Main Menu

తెల్ల జుట్టు స‌మ‌స్య నివార‌ణ‌కు..!

Spread the love

కరివేపాకు కూరల్లో రుచికే కాదు.. జుట్టు ఆరోగ్యంగా ఉండడానికి, చర్మ సౌందర్యానికి కూడా తోడ్పడుతుంది. ఇందులో బీటా కెరొటీన్‌, ప్రొటీన్‌ సమద్ధిగా లభిస్తాయి. వీటితోపాటు విటమిన్‌-సి, బి, ఎ, ఇ, ఫాస్పరస్‌, ఐరన్‌, ఫోలిక్‌ యాసిడ్‌లు కూడా ఉంటాయి.
– కొబ్బరినూనెలో కొన్ని కరివేపాకులు వేసి బాగా వేడిచేసి దాన్ని వడకట్టాలి. ఈ నూనెని వారానికి మూడుసార్లు రాసుకుంటే జుట్టు నల్లగా ఒత్తుగా పెరుగుతుంది.

– కరివేపాకు పేస్టుకి కొద్దిగా కలబంద గుజ్జుని కలిపి జుట్టుకు రాసుకొని అరగంట తరువాత తలస్నానం చేయాలి. ఇలా చేయడం ద్వారా పొడిజుట్టుని సంరక్షించుకోవచ్చు.
– కరివేపాకు పేస్టులో కొద్దిగా ఆలివ్‌ నూనె లేదా నువ్వుల నూనెని కలపాలి. ఈ మిశ్రమాన్ని తలకు రాసుకొని గంట తరువాత తలస్నానం చేయాలి. ఇలా వారానికి రెండుసార్లు చేస్తే చుండ్రు సమస్య తగ్గిపోతుంది.
– ముల్తానీ మట్టిలో కొద్దిగా కరివేపాకు పేస్టు, ఒక టీస్పూన్‌ రోజ్‌ వాటర్‌, తేనె, పెరుగు వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి రాసుకొని ఇరవై నిమిషాల తరువాత కడుక్కోవాలి. దీని వల్ల ముఖంపై మొటిమలు, దద్దుర్లు, ర్యాష్‌ రావడం తగ్గుతాయి.






Related News

ఆరోగ్యానికి తాటిమంజ‌లు!

Spread the love ఎండాకాలంలో తాటిముంజలు ఎక్కువగా లభిస్తాయి. వీటిని ఈ కాలంలో తినడం వల్ల ఎన్నో లాభాలున్నాయి. శరీరాన్నిRead More

తెల్ల జుట్టు స‌మ‌స్య నివార‌ణ‌కు..!

Spread the loveకరివేపాకు కూరల్లో రుచికే కాదు.. జుట్టు ఆరోగ్యంగా ఉండడానికి, చర్మ సౌందర్యానికి కూడా తోడ్పడుతుంది. ఇందులో బీటాRead More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *