స్కిన్ క్రీములు తరచుగా మార్చేస్తే..!

శరీరాన్ని కాపాడుకోవడానికి తీవ్రంగా శ్రమించాల్సి వస్తోంది. మారిన లైఫ్ స్టయిల్, పెరిగిన కాలుష్యం కలిసి చాలామందిని సతమతం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో శరీర సౌందర్యాన్ని కాపాడుకోవడానికి కొన్ని చిట్కాలు పాటించాల్సి ఉంటుంది. చర్మ సంరక్షణ విషయంలో చాలామంది తెలిసో తెలియకో.. కొన్ని పొరపాట్లు చేస్తుంటారు. దీంతో చర్మానికి హాని జరుగుతుంది. అలాకాకుండా ఉండాలంటే..
– ముఖంపై మొటిమలు ఉన్నప్పుడు కొందరు వాటిని గిల్లుతూ ఉంటారు. అలా గిల్లడం వల్ల అవి ఇంకా పెరుగుతాయి. చేతుల్లోని సూక్ష్మక్రిములు చేరడమే అందుకు కారణం. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో చేతులతో వాటిని గిల్లకపోవడమే మంచిది.
– కప్పు కాఫీ తాగడం మనలో చాలామందికి అలవాటు. అవసరానికి మించి ఎక్కువ తాగడం మంచిది కాదు. దానివల్ల చర్మం పొడిబారినట్లు అవుతుంది. శరీరం తేమగా ఉంటేనే చర్మమూ ఆరోగ్యంగా ఉంటుంది. కాబట్టి కాఫీలు తగ్గించి నీళ్లూ, ఇతర ద్రవపదార్థాలు తీసుకోవడం మంచిది.
– మృతకణాలు తొలగించేందుకు రకరకాల స్క్రబ్లు వాడుతుంటాం. దానివల్ల చర్మం తాజాగా ఉంటుందనేది వాస్తవమే. అలాగని అతిగా చేస్తే… చర్మం ఇంకా పొడిబారే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. జిడ్డు చర్మం అయితే… వారంలో ఒకసారి చాలు. అదే పొడిబారిన లేదా సాధారణ చర్మతత్వం ఉన్నవారయితే ఒకటి రెండుసార్లు స్క్రబ్వాడితే సరిపోతుంది.
– చర్మ సంరక్షణకు సంబంధించిన ఉత్పత్తుల్ని తరచూ మార్చేయడం చాలామందికి అలవాటు. అలా చేయడం మంచిది కాదు. దానివల్ల చర్మం ఇంకా రాపిడికి గురై, కందిపోయినట్లు అవుతుంది.
Related News

దానిమ్మ..ఆరోగ్యం మిన్న
Spread the loveదానిమ్మ పండును ఒలుచుకుని తినడానికి ఓపిక ఉండాలే కానీ.. ఇక ఆరోగ్యానికి ఎటువంటి ఢోకా ఉండదు. దీన్లోRead More

పెరుగు..ఆరోగ్యం మెరుగు
Spread the loveమన నిత్యజీవితంలో పెరుగు ప్రాధాన్యత ఎనలేనిది. ఇందులో పుష్కలంగా ఉండే న్యూట్రిన్లు శరీరానికి ఎంతగానో ఉపయోగ పడుతాయి.Read More