Main Menu

శృంగారంలో అలా జ‌రిగితే..!

Spread the love

శృంగారంలో కీల‌క‌మైన‌ది భావ‌తృప్తి. దాంతో అంగ స్థ‌ల‌నం జ‌రుగుతూ ఉంటుంది. అయితే స్థలనం విష‌యంలో ప‌లు స‌మ‌స్య‌లు చాలామంది ఎదుర్కొంటారు. స‌హ‌జంగా లైంగిక క్రీడలో శీఘ్ర‌స్థ‌ల‌నం విష‌యం చాలామందిని స‌త‌మ‌తం చేస్తుంది. ఈ విష‌యంలో ఐదు నుంచి ఐదున్నర నిమిషాల నిడివి తర్వాత స్ఖలనం జరగాలి. ఇది కనీస సమయం. అలా కాకుండా అంగప్రవేశం జరిగిన నిమిషంలోగానే స్ఖలనం జరిగిపోతే దాన్ని శీఘ్రస్ఖలనంగా భావించాలి. స్ఖలన సయం దంపతులిద్దరినీ అసంతృప్తికి లోను చేస్తుంటే దాన్ని సమస్యగానే భావించాలి. ప్రిమెచ్యూర్‌ ఎజాక్యులేషన్‌లో కూడా రెండు రకాలుంటాయి.

1. ప్రైమరీ ప్రిమెచ్యూర్‌ ఎజాక్యులేషన్‌. దీన్లో లైంగికంగా కలిసిన ప్రతిసారీ సమస్య కనిపిస్తూ ఉంటుంది.

2. సెకండరీ ప్రిమెచ్యూర్‌ ఎజాక్యులేషన్‌. దీన్లో అంతకుముందు వరకూ లేకుండా కొత్తగా శీఘ్రస్ఖలన సమస్య తలెత్తుతుంది. ప్రైమరీ ప్రిమెచ్యూర్‌ ఎజాక్యులేషన్‌ సమస్యకు కారణాలు మానసికమైనవై ఉంటాయి. సెకండరీ ప్రిమెచ్యూర్‌ ఎజాక్యులేషన్‌కు మానసికమైనవీ, శారీరకమైనవీ రెండు కారణాలు ఉంటాయి. అతిగా మద్యం సేవించడం, ప్రోస్టయిటిస్‌ అనేవి ప్రధానమైన శారీరక సమస్యలు. ప్రిమెచ్యూర్‌ ఎజాక్యులేషన్‌ సమస్య శారీరకమైనదైతే, ఆ కారణాన్ని సరిదిద్దితే సమస్య చక్కబడుతుంది.

ఈ చికిత్స సులభం. కానీ మానసికమైన కారణాల వల్ల తలెత్తిన ప్రిమెచ్యూర్‌ ఎజాక్యులేషన్‌ను సరిదిద్దడం కొంత క్లిష్టం. ఇందుకు అనుభవజ్ఞులైన సెక్సాలజిస్టుల చేత కౌన్సెలింగ్‌ ఇప్పించవలసి ఉంటుంది.






Related News

నేనూ టెస్ట్ ట్యూబ్ బేబీనే..!

Spread the loveదేశంలోనే అపర కుబేరుడైన రిలయన్స్‌ అధినేత ముఖేష్‌ అంబానీ గారాలపట్టి ఇషా అంబానీ మరోమారు వార్తల్లోకి ఎక్కారు.Read More

డేటింగ్ చేస్తారా..అయితే ఇది చ‌ద‌వండి..!!

Spread the love‘డేటింగ్‌’ అనే పదం పలకడమే నేరంగా భావించే రోజులు మనదేశంలో సైతం పోయాయి. వాట్సాప్‌ స్నేహాలు… ఫేస్‌బుక్‌Read More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *