Main Menu

ప్రశాంతంగా నిద్రపోవాలంటే…

Spread the love

మనం ఆరోగ్యంగా ఉండాలంటే నిద్ర కంటే మించినది మరొకటి లేదు. శరీర పెరుగుదల, మెదడులోని కణాలు కమ్యూనికేషన్‌ కోసం నిర్మాణాత్మకమైన మార్పులతో పాటు నిద్ర వల్ల ఇంకా చాలానే లాభాలు ఉన్నాయి. ఇక చిన్న పిల్లల ఎదుగుదలకు నిద్ర చాలా ముఖ్యమైనది. తగినంత నిద్ర వున్న పిల్లలు కొత్త విషయాల పట్ల ప్రత్యేక శ్రద్దను కలిగి ఉంటారు. అయితే నేటి జీవన శైలితో పెద్దల న ఉంచి పిల్లలకు వరకు మంచి నిద్ర కరువయింది. పిల్లలు తినే ఆహారంలో కొన్ని ప్రత్యేకమైన పదార్థాలను పెట్టగలిగితే వారు హాయిగా నిద్రపోతారు. అవేంటో తెలుసుకుందాం…

అరటి పండు: భోజనం తర్వాత అందరూ సాధారణంగా వాడే పండు అరటి. ఇందులో మెగ్నీషియం చాలా ఎక్కువగా ఉంటుంది. అయితే మరి ఈ పండు పిల్లల నిద్రకు ఎలా సహాయ పడగలదని అనుకుంటున్నారు ? మెగ్నీషియం అనేది కండరాలను సడలించేదిగా పనిచేస్తుంది. తద్వారా మొత్తం శరీరాన్ని విశ్రాంతి చెందేలా చేస్తుంది. ఇంకా అరటి నిద్రను ప్రేరేపించే హార్మోన్లు మెలటోనిన్‌, సెరోటోనిన్లను కలిగి ఉంటుంది. అందుకే పడుకునే మందు పిల్లలకు ఓ అరటి పండు పెడితే చక్కగా నిద్రపోతారు.

సాల్మన్‌: సాల్మన్‌ అనే సముద్రపు చేప నిద్రను ప్రేరేపించడంలో చాలా ఉత్తమమైనదిగా పనిచేస్తుంది. ఆహారంగా సాల్మన్‌ చేప తీసుకున్నప్పుడు మానవ శరీరంలో మెలటోనిన్‌, సెరోటోనిన్‌ ఉత్పత్తిని ప్రేరేపిస్తుంది. దీనివల్ల మంచి నిద్ర పడుతుంది. అంతేకాక సాల్మన్‌ చేపను తినటం వల్ల సన్నగా, బలహీనంగా ఉండే పిల్లలు బరువు పెరుగటానికి కూడా ఉపయోగపడుతుంది.

ఓట్స్‌: ఓట్స్‌ నాడీ వ్యవస్థను బలోపేతం చేసే విటమిన్లను, ఖనిజాలను కలిగి ఉంటుంది. అంతేకాదు ఇవి బాగా నిద్రపోయేలా చేసే మెలటోనిన్‌ హార్మోన్‌ అధిక సాంద్రతను కలిగి ఉంటాయి. అలాగే ఓట్స్‌ కార్బోహైడ్రేట్లను కూడా ఎక్కువగా కలిగి ఉంటాయి. దాంతో త్వరగా కడుపు నింపుతాయి. దాంతో నిద్ర బాగా పడుతుంది.

బచ్చలికూర: పిల్లలకు ఇచ్చే ఆహారంలో బచ్చలికూర ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. ఇది శరీరానికి అవసరమైన అన్ని రకాల విటమిన్లను, ఖనిజాలను గొప్ప మోతాదులో కలిగి ఉండడమే కాకుండా, ట్రిప్టోఫాన్‌ అనే అమైనో ఆమ్లమును కూడా ఎక్కువ మోతాదులో కలిగి ఉంటుంది. పిల్లలు నిద్రపోయే ముందు దీన్ని జ్యూస్‌లలో కూడా దీని రసాన్ని కలిపి ఇవ్వొచ్చు.

అన్నం: పిల్లలతో నిద్రలేమి సమస్యలను ఎదుర్కొంటున్నట్లయితే, వారి డిన్నర్‌ ప్లేట్లలో అన్నంను చేర్చడానికి వెనుకాడకండి. బియ్యం నిద్రను ప్రేరేపించే గ్లైసెమిక్‌ను అతి త్వరగా ఉత్పత్రి చేస్తుంది. శరీరం బాగా అలసటగా వున్నప్పుడు కడుపు నిండా భోజనం చేస్తే నిద్ర బాగా పడుతుంది.

వాల్నట్‌ : బ్రెయిన్‌-ఆకారంలో ఉండే అక్రోట్లు మెదడుకు చాలా మంచిదని చెబుతారు. ఇది బరువును తగ్గించడానికి సహాయపడుతుంది. కానీ అక్కడితో దీని ప్రయోజనాలు ముగియలేదు. వాల్నట్లలో ట్రిప్టోఫాన్‌ భారీ మొత్తంలో ఉన్నది. పిల్లలు నిద్రపోవడానికి ముందు తీపి పదార్ధాలలో వీటిని జోడించి పెట్టవచ్చు.

అనాస పండు: పైనాపిల్‌ మెలటోనిన్ను గొప్ప స్థాయిలో పెంచుతుంది. ఈ విషయం చాలామందికి తెలియదు. ఓట్స్‌, అరటి కన్నా అనాస పండులో మెలటోనిన్ను ఎక్కువగా ఉంటుంది. పైనాపిల్‌ ముక్కలను భోజనం తర్వాత తినడం వల్ల జీర్ణక్రియకు బాగా సహాయపడుతుంది.

ద్రాక్ష: నిద్రను రెగ్యులేటింగ్‌ చేసే మెలటోనిన్‌ హార్మోన్‌ ద్రాక్షలో కూడా ఉంటుంది. ద్రాక్ష రసం ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. ఫ్రూట్‌ సలాడ్లో ద్రాక్షలను కలిపి తీసుకున్నా మంచి ఫలితం ఉంటుంది.

ఎక్కువ కార్బోహైడ్రేట్లు, తక్కువ ప్రోటీన్లను కలిగి ఉన్న ఆహారం: ఎక్కువ కార్బోహైడ్రేట్లు, తక్కువ ప్రోటీన్లను కలిగి ఉన్న ఆహారం ప్రశాంతమైన నిద్రకు దారితీస్తుందని డాక్టర్లు సూచిస్తున్నారు.


Related News

వేస‌విలో కంటి ర‌క్ష‌ణ‌

Spread the loveవేసవికాలంలో సూర్యరశ్మి ప్రభావం కళ్ల మీద ఎక్కువగా ఉంటుంది. తీక్షణమైన ఎండ నుంచి సున్నితమైన కళ్లను కాపాడుకోవాలంటేRead More

బ‌రువు త‌గ్గడానికి..

Spread the loveవెయిట్ లాస్..ఇప్పుడు చాలామందిని వేధిస్తున్న స‌మ‌స్య‌. అందుకోసం చాలా ర‌కాల ప్ర‌య‌త్నాలు చేస్తూనే ఉంటారు. ముఖ్యంగా డైట్Read More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *