ఇది డేంజ‌ర్ సుమా..!

women
Spread the love

నిద్రలేచినప్పటి నుండి తిరిగి రాత్రి పడుకునే వరకూ ఎన్నోపనులు, టెన్షన్‌, ఒత్తిడితో కూడిన జీవన శైలి. ఇలాంటి పరిస్థితిలో ఆరోగ్యం , అందం గురించి అస్సలు పట్టించుకోరు. ముఖ్యంగా మహిళలు. ఒకసారి నిద్రలేచిన వెంటనే ఆరోజు మీరు ఏం చేయదల్చుకున్నారు. మీ శరీరానికి ఎంత ప్రాధాన్యం ఇస్తున్నారో తెలుసుకోవాలి. మీ ఆలోచనలు నైపుణ్యంతో కూడుకుని ఉండాలంటే కచ్చితంగా మీ బెడ్‌ టైమ్‌ హ్యాబిట్స్‌ను మార్చుకోవాల్సిందే.

మొట్ట మొదట త్వరగా నిద్రలేవడం, రాత్రి త్వరగా నిద్రపోవడం అలవాటు చేసుకోవాలి. లేటుగా నిద్రపోవడం ఆరోగ్యానికి మంచిది కాదు. శరీరం ఆరోగ్యంగా ఉండాలంటే రోజంతా అలసిన శరీరానికి తగిన విశ్రాంతి అవసరం.

డిన్నర్‌ చేసిన వెంటనే పడక మీదకు వెళ్లకూడదు. కనీసం 10 నిముషాలైనా నడవాలి. ఇది తిన్న ఆహారం జీర్ణం అవ్వడానికి, గ్యాస్‌ నివారించడానికి సహాయపడుతుంది. మంచి జీర్ణ వ్యవస్థ వల్ల మంచి నిద్రపడుతుంది. ఎన్నో అనారోగ్య సమస్యలను దూరం చేస్తుంది.
ఈ రోజుల్లో గ్యాడ్జెట్స్‌ అంటే శరీరంలో ఓ అవయవంలా భావిస్తున్నారు. అయితే గ్యాడ్జెట్స్‌ వాడకం వ్యసనంగా మారితే మాత్రం మీరు రాంగ్‌ రూట్‌లో వెళుతున్నట్టే. ఇది కచ్చితంగా మీ నిద్ర మీద ప్రభావం చూపుతుంది.

రాత్రి నిద్రించడానికి ముందు కాఫీ తాగడంమంచిది కాదు. కాఫీ మెదడుపై ప్రభావం చూపుతుంది. దాంతో నిద్ర సరిగా పట్టదు. ఇంకా కెఫిన్‌ డ్యూరియాటిక్‌గా పనిచేస్తుంది. దాంతో యూరిన్‌ వెళ్ళాల్సి వస్తుంది. ఇది కూడా నిద్రమీద ప్రభావం చూపుతుంది.

నిద్రించడానికి ముందు తక్కువ ఆహారం తీసుకోవాలి. అయితే ప్రస్తుత ఉరుకుల పరుగుల జీవితంలో చాలా మంది మెయిన్‌ మీల్స్‌ను స్కిప్‌ చేసి డిన్నర్‌ ఎక్కువగా తీసుకుంటుంటారు. ఇది ఆరోగ్యం మీద ఎక్కువ ప్రభావం చూపుతుంది. ఇది శరీరం మీద పని ఒత్తిడిని పెంచుతుంది.

ప్రస్తుత రోజుల్లో టీవీని లింగ్‌ రూమ్‌ నుండి బెడ్‌ రూమ్స్‌కు మార్చుకుంటున్నారు. అలాగే టీవీ చూస్తూ ఎక్కువగా తినేస్తున్నారు. ఈ అలవాటు అతి బరువుకు దారితీస్తుంది.

రాత్రి నిద్రించడానికి ముందు వ్యాయామం చేయడం వల్ల హార్మోన్స్‌ శరీరాన్ని యాక్టివ్‌గా ఉంచుతుంది. దాంతో సరిగా నిద్రపట్టదు. కాబట్టి, రాత్రి నిద్రించడానికి ముందు వ్యాయామం మంచి అలవాటు కాదు.

శరీరం నొప్పులుగా ఉన్నప్పుడు, అనారోగ్యంగా ఉన్నప్పుడు మీరు నిద్రించే భంగిమ సరిగా లేకపోతే నిద్ర పట్టదు. ఎప్పుడూ లెఫ్ట్‌ సైడ్‌ తిరిగి పడుకోవాలి.


Related News

Passport-PTI

పాస్ పోర్ట్ మ‌రింత సులువుగా ..

Spread the love భారతీయులు పాస్‌పోర్టు పొందడం మరింత సులభతరమైంది. పాస్‌పోర్ట్‌కు దరఖాస్తు చేసుకునే ప్రక్రియలో ఇక నుంచి బర్త్Read More

Young sexy naked heterosexual couple making love in bed- shoot with lensbaby

అక్ర‌మ సంబంధాల్లో అవే ఎక్కువ‌..!

Spread the love యువ దంపతులతో పోలిస్తే.. లేటు వయసు దంపతుల్లోనే వివాహేతర సంబంధాలు ఎక్కువని తాజాగా ఓ అధ్యయనRead More

 • ఒక్క చెట్టుకి ఎంత పెట్టుబ‌డో తెలుసా?
 • క్యాన్స‌ర్ త‌గ్గించే క‌ణాలు
 • యువ‌కుడిపై పోర్న్ స్టార్ దాడి
 • సెక్స్ కి అదే స‌రైన స‌మ‌యం
 • సెక్స్ భోజ‌నానికి ముందా? త‌ర్వాత‌??
 • సెక్స్ కోరిక‌ల‌పై నాన్ వెజ్ ప్ర‌భావం!
 • ఇది డేంజ‌ర్ సుమా..!
 • భార్యాభ‌ర్త‌ల బంధం ఇలా ఉండాలి..!
 • Leave a Reply

  Your email address will not be published. Required fields are marked *