గ్యాస్ సమస్యకు విరుగుడు…

gas problem
Spread the love

జీవనసరళిలో వచ్చిన మార్పుల వలన ఉదర సంబంధిత సమస్యలు రోజురోజుకూ ఎక్కువవుతున్నాయి. ముఖ్యంగా అజీర్తి, కడుపులో అసౌకర్యం పేరేదైనా గ్యాస్‌ సమస్యతో అధిక శాతం మంది ఇబ్బందులకు గురవుతున్న మాట వాస్తవం. ఇలా ప్రారంభమైన సమస్యలే క్రమేపీ దీర్ఘకాలిక వ్యాధులుగా మారుతున్నాయి. దీని వలన చికిత్స మరింత క్లిష్టతరమవుతుంది. అయితే గ్యాస్‌ సమస్య తీవ్రత తక్కువగా ఉన్నప్పుడే స్పందిస్తే ఆరోగ్యాన్ని సురక్షితంగా ఉంచుకోవచ్చు. దీనితో పాటు కొన్ని జాగ్రత్తలు పాటిస్తే గ్యాస్‌ సమస్య నుంచి ఉపశమనం పొందేందుకు వీలుంటుంది. మోతాదుకు మించకుండా చిన్న అల్లం ముక్కని భోజనం ముందు తింటూ ఉంటే పొట్టకు సంబంధించిన సమస్యలు తగ్గుముఖం పడ్తాయి.

వెల్లుల్లిలోనూ ఎన్నో ఔషధగుణాలు ఉన్నాయి. వెల్లుల్లిని ఒక పురాతన వంటింటి ఔషధంగా చెబుతారు. ఆహారంలో వెల్లుల్లిని ఎక్కువగా తీసుకున్నా గ్యాస్‌ సంబంధిత సమస్యల నుండి బయటపడవచ్చు. ఇందులో ఫైబర్‌ ఎక్కువగా ఉండటం వలన అది మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. టేబుల్‌ స్పూను జీలకర్ర పొడిని ఏదో ఒక ఆహారంలో చేర్చుకుని తీసుకుంటే అనుకోకుండా ఎదురయ్యే గ్యాస్‌ సమస్య నెమ్మదిస్తుంది. ఉదయాన్నే ఏమీ తినకుండా తులసి ఆకుల నుండి తీసిన రసాన్ని మంచినీళ్లలో కలిపి తాగుతుంటే క్రమంగా జీర్ణశక్తి మెరుగుపడుతుంది. అలాగే పుదీనా ఆకులతో తయారుచేసిన టీ కూడా గ్యాస్‌ సమస్యలను దూరం చేస్తుంది.






Related News

gas problem

గ్యాస్ సమస్యకు విరుగుడు…

Spread the loveజీవనసరళిలో వచ్చిన మార్పుల వలన ఉదర సంబంధిత సమస్యలు రోజురోజుకూ ఎక్కువవుతున్నాయి. ముఖ్యంగా అజీర్తి, కడుపులో అసౌకర్యంRead More

fat

కొవ్వు క‌రిగించేద్దాం..

Spread the loveవ‌ర్త‌మాన స‌మాజంలో అతి పెద్ద స‌మ‌స్య కొవ్వు. ఆహార‌పు అల‌వాట్ల‌లో మారిన ప‌రిస్థితుల మూలంగా అంద‌రిలో పేరుకుపోతున్నRead More

  • జుట్టు స‌మ‌స్య‌కు చెక్ పెట్టు..!
  • కొలెస్ట్రాల్ కి విరుగుడుగా…
  • సమ్మ‌ర్ లో స్కిన్ కేర్
  • వేస‌విలో ఇలా..
  • పెరుగుతో హైబీపీకి చెక్
  • బరువే భారం అయితే…
  • బరువు తగ్గాలంటే ఇలా చేయాలి…
  • ప్రశాంతంగా నిద్రపోవాలంటే…
  • Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *