Main Menu

హై హీల్స్ కి అనుమతి లేదు..

high-heels
Spread the love

ఉద్యోగినులు హైహీల్స్‌ ధరించడంపై ఫిలిప్పీన్స్‌ ప్రభుత్వం నిషేధం విధించింది. ఎత్తు మడమ చెప్పులు ధరించడం వల్ల మహిళలు తీవ్ర ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నారని.. అందువల్ల వీటిని ధరించాలని కంపెనీలు పెట్టే నిబంధనలపై నిషేధం విధించాల్సిందిగా లేబర్‌ గ్రూప్‌ ప్రభుత్వాన్ని కోరింది. వారి అభ్యర్థనను పరిశీలించిన ప్రభుత్వం ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది. ఉద్యోగినులు హైహీల్స్‌ ధరించాలనే నిబంధనను ఎత్తివేయాల్సిందిగా ఆదేశించింది. హీల్‌ సైజు 2.54సెంటీమీటర్లకు మించకూడదని తెలిపింది.

దీనిపై అసోసియేషన్‌ లేబర్‌ యూనియన్‌ ప్రతినిధి హర్షం వ్యక్తం చేశారు. ‘మహిళలు రోజులో దాదాపు 8 నుంచి 10 గంటల వరకు ఎత్తుమడమ చెప్పులు ధరించి పనిచేస్తున్నారు. దీంతో వారు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఎత్తు చెప్పులు వేసుకుంటే ఆకర్షణీయంగా, ఎత్తుగా కనిపిస్తారని మాత్రమే వివిధ కంపెనీలు భావిస్తున్నాయి. కానీ వీటి వల్ల సమస్యలు ఎదుర్కొంటున్నారనే విషయాన్ని గ్రహించడం లేదు.’ అని ఆయన పేర్కొన్నారు.






Related News

Young sexy naked heterosexual couple making love in bed- shoot with lensbaby

స్వయంతృప్తి మహిళలకు చేటు చేస్తుందా?

Spread the loveసెక్స్ జీవితంలో భారతీయ మహిళలకు అనేక ఆటంకాలుంటాయి. స్వేచ్ఛగా అనుభవించే అవకాశాలు తక్కువే. సంప్రదయాల పేరుతో కట్టుబాట్లుRead More

youtube

ఎఫ్ బీ కన్నా యూట్యూబ్ మిన్న

Spread the loveకాలం మారుతున్న కొద్దీ యువత టేస్ట్ మారుతూ ఉంటుంది. రెండు మూడేళ్ల క్రితం వరకూ ఫేస్ బుక్Read More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *