పచ్చి కాయగూరలతో పసందుగా..!

veg salad
Spread the love

చాలా మంది ఎక్కువగా ప్రై చేసిన ఆకుకూరలు, వేపుళ్లను తినడానికి ఇష్టపడుతున్నారు. అలా తినడం వల్ల ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అలాగే కూరగాయలను ఎక్కువగా నూనెలో వేయించినా, ఉడికించినా వాటిలో ఉండే పోషకాలు గాల్లో కలుస్తాయి. అలా ఉడికించిన కూరగాయలను తీసుకోవడం వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదు. కాబట్టి అప్పుడప్పుడు కూరగాయలను సలాడ్స్‌ మాదిరిగా ఉదయం, సాయంత్రం వేళ తీసుకుంటే చాలు ఆరోగ్యం, ఆనందం మీ సొంతం అవుతాయి. మరెందుకు ఆలస్యం ఇన్ని ఉపయోగాలు ఉన్న సలాడ్స్‌ను ఒకసారి ప్రయత్నించి చూడండి !

టమాటా, క్యాబేజ్‌…
కావలసిన పదార్థాలు : సన్నగా తరిగిన క్యాబేజ్‌- ఒక కప్పు, తరిగిన టమాటాలు-రెండు కప్పులు, ఉప్పు-తగినంత, మిరియాల పొడి-ఒక చెంచా, నిమ్మరసం-ఒక చెంచా, ఆలివ్‌ నూనె-ఒక చెంచా, తరిగిన క్యాప్సికం-సగం కప్పు.
తయారీ విధానం: తరిగిన క్యాబేజ్‌ ముక్కల్లో కొద్దిగా ఉప్పు, మిరియాల పొడి వేసి బాగా కలుపుకొని ఐదు నిమిషాలు పక్కన ఉంచుకోవాలి. క్యాబేజ్‌లోనే తరిగిన టమాటా ముక్కలు, కొద్దిగా ఉప్పు, చెంచా మిరియాల పొడి, నిమ్మరసం, ఆలివ్‌ నూనె కలుపుకోవాలి. చివరగా సన్నగా తరిగిన క్యాప్సికం ముక్కలను కలుపుకొని సర్వ్‌ చేసుకుంటే సరిపోతుంది.

వెజ్‌ పెప్పర్‌…
కావలసిన పదార్థాలు: క్యారెట్‌ ముక్కలు-ఒక కప్పు, బీన్స్‌-ఒక కప్పు, ఆలుగడ్డలు-ఒక కప్పు, బ్రోకోలి-ఒక కప్పు, తరిగిన క్యాప్సికం-ఒక కప్పు, ఉప్పు-రుచికి తగినంత, మిరియాల పొడి-ఒక చెంచా, వెన్న-రెండు చెంచాలు, తరిగిన వెల్లుల్లి-ఒక చెంచా.
తయారీ విధానం: క్యారెట్‌, బీన్స్‌, ఆలుగడ్డను బాగా ఉడికించి పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత స్టవ్‌ మీద పాత్ర పెట్టి వెన్న వేసుకోవాలి. వెన్న కాస్త వేడి కాగానే వెల్లుల్లి, సన్నగా తరిగిన క్యాప్సికం ముక్కలను వేసి వేయించుకోవాలి. దీంట్లోనే ఉడికించిన కూరగాయలను వేసుకొని పది నిమిషాలు సిమ్‌లో పెట్టుకోవాలి. తర్వాత దాంట్లో ఉప్పు, మిరియాల పొడి కలుపుకుంటే చాలు వెజ్‌ పెప్పర్‌ సలాడ్‌ రెడీ !

మిక్స్‌డ్‌ వెజ్‌ సలాడ్‌…
కావలసిన పదార్థాలు: కీరదోసకాయలు-రెండు, క్యారెట్‌లు-రెండు, టమాటాలు-రెండు, వెనిగర్‌-ఒక చెంచా, ఉప్పు-రుచికి సరిపడా, మిరియాల పొడి-సగం చెంచా, ఉల్లిముక్కలు-ఒక కప్పు, క్యాప్సికం-ఒకటి.
తయారీ విధానం: ముందుగా కూరగాయలను శుభ్రంగా కడగాలి. ఇలా కడిగిన తర్వాత అన్నింటినీ చిన్నచిన్న ముక్కలుగా కట్‌ చేసుకొని దాంట్లో కొద్దిగా ఉప్పు, మిరియాల పొడి వేసి బాగా కలపాలి. ఇలా చేయడం వల్ల కూరగాయలు తొందరగా ఉప్పును పీల్చుకొని రుచిగా ఉంటాయి. ఉప్పు కలిపిన ఐదు నిమిషాల తర్వాత వెనిగర్‌ వేసి కలిపి కొత్తిమీర, పుదీనా ఆకులతో గార్నిష్‌ చేసుకుంటే సరిపోతుంది.

సాబుదాన…
కావలసిన పదార్థాలు: నానబెట్టిన సగ్గుబియ్యం-ఒక కప్పు, క్యాప్సికం ముక్కలు-ఒక కప్పు, క్యారెట్‌ ముక్కలు-సగం కప్పు, కీరదోసకాయ ముక్కలు-సగం కప్పు, ఉప్పు-రుచికి తగినంత, జీలకర్ర పొడి-ఒక చెంచా , తరిగిన పచ్చిమిరపకాయలు- రెండు, తరిగిన కొత్తిమీర-కొద్దిగా, నిమ్మరసం-ఒక చెంచా.
తయారీ విధానం: ముందుగా సగ్గుబియ్యం 20 నిమిషాలు నానబెట్టుకోవాలి. తర్వాత నీటిలో ఒక చెంచా ఉప్పు వేసుకొని సగ్గుబియ్యాన్ని మెత్తగా ఉడికించుకొని పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత మరో పాత్రలో క్యాప్సికం ముక్కలు, క్యారెట్‌ ముక్కలు, కీర ముక్కలు, సన్నగా తరిగిన పచ్చిమిరపకాయలు వేసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమంలో ఉడికించిన సగ్గుబియ్యం, జీలకర్ర పొడి, కొద్దిగా ఉప్పు, నిమ్మరసం, కొత్తిమీర తురుము కలుపుకుంటే సరిపోతుంది. రుచికరమైన సాబుదాన సలాడ్‌ రెడీ !


Related News

vamu

ఔషధ వాము…

Spread the loveపోపుల డబ్బాలో కాకుండా విడిగా ఓ చిన్నడబ్బాలో మాత్రమే కనిపించే వాములోని ఔషధగుణాలు అన్నీ ఇన్నీ కావుRead More

hemodialysis-artificial-kidney

కిడ్నీలో రాళ్లుంటే!

Spread the loveకిడ్నీలో రాళ్లు ఉన్నవి అని తెలియగానే చాలామంది భయపడిపోతుంటారు. రాళ్లను తొలగించుకోవడానికి పెద్దగా ట్రీట్‌మెంట్స్‌ కూడా అవసరంRead More

 • నోటి ఆరోగ్యానికి ..
 • చలిలో స్కిన్ కేర్…
 • బీరకాయతో షుగర్ కి రిలీఫ్..
 • మహిళలు 30 నిమిషాలు కేటాయిస్తే…
 • మీ గుండె పదిలమేనా?
 • చర్మ సౌందర్యం కోసం…
 • పట్టులాంటి జుట్టు కోసం ఉల్లిపొట్టు
 • చెడు కొలెస్ట్రాల్‌కు చెక్‌…
 • Leave a Reply

  Your email address will not be published. Required fields are marked *