తింటే తగ్గుతారు…

weight yoga
Spread the love

పొట్టతగ్గాలంటే తక్కువ తినాలనుకుంటారు చాలా మంది. కానీ కొన్నింటిని ఎక్కువగా ఆహారంలో తీసుకున్నా పొట్ట తగ్గుతుంది. అవేంటంటే…
బాదం: మోనోశాచురేటెడ్‌ ఫ్యాట్లు శరీరంలో కొవ్వును కరిగించే శక్తిని పెంచుతాయని పలు అధ్యయనాలు చెబుతున్నాయి. శరీరంలో నీరు కూడా పేరుకోకుండా ఉంటుంది. ఆ పోషకాలు అందాలంటే బాదంతోపాటు ఇతర నట్స్‌ తినాలి.

గుడ్డు: మాంసక త్తులు అధికంగా అందించే గుడ్డు పొట్ట చుట్టూ ఉండే కొవ్వుని కరిగించడంలో కీలకపాత్ర పోషిస్తుంది. ముఖ్యంగా తెల్లసొన తీసుకోవడం వల్ల బి12, డి విటమిన్లు, ఒమెగా- 3 ఫ్యాటీ ఆమ్లాలు శరీరానికి అధికంగా అందుతాయి. ఇవి బరువు తగ్గడంలో కీలక పాత్రపోషిస్తాయి. దీనివల్ల ఎముక సాంద్రత పెరుగుతుంది. గుండె పని తీరు కూడా మెరుగవుతుంది.

పండ్లు: ఆకలిగా అనిపించినప్పుడు ఏ చిరుతిళ్లొ తినే బదులు.. పండ్లు ఎంచుకోవడం మంచిది. వీటి వల్ల చక్కెర్లు, కొవ్వు బాధ ఉండదు. పోషకాలు ఎక్కువగా అందుతాయి. బరువు తగ్గుతారు.

కీరా: ఇందులో కెలొరీలు చాలా తక్కువ. పైగా తొంభ్కెశాతం వరకూ నీరే ఉంటుంది. ఒక్క కీరా తింటే.. అందే కెలొరీలు కేవలం 45 మాత్రమే. ఆకలీ వేయదు. అందుకే.. భోజనానికి ముందు ఒక కీరా తీసుకోగలిగితే అన్నం తక్కువ తినే ఆస్కారం ఉంటుంది.

గింజలు

అన్నిరకాల గింజల్ని ఎంత ఎక్కువగా తీసుకుంటే.. అంత మంచిది. శరీరంలోని కొవ్వు కరగడంతోపాటూ.. కండరాలూ ఆరోగ్యంగా మారతాయి. జీర్ణవ్యవస్థ పనితీరు కూడా మెరుగుపడుతుంది. సెనగలూ, బఠాణీలూ, పెసల మొలకల్లాంటివి పావు కప్పు తిన్నా.. పొట్టనిండినట్లు అనిపిస్తుంది. ఎక్కువసేపు ఆకలి కూడా వేయదు. ఇదే బరువు తగ్గడానికి దారితీస్తుంది.






Related News

beautiful girl sleeps in the bedroom

ప్రశాంతంగా నిద్రపోవాలంటే…

Spread the loveమనం ఆరోగ్యంగా ఉండాలంటే నిద్ర కంటే మించినది మరొకటి లేదు. శరీర పెరుగుదల, మెదడులోని కణాలు కమ్యూనికేషన్‌Read More

cycling

సైక్లింగ్ తో సెక్స్ సామర్ధ్యం..

Spread the loveసైకిల్‌ తొక్కే అలవాటు ఉన్న వారికి లైంగిక పరమైన సమస్యలు వస్తాయనేది అపోహేనని ఓ అధ్యయనంలో తేలింది.Read More

  • లిక్కర్ క్యాన్సర్ కారకం…
  • డిప్రెషన్ కి వెల్లుల్లి
  • జలుబు కి ముగింపు..
  • పొడిచర్మానికి ప్రత్యేకంగా…
  • తినాలనిపించడం లేదా…
  • అలా చేస్తే జుట్టు ఊడిపోతుంది…
  • పొట్ట తగ్గాలంటే…
  • రోజూ చేయండి…
  • Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *