Main Menu

అప్పుడు సెక్స్ చేస్తే ప్రెగ్న‌న్సీ వ‌స్తుందా..?

Spread the love

ఇలాంటి సందేహాలు చాలామందికి ఉంటాయి. ముఖ్యంగా పీరియ‌డ్స్ విష‌యంల తీసుకోవాల్సిన జాగ్ర‌త్త‌ల‌పై చాలామంది సెక్సాలజిస్ట‌ల‌కు ప్ర‌శ్న‌లు వ‌స్తూ ఉంటాయి. కానీ వాస్త‌వానికి పీరియడ్స్‌ నెలనెలా సక్రమంగా వచ్చేవారికి బ్లీడింగ్‌ మొదలైన రోజును మొదటిరోజు కింద లెక్కపెడితే, 11వ రోజు నుంచి 16వ రోజు లోపల అండం విడుదల అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఈ సమయంలో కలవడం వల్ల గర్భం దాల్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. దాదాపుగా 80శాతం ప్రెగ్నెన్సీకి ఆ స‌మ‌యంలో క‌ల‌యికే కార‌ణ‌మ‌ని నిపుణుల అబిప్రాయం.

అంతేగాకుండా వీర్యకణాలు 48 నుంచి 72 గంటల వరకు ఉత్తేజంగా ఉండే అవకాశాలు ఉంటాయి. కొన్ని హార్మోన్లలో మార్పుల వల్ల కొంతమందిలో కొన్నిసార్లు అండం ఆలస్యంగా 16 రోజుల తర్వాత కూడా ఎప్పుడైనా విడుదల కావొచ్చు. పీరియడ్స్‌ సక్రమంగా రాని వారిలో అండం ఎప్పుడు విడుదల అవుతుంది, అసలు అవుతుందా లేదా అని చెప్పడం కష్టం. అందువ‌ల్ల ప‌లానా స‌మ‌యంలోనే ప్రెగ్నెన్సీ వ‌స్తుంద‌నే అంచ‌నాలు అంద‌రికీ ఒకేలా వ‌ర్తించ‌వు. అయితే కాబట్టి పీరియడ్స్‌ సమయంలో కలవడం వల్ల గర్భం దాల్చే అవకాశాలు ఉండవు. ఈ విష‌యంలో అనుమానం అవ‌స‌రం లేదు. ఆ జంట‌కు ఆసక్తి ఉంటే పీరియ‌డ్స్ స‌మ‌యంలో సెక్స్ కూడా ఆస్వాదించ‌వ‌చ్చ‌ని వైద్యులు చెబుతున్నారు.






Leave a Reply

Your email address will not be published. Required fields are marked *