మిరియాలు మేలు చేస్తాయి..!

miriyalu
Spread the love

మిరియాలు ఆరోగ్యానికి ఎన్నో విధాలుగా ఉపయోపడతాయి. మిరియాల్లో ఉండే పేపైరిన్‌ అనే పదార్థం క్యాన్సర్‌ కణాలను నాశనం చేస్తుంది. దాంతో పాటు అజీర్తి సమస్యను దూరం చేయడంలో సహాయపడుతుంది. అందు వల్ల ప్రతి వంటకంలో రుచి కోసం కొద్దిగా మిరియాల పొడి వేసుకుంటే సరి పోతుంది. ఇలా చేయడం వల్ల ఆరోగ్య పరంగా వచ్చే వ్యాధులు తగ్గిపోతాయి.

మిరియాల్లో ఎక్కువగా ఐరన్‌, పొటాషియం, జింక్‌, క్రోమియమ్‌, విటమిన్‌ ‘ఎ’, ‘సి’ ఉంటాయి.

నల్ల మిరియాలు ముఖ్యంగా క్యాన్సర్‌ కణాలను నాశనం చేసే పేపైరిన్‌ అనే పదార్థాన్ని విడుదల చేస్తుంది. నల్ల మిరియాలు బ్రెస్ట్‌ క్యాన్సర్‌ రాకుండా కాపాడతాయి. దీంట్లో విటమిన్‌ ‘ఎ’, ‘సి’ లు సమృద్ధిగా ఉంటాయి. వీటిలో ఉండే ఫ్రీ రాడికల్స్‌ హానికర కణాలను తొలగిస్తాయి.

అలాగే మిరియాల్లో ఉండే ఫైటోన్యూట్రీన్లు శరీర బరువును అదుపులో ఉంచుతాయి. నల్లమిరియాలు ముఖ్యంగా శిశువు కు అవసరమైన పోషకాలను అందించడానికి ఉపయోగపడతాయి.

అసిడిటీ, అజీర్తి సమస్యలను దూరం చేయడంలో కీలక పాత్ర పోషిస్తాయి మిరియాలు. ఇవి హైడ్రో క్లోరిక్‌ ఆమ్లాన్ని శరీరంలోకి విడుదల చేసి ఆహారం త్వరగా జీర్ణమయ్యేలా సహాయపడతాయి.

అలాగే మిరియాలు యాంటీ బ్యాక్టీరియల్‌, యాంటీ ఆక్సిడెంట్‌ లక్షణాలను కలిగి ఉంటాయి. ఇది చర్మ, మొటిమల సమస్యలను దూరం చేస్తాయి. కాబట్టి ప్రతిరోజు తీసుకునే ఆహారంలో కొద్దిగా మిరియాల పొడిని కలుపుకుంటే సరిపోతుంది.


Related News

veg salad

పచ్చి కాయగూరలతో పసందుగా..!

Spread the love చాలా మంది ఎక్కువగా ప్రై చేసిన ఆకుకూరలు, వేపుళ్లను తినడానికి ఇష్టపడుతున్నారు. అలా తినడం వల్లRead More

weight yoga

తింటే తగ్గుతారు…

Spread the loveపొట్టతగ్గాలంటే తక్కువ తినాలనుకుంటారు చాలా మంది. కానీ కొన్నింటిని ఎక్కువగా ఆహారంలో తీసుకున్నా పొట్ట తగ్గుతుంది. అవేంటంటే…Read More

 • మిరియాలు మేలు చేస్తాయి..!
 • నిమ్మ‌ర‌సం చేయు మేలు..!
 • చుండ్రు స‌మ‌స్య వైదొల‌గ‌డానికి మార్గాలు
 • బ‌రువు బెంగ తీర‌డానికి…!
 • బ‌రువు త‌గ్గాల‌నుకుంటున్నారా..అయితే
 • మ‌ధుమేహానికి నిద్ర‌మందు..!
 • ఆరోగ్యానికి ఇవి అవ‌స‌రం!
 • బరువు తగ్గించే నీళ్లు…
 • Leave a Reply

  Your email address will not be published. Required fields are marked *