Main Menu

ఒత్తిడి అధిగ‌మించాలంటే..!

Spread the love

అనారోగ్యాలకు ఒత్తిడే కారణమని పలు అధ్యయనాల్లో వెల్లడైంది. మైగ్రేన్‌, అల్సర్లు, గుండె జబ్బులు, ఐబీఎస్‌, బీపీ, మధుమేహం వంటి వ్యాధులకు కూడా కారణం ఇదే అంటున్నారు వైద్యులు. ”ఒత్తిడికి గురైన వ్యక్తుల్లో స్ట్రెస్‌ హార్మోన్స్‌ విడుదలై శరీరంలో ఎన్నో మార్పులు కలుగజేస్తాయి. హార్ట్‌రేట్‌, బ్లడ్‌షుగర్‌ లెవల్స్‌ పెరుగుతాయి. అంతేకాదు కొన్నిసార్లు పరిస్థితి తీవ్రతను బట్టి చనిపోయే ప్రమాదం ఉంటుందని చెబుతున్నారు నిపుణులు. ఒత్తిడిని తగ్గించుకోవటానికి అనేక మార్గాలు ఉన్నాయి. వాటిగురించి తెలుసుకుని ఆచరించగలిగితే చాలావరకూ ఒత్తిడి నుండి బయటపడొచ్చు.

ఒత్తిడి అందరిల్లోనూ కనిపిస్తుంది. ఎల్‌కేజీ చిన్నారులు కూడా ఒత్తిడి ఎదుర్కొంటున్నారు అనడంలో అతిశయోక్తి లేదు. ఒత్తిడి నుంచి ఉపశమనం పొందడానికి పలువురు పలు రకాలుగా ప్రయత్నిస్తూనే ఉన్నారు. సాధారణంగా ఒత్తిడికి గురైనప్పుడు ‘పారాసింపథటిక్‌ నెర్వ్‌ససిస్టమ్‌’ వెంటనే పనిచేయడం మొదలుపెడుతుంది. ఒత్తిడి నుంచి సాధారణస్థితికి వచ్చేందుకు అది సాయపడుతుంది. దీనినే ‘రిలాక్సేషన్‌ రెస్పాన్స్‌’ అంటారు. అయితే ఇది కొంతమందిలో విఫలమైనప్పుడు ఒత్తిడి విపరీతంగా పెరిగిపోయి, నరాలు చిట్లిపోయే ప్రమాదం కూడా ఉంది.

దీనికి పరిష్కారం ఏమిటంటే.. ఒత్తిడిని పెంచుకోకుండా ఉండాలి. యోగాలాంటివి చేయాలి. విపరీతమైన ఒత్తిడికి గురైన వారిలో ఎక్కువమంది దురలవాట్లకు బానిసలవుతున్నారు. యోగా ద్వారా ఒత్తిడిని అధిగమించవచ్చు. చాలా సింపుల్‌ ఆసనాలతోనే మనసు ప్రశాంతంగా ఉంచుకోవచ్చు అన్నారు యోగా నిపుణులు. యోగా, మెడిటేషన్‌ల ద్వారా ఒత్తిడిని చాలావరకూ అధిగమించవచ్చు.






Related News

వేస‌విలో కంటి ర‌క్ష‌ణ‌

Spread the loveవేసవికాలంలో సూర్యరశ్మి ప్రభావం కళ్ల మీద ఎక్కువగా ఉంటుంది. తీక్షణమైన ఎండ నుంచి సున్నితమైన కళ్లను కాపాడుకోవాలంటేRead More

బ‌రువు త‌గ్గడానికి..

Spread the loveవెయిట్ లాస్..ఇప్పుడు చాలామందిని వేధిస్తున్న స‌మ‌స్య‌. అందుకోసం చాలా ర‌కాల ప్ర‌య‌త్నాలు చేస్తూనే ఉంటారు. ముఖ్యంగా డైట్Read More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *