలాంటి పరిస్థితుల్లో పెరిగారో మమ్మల్ని కూడా అలాగే పెంచారని ఆమె తెలిపారు. క్రమశిక్షణ, వినయ విధేయతలు అలవడ్డాయి. డబ్బు విలువ కూడా మాకు బాగా తెలుసు’ అని ఇషా అంబానీ తెలిపారు.






Related News

నేనూ టెస్ట్ ట్యూబ్ బేబీనే..!

Spread the loveదేశంలోనే అపర కుబేరుడైన రిలయన్స్‌ అధినేత ముఖేష్‌ అంబానీ గారాలపట్టి ఇషా అంబానీ మరోమారు వార్తల్లోకి ఎక్కారు.Read More

డేటింగ్ చేస్తారా..అయితే ఇది చ‌ద‌వండి..!!

Spread the love‘డేటింగ్‌’ అనే పదం పలకడమే నేరంగా భావించే రోజులు మనదేశంలో సైతం పోయాయి. వాట్సాప్‌ స్నేహాలు… ఫేస్‌బుక్‌Read More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *